అన్నమయ్య: మదనపల్లె నియోజకవర్గం నీటుగట్టువారిపల్లి శాంతినగర్‌లో నూతనంగా వెలసిన చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శనివారం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాటకొండ శ్రీనివాసులు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం: అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించిన సందర్భంగా కనిగిరి అమరావతి గ్రౌండ్స్‌లో పార్టీ శ్రేణులతో కలిపి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి దీపాలు వెలిగించి ఆనందం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధికి ఇది కీలక ముందడుగు అని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి చట్టబద్ధత లభించడం సంతోషదాయకమన్నారు.
KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 పరిధి బంగారుపేట గ్రామంలో వెలసిన శ్రీ భద్రావతి భావనారాయణ, సీతారాముల సంయుక్త దేవాలయంలో శనివారం రాత్రి సీతారాముల కళ్యాణం మహోత్సవం వైభవంగా జరిగింది. పూజారులు వేద మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
NDL: జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా ఇంఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ RWS అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో బడ్జెట్ అవుట్అచ్ 2026-27 కార్యక్రమం నిర్వహించారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలన్నారు.
KRNL: నేటి నుంచి 14 వరకు ‘సూర్యఘర్ ఉత్సవ్’ నిర్వహిస్తున్నట్లు APSPDCL సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. 9 జిల్లాల్లో 25 వేల ఎస్సీ, ఎస్టీ ఇళ్లపై రూఫప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటు లక్ష్యంగా పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వెల్లడించారు.
NDL: మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ ఉదయం పార్టీ కార్యాలయం నుంచి మార్నింగ్ వాక్‌లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉదయం 6 గంటలకు డోన్‌లోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకోవాలని పార్టీ కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
AKP: పైడిపాల జంక్షన్‌లో వాహన తనిఖీల్లో బూరుగుపాలెం వైపు నుండి ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్ పై తరలిస్తున్న 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. నిందితులు నీలంపేటకు చెందిన నడిపింటి సతీష్, గొలుగొండ మండలం రామచంద్రాపురంకి చెందిన కోలా రామ్ పండుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై దామోదర్ నాయుడు తెలిపారు.
VSP: జ్ఞానాపురంలోని శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం మే 12 నుంచి 17 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సి.హెచ్. వంశీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. జాతరను వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. సమావేశంలో ఆలయ అధికారులు, దేవదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
KRNL: పెద్దకడబూరు మండలంలో ప్రజా సమస్యలపై TDP రాష్ట్ర రైతు ప్రతినిధి రమాకాంత్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి శశిరేఖ ఇవాళ జిల్లా కలెక్టర్ ఏ.సిరిని కలిశారు. కలెక్టర్ ఛాంబర్‌లో రైతుల ఇబ్బందులు, తాగునీరు, రహదారులు, సాగునీటి కొరత వంటి సమస్యలను వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారం కోరారు. సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని టెక్‌వేవ్స్ ట్రైబ్ అకాడమీ తొలి వార్షికోత్సవం సందర్భంగా DSP భార్గవి అకాడమీ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, MERN ఫుల్ స్టాక్ వంటి రంగాల్లో శిక్షణతో విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని తెలిపారు. స్థానిక యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
PLD: పీహెచ్సీ పనితీరు ర్యాంకింగ్స్‌లో ఫిబ్రవరి 2026కు సంబంధించి జిల్లా 11వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 39 పీహెచ్సీలలో 7 ఏ గ్రేడ్, 23 బీ, 9 సీ గ్రేడ్లు సాధించాయి. మొత్తం 195 మార్కుల్లో 154 మార్కులు పొందింది. వెనుకబడిన ప్రాంతాలలో సేవలు మెరుగుదల అవసరం ఉన్నప్పటికీ మొత్తం ఆరోగ్య సేవల నాణ్యత క్రమంగా పెరుగుతుందని అధికారులు తెలిపారు.
GNTR: పొన్నూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చెక్కులు పంపిణీ చేశారు. నలుగురు బాధిత కుటుంబాలకు రూ.7 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు సాయం అందించారు. బాజీకి రూ.2 లక్షలు, కోటేశ్వరరావుకు రూ.2 లక్షలు, కుద్దుస్‌కు రూ.లక్ష, మస్తాన్ వలీకి రూ.2 లక్షలు ఇచ్చారు.
BPT: స్టువర్టుపురం ఐదో గ్యాంగ్ వెనుక చెరువులో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. నీటిలో శవం ఉండటాన్ని వీఆర్వో గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి వయసు 40-45 ఏళ్లు ఉంటుంది. వయొలెట్ టీషర్ట్, గ్రీన్ షార్ట్, లుంగీ ధరించాడు. ఘటనపై వెదుళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిస్తే ఎస్హెచ్ఓకు సమాచారం ఇవ్వాలని కోరారు.
NTR: నందిగామలో మాంసం షాపులు, హోటళ్లకు రేపటి నుంచి అనుమతి ఇచ్చారు. చందాపురం గ్రామంలో ఆరోగ్య పరిస్థితి అదుపులోకి రావడంతో పాటు గత ఐదు రోజులుగా కొత్త కేసులు నమోదు కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 5 నుంచి గొర్రె, మేక, కోడి, చేపలు తదితర మాంసం తాజాగానే వధించి విక్రయించాలని అధికారులు సూచించారు. నిల్వ మాంసం విక్రయానికి అనుమతి లేదని తెలిపారు.
AKP: పీఎం, సీఎం, డిప్యూటీ సీఎంను పొగుడుతూ జగన్‌ను తిట్టడానికే హోం మంత్రి వంగలపూడి అనితకు సమయం సరిపోతుంది అని పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కంబాల జోగులు విమర్శించారు. శనివారం నక్కపల్లిలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, గంజాయి రవాణా జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇక నుంచి చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతామన్నారు.