• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ఎండల తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి’

NLR: ఎండల తీవ్రత పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఖాదరవల్లి సూచించారు. సోమవారం ఇందుకూరుపేట మండలం జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిధిలో వైద్య సిబ్బంది పర్యటించారు. సన్ స్ట్రోక్ ఎక్కువ ఉన్నందున ఓఆర్ఎస్, అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

April 6, 2026 / 03:10 PM IST

తిరుపతి- చిత్తూరు మీదుగా బుల్లెట్ ట్రైన్స్.!

తిరుపతి, చిత్తూరు జిల్లా మీదుగా 2 హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. మైసూరు-చెన్నై కారిడార్‌లో భాగంగా CTR- TPT మీదుగా నాయుడుపేటకు లింక్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు కోరగా కేంద్రం అమోదించింది. దీంతో నెల్లూరు, నాయుడుపేట, శ్రీసిటీ మీదుగా చెన్నైకి ఒక కారిడార్, నాయుడుపేట, TPT, CTR, బంగారుపేట, బెంగళూరు, మండ్య మీదుగా మైసూరుకు మరో కారిడార్ ఏర్పాటు కానుంది.

April 6, 2026 / 03:02 PM IST

‘నిరుపేదల ఆరోగ్యానికి సంజీవనిలా CMRF’

E.G: నిరుపేదల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఆపదలో ఉన్న వారికి CMRF ఒక సంజీవనిలా మారుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం పెరవలి మండలం తీపర్రులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 108 మంది లబ్ధిదారులకు రూ. 54,45,187 విలువైన CMRF చెక్కులు & LOC పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

April 6, 2026 / 03:00 PM IST

తాడేపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు

GNTR: తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సలాం సెంటర్ ప్రాంతంలో సోమవారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు, నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలో, సీఐ వీరేంద్రబాబు నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

April 6, 2026 / 03:00 PM IST

జిల్లాలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు

BPT: ఈ నెల 9న సీఎం చంద్రబాబు సూరేపల్లెకు రానున్నారు. ఆయన పర్యటనకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్ క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించారు. సీఎం పర్యటనలో భద్రత, ప్రోటోకాల్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

April 6, 2026 / 03:00 PM IST

వాహనాలు నడిపే మైనర్లకు కౌన్సెలింగ్

VZM: బొండపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై మహేష్ సోమవారం మైనర్ వాహన చోదకులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టంపై అవగాహన కల్పించారు. లైసెన్స్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను వివరించి, వారితో ప్రతిజ్ఞ చేయించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

April 6, 2026 / 02:54 PM IST

కోవెలకుంట్లలో ఘనంగా BJP ఆవిర్భావ వేడుకలు

NDL: కోవెలకుంట్లలో సోమవారం బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల అధ్యక్షుడు లోకేశ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

April 6, 2026 / 02:36 PM IST

ప్రజా దర్బార్ కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలు అన్నిటినీ పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అశోక్ రెడ్డి పేర్కొన్నారు.

April 6, 2026 / 02:35 PM IST

మొక్కజొన్న రైతుల సమస్యల పరిష్కారనికి జేసీకి వినతి

NTR: విజయవాడలో జిల్లా కలెక్టరేట్ వద్ద మొక్కజొన్న రైతుల సమస్యలపై ఆందోళన జరిగింది. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు రైతులతో కలిసి పీజీఆర్ఎస్‌లో వినతిపత్రం అందించారు. గిట్టుబాటు ధర కల్పించి, నందిగామ డీస్టీలరీలు రైతుల నుంచి పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు.

April 6, 2026 / 02:35 PM IST

అభివృద్ధిపై సీఎంతో చర్చించిన ఎమ్మెల్యే

ATP: యాడికి పర్యటనకు విచ్చేసిన CM చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే పరిటాల సునీత ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ కీలక నేతలతో కలిసి ఆమె ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చి జై బాబు నినాదాలతో హోరెత్తించారు.

April 6, 2026 / 02:30 PM IST

రోడ్ల నాణ్యతపై రాజీ ఉండకూడదు: కమిషనర్

E.G: రోడ్ల నిర్మాణం, నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలపై ఎలాంటి రాజీ ఉండకూడదని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. ఆదర్శ్ నగర్, మహాలక్ష్మి టెంపుల్ పార్క్ వద్ద ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పనులను ఇవాళ పరిశీలించారు. పూర్తి చేసిన రహదారుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తూ.. క్వాలిటీ కంట్రోల్ అధికారులు పనులను కచ్చితంగా తనిఖీ చేయాలని ఆదేశించారు.

April 6, 2026 / 02:30 PM IST

నగరపాలక అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష

CTR: చిత్తూరు నగరపాలక కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరపాలక, పట్టణాభివృద్ధి సంస్థల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, మంత్రి వివరించారు. పురపాలక పన్నుల వసూళ్లపై దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

April 6, 2026 / 02:30 PM IST

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1.10 కోట్లతో కట్టవాని చెరువు–తాడిచర్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి, పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పాడి రైతులకు ఉచిత మందులు పంపిణీ చేశారు. గ్రామాల అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

April 6, 2026 / 02:29 PM IST

‘8న కొడవలూరు మండల సాధారణ సమావేశం’

NLR: కొడవలూరు మండల ప్రజా పరిషత్ సాధారణ సమావేశాన్ని ఈనెల 8వ తేదీన ఉదయం 10:30కు నిర్వహిస్తున్నట్లు మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి వెంకట సుబ్బారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలో ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.

April 6, 2026 / 02:20 PM IST

‘నీటి సంరక్షణలో సాగునీటి సంఘాల బాధ్యత కీలకం’

VSP: నీటి భద్రతలో సాగునీటి సంఘాల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. పెందుర్తి మండలం సరిపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో కాలువల పూడికతీత, నీటి వృథా నివారణపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు.

April 6, 2026 / 02:14 PM IST