• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విత్తన సరఫరాపై సమీక్ష సమావేశం

PLD: నరసరావుపేట రోటరీ క్లబ్‌లో ఖరీఫ్ 2026-27కు ప్రత్తి, మిరప విత్తన సరఫరాపై సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా వ్యవసాయ అధికారి ఎం. జగ్గారావు అధ్యక్షతన కంపెనీలు తమ ప్రణాళికలను వివరించాయి. నాణ్యమైన విత్తనాలు సమయానికి రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

April 23, 2026 / 07:28 AM IST

బీజేపీ పార్టీలోకి 35 కుటుంబాలు చేరికలు

SKLM: గార (M) శ్రీకూర్మం గ్రామం నుంచి సుమారు 35 కుటుంబాలు బీజేపీ పార్టీలోకి చేరారు. బుధవారం సాయంత్రం వారికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వర రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణు గోపాలం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి బీజేపీలో చేరినట్లు తెలిపారు.

April 23, 2026 / 07:20 AM IST

పెరుగుతున్న సెల్ఫ్ డ్రైవ్ ప్రమాదాలు

NTR: సెల్ఫ్ డ్రైవ్ రెంటల్ కార్ల వినియోగం పెరుగుతుండగా ప్రమాదాలు పెరుగుతున్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి కొందరు ప్రమాదాల తర్వాత కార్లు వదిలి పారిపోతున్నారు. ఈ కేసుల్లో డ్రైవర్లను గుర్తించడం కష్టంగా మారింది. తప్పుడు వివరాలు, ఫేక్ ఐడీలు ఇవ్వడం వల్ల విచారణకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పోలీసులు తెలిపారు.

April 23, 2026 / 07:17 AM IST

పాసుపుస్తకాలు పంపిణీపై కలెక్టర్ సమావేశం

VZM: జనవరి నెల నుంచి ప్రణాళికబద్దంగా నిర్వహిస్తున్న రీ సర్వే, పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని ఇచ్చిన గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రీ సర్వే, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీపై ఆర్డీవోలు, తహసీల్దార్ల, సర్వే సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

April 23, 2026 / 07:17 AM IST

నర్సీపట్నంలో ఆలయ హుండీ చోరీ.!

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ ఫైర్ ఆఫీస్ సమీపంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం అర్ధరాత్రి హుండీ చోరీ జరిగింది. మద్యం సేవించిన వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించామని టౌన్ ఎస్సై ఉమామహేశ్వరరావు బుధవారం తెలిపారు. హుండీలో ఎంత నగదు పోయిందో తెలియాల్సి ఉంది. ధర్మకర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసి క్లూస్ టీం ఆధారాలు సేకరించింది.

April 23, 2026 / 07:09 AM IST

బాలికపై అత్యాచార యత్నం.. పోక్సో కేసు నమోదు

W.G: అత్తిలి మండలంలో బాలిక (17)పై అత్యాచార యత్నానికి పాల్పడిన పవన్ సాయి అనే యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ నెల 20న రాత్రి సమయంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా, నిందితుడు లోపలికి ప్రవేశించి అకృత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు SI విశ్వనాథ్ చెప్పారు.

April 23, 2026 / 07:02 AM IST

రైలు కింద పడి ఇద్దరు మృతి

కడప రైల్వే స్టేషన్ సమీపంలో నిన్న రైలు కిందపడి చిన్న నరసింహులు (75) మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈయన కడప నగరంలోని ఎర్రముక్కపల్లె నివాసి అని అన్నారు. అలాగే భాకరాపేట సమీపంలో రైలు కిందపడి అశోక్ రెడ్డి అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయన అట్లూరు మండల వాసి అని, వీరిద్దరి మృతిపై వివరాలు తెలియాల్సి ఉంది.

April 23, 2026 / 07:01 AM IST

నేడు ఈ ప్రాంతంలో విద్యుత్‌కి అంతరాయం

GNTR: విద్యుత్ లైన్ల పునరుద్ధరణ, రోడ్డు విస్తరణ పనుల దృష్ట్యా గురువారం ఉదయం 7 నుంచి 11 వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్, చంద్రమౌళీనగర్, అశోక్ నగర్, కుందుల రోడ్ ప్రాంతాల్లో కరెంట్ ఉండదు. ఇందుకు వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు.

April 23, 2026 / 07:01 AM IST

రాఘవేంద్రస్వామి ఆలయ ఆదాయం ఎంతంటే..?

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో బుధవారం హుండీ లెక్కింపు చేపట్టారు. ఏప్రిల్ నెల 22 రోజులకు సంబంధించిన భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.3,25,96,854 ఆదాయం వచ్చినట్లు మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. వీటితో పాటు భక్తులు 47 గ్రాముల బంగారం, 592 గ్రాముల వెండిని సమర్పించినట్లు వెల్లడించారు. ఈ మొత్తాన్ని బ్యాంకులలో జమ చేసినట్లు పేర్కొన్నారు.

April 23, 2026 / 07:00 AM IST

రీసర్వే పనులు త్వరగా పూర్తిచేయాలి: కలెక్టర్

NDL: జిల్లాలో కొనసాగుతున్న భూ రీసర్వే పనులను నిర్ణీత గడువులోపు సమర్ధవంతంగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీసీ హాలులో ఆర్డీవోలు, తహశీల్దార్లు, వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రతీ రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలన్నారు.

April 23, 2026 / 07:00 AM IST

‘మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలి’

SKLM: మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గ సమస్యలు తాగునీరు, రహదారులు, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. మౌలిక సదుపాయాల కల్పన కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

April 23, 2026 / 07:00 AM IST

‘నేడు జిల్లాస్థాయి పోషణ్ పక్వాడా వేడుక’

KKD: రాష్ట్రీయ పోషణ్ పక్వాడా జిల్లా స్థాయి వేడుకను గురువారం ఉదయం 10 గంటలకు కాకినాడ కలెక్టరేట్‌లోని వివేకానంద మందిరంలో నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ పీడీ సీహెచ్. లక్ష్మి తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి అధికారులు, సిబ్బంది, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

April 23, 2026 / 07:00 AM IST

తాడిపత్రిలో పేకాట స్థావరంపై దాడి

ATP: తాడిపత్రి రూరల్ పరిధిలోని పేకాట స్థావరంపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. సీఐ శివగంగాధర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 55,440 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు.

April 23, 2026 / 07:00 AM IST

పమిడిపాడులో ఎరువుల వినియోగంపై అవగాహన

PLD: నరసరావుపేట మండలం పమిడిపాడులో కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డా. ఎం. గంగాదేవి రసాయన ఎరువులు తగ్గించి జీవ ఎరువులు వినియోగించాలని సూచించారు. భూసారం పెంచి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందాలని రైతులకు అవగాహన కల్పించారు.

April 23, 2026 / 06:57 AM IST

‘ఆర్టీసీ బస్సు డ్రైవింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి’

SKLM: ఆర్టీసీ బస్సులు నడిపే సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజా రవాణా అధికారి CH అప్పల నారాయణ అన్నారు. శాఖా పరంగా నడుపుతున్న ఆర్టీసీ హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు సంబంధించిన 26వ బ్యాచ్‌ను బుధవారం ప్రారంభించారు. తదుపరి 27వ బ్యాచ్‌లో చేరుటకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

April 23, 2026 / 06:48 AM IST