• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు సత్యవేడులో ఎమ్మెల్యే పర్యటన

TPT: సత్యవేడు మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు చమర్తి కండ్రిగలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం 10.30 గంటలకు సత్యవేడు వెలుగు కార్యాలయంలో సంఘమిత్రులకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు హాజరుకావాలని కోరారు.

April 16, 2026 / 11:42 AM IST

బహిరంగ మద్యపానంపై పోలీసుల హెచ్చరికలు

కడప: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై జమ్మలమడుగు పోలీసులు నిఘా పెంచారు. ఇటీవల కాలంలో ప్రధాన రహదారులు, ఖాళీ ప్రదేశాలు, కాలనీల్లో కొందరు బహిరంగంగా మద్యం తాగడం వల్ల స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేరానికి పాల్పడిన వారికి 6 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అర్బన్ సీఐ నరేశ్ బాబు హెచ్చరించారు.

April 16, 2026 / 11:24 AM IST

రోడ్డు ప్రమాదంపై ప్రధాని, రాష్ట్రపతి దిగ్భ్రాంతి వ్యక్తం

KRNL: కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.

April 16, 2026 / 11:23 AM IST

‘క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి’

KRNL: క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆమె పరామర్శించారు. ఇప్పటివరకు 8 మంది మృతి చెందినట్లు తమకు సమాచారం ఉందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించామన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

April 16, 2026 / 11:23 AM IST

పిల్లలు పార్కు చుట్టూ చెత్త.. చిట్టి పాదాలకు గాయాలు

విశాఖ: జీవీఎంసీ 63వ వార్డు, క్రాంతి నగర్ గ్రామంలో చిన్నారులు కోసం ఏర్పాటు చేసిన పార్కు చుట్టుపక్కల భవన నిర్మాణ వ్యర్ధాలు వేయడం వలన పార్కులో క్రీడలు ఆడుకునే వారికి గాయాలు అవుతున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. పార్కు చుట్టుపక్కల రక్షణ గోడ లేకపోవడం వలన పార్కు కబ్జాకు గురవుతుందని ఆవేదన చెందుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

April 16, 2026 / 11:20 AM IST

జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ పొడిగింపు

ATP: వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీము 2026-27 సంవత్సరానికి పొడిగిస్తూ జీవో MS 43 విడుదలైనట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జర్నలిస్టులు www.cfms.ap.gov.in.1,250 చెల్లిస్తే.. ప్రభుత్వం సమానంగా మరో రూ.1,250 భరిస్తుందన్నారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈ ప్రయోజనం పొందవచ్చన్నారు. ప్రీమియం చెల్లించిన వారు అవసరమైన పత్రాలను సమర్పించాలన్నారు.

April 16, 2026 / 11:20 AM IST

‘చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలి’

E.G: ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు అధ్యక్షతన టీడీపీ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రుడా చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. త్వరలో జరగనున్న సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

April 16, 2026 / 11:20 AM IST

భార్య కాలు నరికిన కసాయి భర్త

పల్నాడు: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సత్తనపల్లి మండలం తొండపిలో భార్యాభర్తల మధ్య వివాదం కలకలం రేపింది. భార్య భూలక్ష్మిపై అనుమానం పెంచుకున్న భర్త లక్ష్మయ్య అమానుషానికి తెగబడ్డాడు. క్షణికావేశంలో కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా ఆమె కాలును నరికేశాడు. ఈ దారుణ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 16, 2026 / 11:17 AM IST

జగన్మోహిని కేశవ స్వామి సన్నిధిలో సివిల్ జడ్జి

కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారిని గురువారం రామచంద్రపురం సీనియర్ సివిల్ జడ్జి కె. వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించి వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు దర్శనం అనంతరం వారికి స్వామివారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

April 16, 2026 / 11:15 AM IST

టీడీపీకి పదవులలో నిరాశ..!

GNTR: టీడీపీ ప్రకటించిన విస్తృత స్థాయి పదవుల్లో గుంటూరు తూర్పు నేతలకు చోటు దక్కకపోవడం అసంతృప్తిని పెంచింది. ఎన్నో ఏళ్ల తర్వాత విజయం సాధించినా ప్రాతినిధ్యం లేకపోవడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ, మైనారిటీ నాయకులను విస్మరించారనే చర్చ పార్టీలో సాగుతోంది. అయితే, దీనిపై పార్టీ ఎలా స్పందిస్తో చూడాలి మరీ.

April 16, 2026 / 11:14 AM IST

‘చిరుధాన్యాల సాగుపై వ్యవసాయ అధికారులు దృష్టి సారించాలి’

PPM: చిరు ధాన్యాల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ అధికారులకు కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి సూచించారు. గురువారం వీరఘట్టం మండల పరిషత్‌ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ప్రకృతి వ్యవసాయం బృందం ఏర్పాటు చేసిన చిరుధాన్యాల చక్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయాల ప్రాంగణాల్లో చిరుధాన్యాలు సాగును చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

April 16, 2026 / 11:11 AM IST

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా చిట్టిబాబు

CTR: టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా భీమనేని చిట్టిబాబు నాయుడును నియమిస్తూ జాతీయ పార్టీ కార్యాలయం ప్రకటించింది. రాష్ట్ర కమిటీ నియామకాలలో భాగంగా పాలసముద్రం మండల కేంద్రానికి చెందిన తనకు 2వ సారి రాష్ట్ర పదవి రావడానికి సహకరించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

April 16, 2026 / 11:09 AM IST

సప్త వీణానాదంతో ఆధ్యాత్మిక విందు

సత్యసాయి: పుట్టపర్తిలో విషు వేడుకలు ఘనంగా జరిగాయి. పద్మశ్రీ డాక్టర్‌ జి. శంకర్ ప్రసంగంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కేరళకు చెందిన సుశీల బృందం ‘సప్త వీణ’ వాయిద్య కచేరీతో అలరించారు. సాయి గాయత్రితో మొదలైన కచేరీలో మహా గణపతిం, హరివరాసనం వంటి కీర్తనలను ఏడు వీణల సమన్వయంతో అద్భుతంగా పలికించారు. ఈ ప్రదర్శన భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ముంచెత్తింది.

April 16, 2026 / 11:00 AM IST

స్కానింగ్ కేంద్రాలపై చర్యలు తప్పవు

ATP: స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేసి ఏమైనా లోపాలు ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ డిఎంహెచ్ఓ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. జిల్లాలో 188 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటిలో ఎక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లింగ నిర్ధారణ నిషేధిత చట్టంపై అవగాహన కనిపించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

April 16, 2026 / 11:00 AM IST

దొంగతనాలు చెక్ పెట్టేందుకు సీసీ కెమెరాలు

ప్రకాశం: సింగరాయకొండలో దొంగతనాలు అరికట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారి వెంట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వేములపాడు సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సీఐ హజరతయ్య తెలిపారు. అనుమానిత వ్యక్తులను ఈ కెమెరాల ద్వారా గుర్తించవచ్చని సీఐ అన్నారు.

April 16, 2026 / 10:51 AM IST