• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

డుంబ్రిగూడ మండలంలో గ్రామసభ

ASR: డుంబ్రిగూడ, కొర్రాయి, అరకు, గ్రామాల్లో గురువారం గ్రామ సభలు నిర్వహించినట్లు తహసీల్దార్ త్రివేణి తెలిపారు. గ్రామ సభ తీర్మానాల మేరకు తాగునీరు, పారిశుద్ధ్యం, మరమ్మతుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే ఎంఆర్వో, ఎంపీడీవోలతో కలిసి జలపాతాలు, ప్రమాదకర ప్రాంతాల గురించి స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

April 16, 2026 / 07:14 PM IST

‘డోన్ నుంచి నంద్యాలకు బస్సులను నడపండి’

NDL: డోన్ -నంద్యాలకు బస్సులను నడపాలని BJP జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరమణ ఆర్టీసీ డిపో మేనేజర్ చలపతికి వినతి పత్రాన్ని ఇవాళ అందించారు. ఈ బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం 2,3 ఎక్స్‌ప్రెస్ బస్సులు తిరిగేలా చూడాలన్నారు. బస్టాండ్లో చలివేంద్రాలు, బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, జీపీఎస్ లైవ్ లొకేషన్ సదుపాయం కల్పించాలన్నారు.

April 16, 2026 / 07:00 PM IST

చిన్నమస్తా దేవి హోమంలో పాల్గొన్న మంత్రి

ATP: CM చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుతూ రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు దశమహా విద్య హోమాలు నిర్వహిస్తున్నారు. ఆరవ రోజు నిర్వహించిన చిన్నమస్తా దేవి హోమంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి టీజీ భరత్ పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

April 16, 2026 / 06:50 PM IST

ఢిల్లీలో టీడీపీ మహిళా ప్రజాప్రతినిధుల పర్యటన

KDP: ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలుగుదేశం మహిళా ప్రజాప్రతినిధుల బృందం రాజధానికి చేరుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ఈ బృందంలో కడప ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రెడ్డెప్పగారి మాధవి పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్‌లో జరిగే చర్చలను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.

April 16, 2026 / 06:48 PM IST

పేరుకుపోయిన చెత్తచెదారం తీసివేత

ప్రకాశం: తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఎన్నో రోజులుగా కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, మట్టిని గురువారం పారిశుద్ధ్య కార్మికులు తొలగించారు. దోమల వ్యాప్తి పెరిగి, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని గుర్తించిన స్థానికులు అధికారులకు తెలియజేయడంతో నేడు కాలువలను శుభ్రం చేశారు. చెప్పగానే స్పందించిన అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

April 16, 2026 / 06:45 PM IST

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం

VZM: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విజయనగరం జిల్లా శాఖ వార్షిక సర్వసభ్య సమావేశం కలెక్టరేట్లో ఇవాళ నిర్వహించారు. ఈ సమావేశంలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదిక, ఆదాయం-ఖర్చులు, చేపట్టిన కార్యక్రమాలు, రాబోయే కార్యక్రమాలను వివరించారు. రెడ్ క్రాస్ నూతన కార్యవర్గ ఎన్నికలను వాయిదా వేశారు.

April 16, 2026 / 06:45 PM IST

జిల్లాలో మీడియా అక్రెడిటేషన్‌పై కీలక నిర్ణయాలు

TPT: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన రెండవ డిస్ట్రిక్ట్ మీడియా అక్రెడిటేషన్ కమిటీ (DMAC) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మీడియా ప్రతినిధుల అక్రెడిటేషన్ దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, అర్హతల ఆధారంగా ఎంపిక ప్రక్రియను కొనసాగించారు. ఈ సమావేశంలో అక్రెడిటేషన్ నిబంధనలు, ప్రమాణాలు, పారదర్శకతపై విస్తృతంగా చర్చించారు.

April 16, 2026 / 06:44 PM IST

‘ఆధునిక సాంకేతికత ద్వారా రైతుల అభివృద్ధి సాధ్యం’

SKLM: ఆధునిక సాంకేతికత ద్వారా రైతుల అభివృద్ధి సాధ్యం అని జిల్లా పరిషత్ ముఖ్య అధికారి ఆర్. వెంకటరమణ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెండవ రోజు ఉత్తరకొస్తా మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికత జోడించడం ద్వారానే రైతులు అభివృద్ధి సాధిస్తారని అన్నారు.

April 16, 2026 / 06:43 PM IST

‘జనగణనకు ప్రజల సహకారం అవసరం’

VSP: భీమిలి ఆర్డీవో కార్యాలయంలో జనగణన కార్యక్రమాన్ని ఇవాళ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రజల సమగ్ర సమాచారం ఉంటేనే ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతాయని అన్నారు. మొబైల్ ద్వారా స్వీయ గణన పూర్తి చేసి పొందిన ఐడీని ఎన్యూమరేటర్లకు ఇవ్వాలని సూచించారు.

April 16, 2026 / 06:40 PM IST

కర్నూలు జిల్లాలో జోరువాన

KRNL: జిల్లాలో అకాల వర్షం పడుతోంది. తుగ్గలి, సి. బెలగళ్, గోనెగండ్ల, తదితర మండలాల్లో సాయంత్రం నుంచి వాన కురుస్తోంది. గోనెగండ్ల సమీపంలోని గాజులదిన్నె ప్రాజెక్ట్ వద్ద ఈదురుగాలుల వల్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఎమ్మిగనూరు – కర్నూల్ ప్రధాన రహదారిపై విద్యుత్ తీగలు పడడంతో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది.

April 16, 2026 / 06:40 PM IST

ఉపాధి కార్మికుల పొట్ట కొట్టడానికే పథకం

AKP: ఉపాధి కార్మికుల పొట్ట కొట్టడానికే కేంద్ర ప్రభుత్వం వీబీ జీ రామ్ జీ పథకాన్ని అమలులోకి తీసుకు వస్తున్నట్లు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం సత్యనారాయణ విమర్శించారు. ఈ మేరకు గురువారం ఎస్ రాయవరం మండలం దార్లపూడిలో ఉపాధి కార్మికులతో సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండు పూటలా ముఖ ఆధారిత హాజరు కాకుండా ఒక్క పూటే తీసుకోవాలన్నారు.

April 16, 2026 / 06:39 PM IST

బాపట్ల స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ వినోద్

బాపట్ల పురపాలక సంఘానికి స్పెషల్ ఆఫీసర్‌గా జిల్లా కలెక్టర్ డాక్టర్ వీ. వినోద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురపాలక పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలను బలోపేతానికి అధికారులు కృష్ణి చేయాలన్నారు.

April 16, 2026 / 06:39 PM IST

‘జలధారతో భూగర్భ జలమట్టం పెంచాలి’

VZM: జిల్లాలో జలధార-నీటి భద్రత కింద చేపడుతున్న పనుల ద్వారా భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ఆదేశించారు. ఇవాళ వర్చువల్‌గా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 8010 చెరువులకు పనులు గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

April 16, 2026 / 06:33 PM IST

సోషల్ మీడియాలో పరిచయం అదృశ్యమైన బాలికలు

CTR: చిత్తూరు 1 టౌన్ పోలీసులు అదృశ్యమైన ఇద్దరు మైనర్ బాలికల కేసును 48 గంటల్లోనే ఛేదించి, వారిని సురక్షితంగా రక్షించారు. సోషల్ మీడియా పరిచయాలతో బాలికలు వెళ్లినట్లు విచారణలో తేలింది. తల్లిదండ్రులు తమ పిల్లల మొబైల్ వినియోగంపై నిరంతరం నిఘా ఉంచాలని, సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. సకాలంలో స్పందించిన పోలీసులను బాధితుల తల్లిదండ్రులు అభినందించారు.

April 16, 2026 / 06:30 PM IST

పీఏసీ సమావేశంలో ఎమ్మెల్యే రామాంజనేయులు

గుంటూరు: అమరావతి అసెంబ్లీ భవన్‌లో గురువారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఆయన సమీక్షించారు. ఇతర సభ్యులతో కలిసి ప్రభుత్వపరమైన పలు విషయాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

April 16, 2026 / 06:26 PM IST