E.G: గోపాలపురం యూనిట్ APJAC పున:వ్యవస్తీకరణ బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జోడాల వెంకటేశ్వరరావు ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. అలాగే సెక్రటరీగా బి.బుచ్చిబాబు, ట్రెజరర్ పి.పాపారావు, వైస్ ఛైర్మన్లుగా డి.మనోజ్ కుమార్, బి.ఐ.బెనర్జీ, డి.ప్రసన్న కుమార్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక జిల్లా APJAC ఛైర్మన్ మీసాల మాధవరావు సమక్షంలో జరిగింది.
AKP: జిల్లాకు చెందిన బీజేపీ క్రియాశీలక సభ్యులతో ఎంపీ సీఎం రమేష్ బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తెలిపారు. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందన్నారు. పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కార్యాచరణ, గ్రామస్థాయి బాధ్యతలు తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు.
E.G: ధర్మవరంలో అంబేడ్కర్ జయంతి వేడుకలను శాంతియుతంగా నిర్వహించాలని కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి మంగళవారం సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా బాబా సాహెబ్ ఆశయాలను పాటించాలన్నారు. పిల్లలకు అంబేడ్కర్ సిద్ధాంతాలపై పరీక్షలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని గ్రామస్థులకు తెలిపారు. ఆయన గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలని సూచించారు.
ELR: జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, ఆర్డీఓ కిషోర్, మంగళవారం పెదనిండ్రకొలనులో పర్యటించారు. గ్రామంలో హౌసింగ్ కాలనీ పాత లే ఔట్, కొత్త లే ఔట్లను పరిశీలించారు. లబ్ధిదారుల కోరిక మేరకు 2 లే ఔట్లను ఒకే లే అవుట్ గా బదిలీ చెయ్యడానికి ప్రపోజల్స్ సిద్ధం చేశారు. వారి వెంట తహశీల్దార్ బొడ్డేపల్లి దుర్గాప్రసాద్, డీటీ, వీఆర్ఓలు ఉన్నారు.
సత్యసాయి: పెనుకొండలో కొత్త తహసీల్దార్ కార్యాలయ భవనం మంజూరు చేయాలని కోరుతూ ఏపీ రెవెన్యూ సేవల సంఘం ప్రతినిధులు మంత్రి సవితకు వినతిపత్రం అందజేశారు. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో ప్రస్తుత భవన పరిస్థితులను వివరించిన రెవెన్యూ సిబ్బంది, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా నూతన భవనం నిర్మించాలని కోరారు.
PPM: పంచాయతీ అభివృద్ధి అధికారుల వేతన సవరణపై వ్యతిరేక స్వరం వినిపిస్తోంది. వేతనాలు తగ్గించబడిన నేపథ్యంలో అసంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు వీరఘట్టం, గరుగుబిల్లి, భామిని మండలాల్లో మంగళవారం ఎంపీడీవోలను కలిసి తమ అభ్యంతరాలు తెలియజేశారు. సంబంధిత జీవో నంబర్ 60ను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అన్నమయ్య: వీరబల్లి మండలంలో బుధవారం రాజంపేట అసెంబ్లీ టీడీపీ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పర్యటించనున్నారు. సంఘం వాళ్ళ పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గ్రందెవాండ్లపల్లి, పిచ్చిగుంటపల్లి గ్రామాల్లో ఉదయం 10 గంటలకు పలు త్రాగునీటి బోర్ల భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా హాజరుకావాలని పార్టీ వర్గాలు కోరాయి.
AKP: ఎలమంచిలి మండలంలో పలు గ్రామాలకు బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాజశేఖర్ తెలిపారు. నిర్వహణ పనులు చేపడుతున్న కారణంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పురుషోత్తపురం, బయ్యవరం, పులపర్తి, లక్కవరం, రేగుపాలెం, రుక్మిణీపురం, లైన్ కొత్తూరు, పీఎన్ఆర్ పేట, పోతిరెడ్డిపాలెం తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
కోనసీమ: అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రావులపాలెం రూరల్ CI సిహెచ్ విద్యాసాగర్ పిలుపు నిచ్చారు. ఈ నెల 14న జరగనున్న జయంతి ఉత్సవాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి బొబ్బర్లంక, పేరవరం గ్రామస్తులతో మంగళవారం రాత్రి సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు.
కోనసీమ:కె.గంగవరం మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి దాళ్వా, వరిచేలు నేలకొరిగాయి. కోతలు ప్రారంభమయ్యే తరుణంలో ప్రకృతి వైపరీత్యం సంభవించడంతో దిగుబడి తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నేలపాలవ్వడంతో పెట్టుబడి వ్యయం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
CTR: పుంగనూరులోని బీఎంఎస్ క్లబ్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం ఈనెల 12న నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ శివ తెలిపారు. వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. శిబిరానికి హాజరయ్యే వారు తమ ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, బ్యాంక్ పాసుపుస్తకం తీసుకుని తప్పక రావాలని సూచించారు.
KDP: ప్రొద్దుటూరు పట్టణం రామేశ్వరం రోడ్డులోని డ్రైనేజీ కాలువలో మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై 1టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నూర్ బాషా, కార్మికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆరా తీస్తున్నారు.
KDP: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగించిన వారిపై పోలీసులు ఉక్కు పాదం మోపారు. జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై 267 కేసులు నమోదు చేసి రూ.57,900 జరిమానాలు విధించారు. పోలీసులు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.
W.G: జిల్లాలో రేషన్ దుకాణాల్లో కందిపప్పు సరఫరా నిలిచిపోవడంతో తెల్ల కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ షాపులో రూ.67లకే లభించే కిలో కందిపప్పు బహిరంగ మార్కెట్లో రూ.140 కి పైగా పలుకుతోంది. అధిక ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే కోటా ప్రకారం కందిపప్పును సరఫరా చేసి పేదలను ఆదుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు
VZM: గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలు నివారణకు ప్రతి కదలికపై నిఘా పెట్టాలని మహిళా సంరక్షణ అధికారులను పట్టణ సీఐ కె.నారాయణరావు ఆదేశించారు. బొబ్బిలి పట్టణ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. గ్రామాలలో గంజాయి నివారణ ప్రతి కదలికను గమనించలన్నారు. సైబర్ నేరాలు బారిన పడకుండా ప్రజలను చైతన్యం చేయాలన్నారు. శక్తి యాప్‌ను ఇంస్టాల్ చేపించాలని కోరారు.