• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

శ్రీహరికోట నూతన ఎస్సైగా భాను

TPT: శ్రీహరికోట నూతన ఎస్సైగా భాను నియమితులయ్యారు. ఆమె గతంలో నాయుడుపేట పట్టణ ఎస్సైగా పనిచేశారు. బదిలీపై శ్రీహరికోటకు వచ్చారు. ఈ మేరకు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు స్టేషన్ సిబ్బంది అభినందనలు తెలిపారు. శ్రీహరికోట స్టేషన్ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టి అరికడతానన్నారు.

April 16, 2026 / 01:27 PM IST

స్వీయ గణన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ELR: చింతలపూడిలో గురువారం స్వీయ గణన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈనెల 30 వరకు స్వీయ గణనకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఖచ్చితమైన సమాచారాన్ని మాత్రమే ఇందులో నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు. మే ఒకటి నుంచి 30 వరకు క్షేత్రస్థాయిలో సర్వే జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు.

April 16, 2026 / 01:10 PM IST

స్టేట్ రాంక్ సాధించిన పుంగనూరు విద్యార్థిని

CTR: ఇంటర్ ఫలితాల్లో పుంగనూరు అడవినాథునికుంట ఏపీ మోడల్ స్కూల్& జూనియర్ కళాశాల విద్యార్థిని క్యాతిప్రియ స్టేట్ ర్యాంక్ సాధించింది. ఇందులో భాగంగా గురువారం పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో ప్రిన్సిపల్ రమాదేవి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. CEC విభాగంలో ముత్తుకూరుకు చెందిన క్యాతిప్రియ 491 మార్కులు సాధించినట్లు ఆమె తెలిపారు.

April 16, 2026 / 01:10 PM IST

సత్యసాయి తాగునీటి కార్మికులు ధర్నా

ATP: గుత్తి తహసిల్దార్ కార్యాలయం ఎదుట గురువారం సత్యసాయి తాగునీటి కార్మికులు ధర్నా చేపట్టారు. తాగునీటి కార్మికులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. తాగునీటి కార్మికులకు బకాయి పడ్డ ఐదు నెలల వేతనాలను చెల్లించాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని, సమాన పనికి సమానమైన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ పుణ్యవతికి అందజేశారు.

April 16, 2026 / 01:07 PM IST

పోలేరమ్మ గుడి వద్ద స్థలం కబ్జాకు యత్నం

ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామంలోని పోలేరమ్మ గుడి వద్ద గల స్థలాన్ని గురువారం కొందరు భూకబ్జాదారులు జెసీబీతో స్థలాన్ని క్లీనింగ్ పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు క్లీనింగ్ పనులను అడ్డుకున్నారు. ఈ స్థలం కొత్తపేట గ్రామపంచాయతీకి సంబంధించిందని గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు

April 16, 2026 / 12:57 PM IST

స్వదేశానికి నాగలక్ష్మి.. అధికారుల చొరవ

కోనసీమ: ఉప్పలగుప్తం మండలం విలసవిల్లికి చెందిన నాగలక్ష్మి ఖతార్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న కేసీఎం అధికారులు ఆమెను క్షేమంగా స్వగ్రామానికి చేర్చారు. ఫిబ్రవరి నెలలో ఏజెంట్ ద్వారా వెళ్ళిన ఆమెను అక్కడ తోటి పనిమనిషి వేధించినట్లు నాగలక్ష్మి ఆరోపించింది. దీంతో అధికారులు ఏజెంట్‌తో మాట్లాడి ఆమెను గురువారం స్వదేశానికి రప్పించారు.

April 16, 2026 / 12:50 PM IST

అభివృద్ధి పనులను ప్రారంభించిన MLA

KRNL: తుగ్గలి మండలం సీజీ తండా పంచాయతీలోని చెరువు తండా గ్రామంలో రూ.26.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే శ్యాం కుమార్ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో అభివృద్ధి జరగాలంటే సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 16, 2026 / 12:48 PM IST

పెట్టికోటలో రెండు గడ్డివాములు దగ్ధం

NDL: కొలిమిగుండ్ల మండలం పెట్టికోట గ్రామంలో ఇవాళ ప్రమాదవశాత్తు రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. గొంగటి సూర్యనారాయణ రెడ్డి అనే రైతు ముళ్ళ కంపకు నిప్పు అంటించడంతో ఎండవేడికి నిప్పులు గడ్డివాములపై పడటంతో గడ్డివాములు అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామస్తులంతా కాలిపోతున్న గడ్డివాములను ఆర్పడానికి ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 16, 2026 / 12:44 PM IST

మంత్రాలయం రోడ్డు ప్రమాదంపై ఎంపీ స్పందన

KRNL: మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై గురువారం ఎంపీ బస్తిపాటి నాగరాజు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉన్న ఆయన అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ ఘటనలో 8 మంది కర్ణాటక వాసులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

April 16, 2026 / 12:43 PM IST

గ్యాస్ డెలివరీ మోసం.. పోలీసులకు ఫిర్యాదు

కోనసీమ: ఆత్రేయపురం గ్రామంలోని బుల్లిపేటకు చెందిన ఉందుర్తి మనోహరం 25 రోజుల క్రితం గ్యాస్ బుక్ చేసుకోగా, సిలిండర్ డెలివరీ కాకుండానే వారం క్రితం డెలివరీ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీనితో స్థానిక గ్యాస్ ఏజెన్సీని సంప్రదించినా సరైన సమాధానం లేకుండా తిప్పుకోవడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు గ్యాస్ బండను ఇప్పించాలంటూ కోరారు. 

April 16, 2026 / 12:40 PM IST

భర్త మరణం తట్టుకోలేక భార్య కన్నుమూత

కృష్ణా: గూడూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కప్పలదొడ్డికి చెందిన తిరుమలశెట్టి వీర రాఘవరావు (66) అనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య పద్మావతి (61) కొద్దిసేపటికే స్పృహ కోల్పోయింది. ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆమె కూడా మృతి చెదినట్లు స్థానికులు తెలిపారు. గంటల వ్యవధిలోనే దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

April 16, 2026 / 12:35 PM IST

పరిగిలో టీడీపీ మాజీ సర్పంచ్ మృతి

సత్యసాయి: పరిగి మండలం కోడిగెనహళ్లి గ్రామానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్, సీనియర్ నాయకుడు చిన్న బీరప్ప అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ మండల కన్వీనర్ గోవింద్ రెడ్డి, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి హనుమయ్య, తదితరులు వారి గ్రామానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

April 16, 2026 / 12:30 PM IST

స్వయంగా అన్ లైన్లో స్వీయ గణనను చేసిన కలెక్టర్

PPM: జిల్లాలో జనగణన-2027లో భాగంగా స్వీయ గణన నమోదు కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ప్రభాకర రెడ్డి స్వయంగా తన ఇంటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ నెల 30 లోపు అందరూ సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ పూర్తి చేయాలని సూచించారు. మొబైల్‌ ఫోన్‌ ద్వారా కుటుంబ వివరాలను నమోదు చేయవచ్చని తెలిపారు.

April 16, 2026 / 12:29 PM IST

సింహాచలం గంధం అమావాస్యకు భారీ ఏర్పాట్లు

విశాఖ: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి దేవస్థానంలో చైత్ర బహుళ అమావాస్య (గంధం అమావాస్య) సందర్భంగా శనివారం భారీగా భక్తులు తరలివచ్చే అవకాశముందని ఈఓ జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. గురువారం సాయంత్రం నుంచే భక్తులు కొండదిగువ వరాహ పుష్కరిణి వద్ద, కొండపై జాగారం చేసి, అమావాస్య రోజు స్నానమాచరించి స్వామివారి దర్శనం చేసుకునే ఆనవాయితీ కొనసాగుతుందన్నారు.

April 16, 2026 / 12:24 PM IST

తిరుపతిలో 18న జాబ్ మేళా

TPT: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్‌లో 18వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. 9 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. దాదాపు 800 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలియజేశారు.

April 16, 2026 / 12:22 PM IST