PPM: వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రక్తదానం మహాదానమని, ప్రజలు రక్తదానం పట్ల ఉన్న అపోహలను వీడి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మనం ఇచ్చే రక్తం మరొకరికి పునర్జన్మను ప్రసాదిస్తుందని గుర్తు చేశారు.
SKLM: ఉపాధి హామీ పనుల్లో ఫేస్ యాప్ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. హిరమండలం మండలం గుళుమూరులో శుక్రవారం ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో ప్రవేశపెట్టిన ఈపద్ధతి వలన కొంతమందికి హాజరుపడక ఇబ్బంది పడుతున్నారని, దీనివలన వేతనం నష్టపోతున్నారన్నారు.
ATP: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశమైంది. ఈ భేటీలో ఉమ్మడి అనంతపురం జిల్లా మంత్రులు పయ్యావుల కేశవ్, సవిత, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
CTR: రేణిగుంట పట్టణంలోకి వచ్చే ప్రధాన మార్గంలోని రైల్వే అండర్ బ్రిడ్జిని ఈనెల 13వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు మూసివేస్తామని అధికారులు ప్రకటించారు. అత్యవసర మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. టూ వీలర్లు, త్రీ వీలర్లు సంత గేటు మార్గంలో, ఫోర్ వీలర్లు, భారీ వాహనాలు నారాయణాద్రి ఆసుపత్రి మీదుగా వెళ్లాలని సూచించారు.
CTR: నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ పాల్గొన్నారు . కళాశాలలో రూ. 35 లక్షలతో నిర్మించిన కొత్త సెమినార్ హాల్లును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.
W.G: మొగల్తూరు మండలం వారతిప్పలో జోరుగా కోడిపందేలు సాగుతున్నాయి. నిషేధం అమలులో ఉన్నా నిర్వాహకులు బహిరంగంగానే స్థావరాలు ఏర్పాటు చేసి పందేలు నిర్వహిస్తున్నారు. లక్షలాది రూపాయల నగదు చేతులు మారుతుండటంతో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి ఈ జూదాన్ని అరికట్టాలని తెలిపారు.
BPT: కొత్తపేట సంపత్ నగర్లో నూతనంగా నిర్మించిన Chirala Aromas Restaurantను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్‌ను ప్రారంభించిన అనంతరం, వారు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
GNTR: విదేశీ నిధుల నియంత్రణ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలించి, ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ హక్కులను కాపాడాలని, మతం మారితే ఎస్సీ హోదా రద్దు అన్యాయమని మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు పేర్కొన్నారు. క్రైస్తవ మతం మారితే ఎస్సీ హోదా రద్దు, ఎఫ్సీఆర్ఏ నియంత్రణ సవరణ బిల్లును పునః పరిశీలించాలని విలేకరుల సమావేశంలో ఆయన కోరారు.
W.G: పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామివారిని స్విట్జర్లాండ్ సాఫ్ట్వేర్ సంస్థ సీఈఓ, పాలకొల్లుకు చెందిన బి.సత్యనారాయణ రాజు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ మీసాల రామచంద్రరావు, సూపరింటెండెంట్ వాసు, తదితరులు పాల్గొన్నారు.
E.G: గోపాలపురం నియోజకవర్గ కూటమి నాయకులతో కలిసి శుక్రవారం తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శుక్రవారం దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి, శాంతి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు మంచి జరగాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులతో జీవించాలని స్వామి వారి ఆశీస్సులు కోరుకున్నారు.
GNTR: తెనాలి పట్టణంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని 14, 28, 31వ వార్డుల్లో కమిషనర్ పర్యటించారు. ఆ వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వేగవంతంగా జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు.
NTR: కంచికచర్ల మండలం కీసర గ్రామంలో శుక్రవారం రూ.36 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలు, అధికారులతో కలిసి భూమి పూజ (శంకుస్థాపన) కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సమీపంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు.
ఏలూరు ఎంపీ కార్యాలయంలో శుక్రవారం ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. జిల్లా దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేకులు కట్ చేసి సంబరాలు జరిపారు. ఏరియా ఆసుపత్రిలో రోగులకు పాలు, పళ్ళు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఆరోపణల నుంచి బయటకు వచ్చి ఎంపీ మళ్లీ ప్రజాసేవకు అంకితం కావాలని కోరారు.
కోనసీమ: రావులపాలెంలోని శ్రీ సత్యసాయి సేవా కేంద్రం నందు శుక్రవారం నుండి ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టెన్త్ పాస్ అయిన అభ్యర్థులకు కంప్యూటర్ డీసీఏ కోర్సు ఉచితంగా నేర్పబడునని పేర్కొన్నారు. శిక్షణ పొందేవారు శుక్రవారం నుండి జరిగే శిక్షణలో పాల్గొని పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
SKLM: ప్రస్తుత సీజన్లో ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని పాతపట్నం ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ ఎస్. ఉమాగౌరీ అన్నారు. AP మోడల్ ప్రైమరీపాఠశాలలో శుక్రవారం ప్రపంచ హోమియో దినోత్సవం నిర్వహించారు. మండుటెండలో ఆరుబయటకు వెళ్లడం వలన వడదెబ్బకు గురయ్యే పరిస్థితి ఉందని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.