• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

హృదయాలయంకు భారీ విరాళం..!

TPT: తిరుపతికి చెందిన కే.అనంతమ్మ పుట్టినరోజు సందర్భంగా, ఆమె కుమార్తె శారద కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంకు రూ.10 లక్షల విరాళం అందజేశారు. బుధవారం ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో విరాళం డీడీని డైరెక్టర్ డా. శ్రీనాథ్ రెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో డా. భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

April 8, 2026 / 05:42 PM IST

విశాఖ చేరుకున్న డిప్యూటీ సీఎం

VSP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. ఆయనకు విశాఖ ఎయిర్ పోర్ట్‌లో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన ఆంధ్ర యూనివర్సిటీకి బయలుదేరి వెళ్లారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ‘శతాబ్ది మహోత్సవ్ – ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్ 2026’లో ఆయన పాల్గొంటారు.

April 8, 2026 / 05:38 PM IST

‘భవిష్యత్తు తరాల కోసం నీటి వనరులను కాపాడుకోవాలి’

ELR: భవిష్యత్తు తరాల కోసం నీటి వనరులను కాపాడుకోవాలని కలెక్టర్ వెట్రి సెల్వి, ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. బుధవారం ఉంగుటూరు ఎంపీడీవో కార్యాలయంలో 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు విధానం, పనుల ప్రాధాన్యత, నిధుల వినియోగం, పారదర్శకతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి సంరక్షణను సామాజిక ఉద్యమంలా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

April 8, 2026 / 05:38 PM IST

‘రీ సర్వే పనుల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి’

E.G: ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్ పనులను కలెక్టర్ కీర్తి చేకూరి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ.. భూముల రీ-సర్వే ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరగాలని స్పష్టం చేశారు. ప్రతి రైతుకు సరైన సమాచారం అందించి వారి సమక్షంలోనే కొలతలు చేపట్టాలన్నారు.

April 8, 2026 / 05:38 PM IST

ఈనెల 15న జువ్వలదిన్నెకు జగన్ రాక

NLR: బోగోలు మండలంలో ఈ నెల 15వ తేదీన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మండలంలోని జువ్వల దీన్నేకు వచ్చి మత్స్యకారులతో మాట్లాడుతారని వైసీపీ కార్యాలయ సిబ్బంది ప్రకటను విడుదల చేసింది. ఈ కార్యక్రమాన్ని వైసీపీ నేతలు కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు.

April 8, 2026 / 05:35 PM IST

రేపటి నుంచి వాహన పటుత్వ పరీక్షలు అన్నంగిలో

ప్రకాశం: ఒంగోలు, దర్శి, కందుకూరు, మార్కాపురం రవాణా కార్యాలయాల్లో జరుగు వాహన పటుత్వ పరీక్షలు (ఎఫ్‌సీ) రేపటి నుంచి మద్దిపాడు మండలం అన్నంగి వద్ద ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ (ATS) జరుపబడతాయని ఉప రవాణా కమిషనర్ సుశీల అన్నారు. 8వ తేదీకి ముందు స్లాట్స్ బుక్ చేసుకున్న వారు క్యాన్సిల్ చేసుకుని 9వ తేదీ నుంచి చేసుకోవాలని ఉప రవాణా కమిషనర్ సుశీల తెలిపారు.

April 8, 2026 / 05:30 PM IST

ఎంపీడీవోకు సీపీఐ నాయకుల వినతి

ATP: గుంతకల్లు మండలంలో పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఐ నాయకులు ఎంపీడీవో దేవదాసుకు వినతి పత్రం అందజేశారు. సీపీఐ మండల కార్యదర్శి రాము రాయల్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధి కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

April 8, 2026 / 05:28 PM IST

లో వోల్టేజ్ నివారణ కోసం 130 ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు

W.G: ఉండి నియోజకవర్గంలో వోల్టేజ్ అధిగమించడానికి నియోజకవర్గంలో మొత్తం 130 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు ఏడీ వీ. శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. నాణ్యమైన విద్యుత్ అందించాలని నియోజకవర్గంలో పలు ప్రాంతాలను గుర్తించి, లో వోల్టేజ్ నివారణ కోసం ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.

April 8, 2026 / 05:27 PM IST

టెంకాయ కొడుతుండగా విద్యుత్ షాక్

NDL: కొలిమిగుండ్ల మండలం మదనంతపురం గ్రామంలో ఇవాళ పెళ్లి ఇంట విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గంగ శివుడు టెంకాయ కొడుతుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. గంగ శివుడు తన అన్న కుమారుడు వివాహ వేడుకల రోజు మృత్యువాత పడడం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుని కుటుంబ సభ్యులు బోరుమని విలపించారు.

April 8, 2026 / 05:20 PM IST

‘భూ సేకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’

SKLM: మందస మండలం భేతాళపురం రైతులు కార్గో ఎయిర్‌పోర్ట్ భూసేకరణపై గళమెత్తారు. ప్రతిపాదిత భూముల జాబితాను తీవ్రంగా వ్యతిరేకిస్తూ పలాస ఆర్డీవో కార్యాలయం, తహసీల్దార్ శ్రీకాంత్‌కు వినతిపత్రాలు అందజేశారు. తమ జీవనాధారమైన భూములను లాక్కోవద్దని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

April 8, 2026 / 05:17 PM IST

చినభోగిలిలో సంచార వైద్య సేవలు

PPM: సీతానగరం మండలం చినభోగిలిలో బుధవారం 104 వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 45 మందికి వైద్య పరీక్షలు చేసి నెలకు సరిపడా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLHP నవీన్ మాట్లాడుతూ.. ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువగా ఉన్నందున మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎండలో తిరగడం పూర్తిగా నివారించాలన్నారు.

April 8, 2026 / 05:14 PM IST

రెవెన్యూ అధికారులతో జేసీ సమీక్ష

AKP: పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో వచ్చిన అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సత్వరం పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సేవలలో పారదర్శకత, సమయపాలన పాటించాలన్నారు. అలాగే, నాలుగవ విడత జిల్లాలో జరుగుతున్న భూసర్వేను వేగవంతం చేయాలన్నారు.

April 8, 2026 / 05:11 PM IST

గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

ASR: అరకులోయ మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల (PTG) పాఠశాలను జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు వంతల దేవదాసు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వసతి గృహాలు, వంటశాల, భోజన మెనూను పరిశీలించారు. విద్యార్థులకు గుడ్లు, అరటిపండ్లు, పల్లీ చీక్కీలు అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

April 8, 2026 / 05:11 PM IST

ఖరీఫ్ సాగుపై కలెక్టర్ కీలక సమీక్ష

SS: జిల్లాలో సాగు విస్తీర్ణం, ఉత్పాదకత పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, అనుబంధ శాఖలతో ఆయన సమీక్ష నిర్వహించారు. సాగు విస్తీర్ణాన్ని 10 శాతం పెంచాలని, 15 శాతం వృద్ధిరేటు సాధించాలని సూచించారు. వరికి నుంచి మొక్కజొన్న, రాగి వంటి ఆరుతడి పంటల వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు.

April 8, 2026 / 05:06 PM IST

పట్టెమ్మ చెరువులను పరిశీలించిన కలెక్టర్

ELR: ఉంగుటూరు (మం) నాచుగుంటలో ఉన్న పట్టెమ్మ చెరువును బుధవారం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో కలిసి ఉంగుటూరు MLA ధర్మరాజు పరిశీలించారు. చెరువును మరింత అభివృద్ధి చేసి, దీర్ఘకాలికంగా గ్రామానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పూర్ణచంద్ర ప్రసాద్, ఎంపీడీవో మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

April 8, 2026 / 05:03 PM IST