ATP: శింగణమల మండలం ఆకులేడు గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు రామచంద్రారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తోపుదుర్తి కవిత ఆకులేడు గ్రామానికి వెళ్లారు. అక్కడ రామచంద్రారెడ్డి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
NLR: బోగోలు మండలం బిట్రగుంట నూతన ఎస్సైగా డి.రామకృష్ణ నియమితులయ్యారు. ఇందులో భాగంగా సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని తెలిపారు. సమస్య ఏమైనా ఉంటే నేరుగా తనకు చెబితే పరిష్కరిస్తానని చెప్పారు.
NLR: ఆత్మకూరు(M) నెల్లూరు పాలెం ముస్లిం కాలనీలో పోలీసులు సోమవారం ఉదయం కార్డన్ సర్చ్ నిర్వహించారు. సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, 8మంది ఎస్ఐలు, 40 మంది పోలీసులు ప్రతి ఇంటిని పరిశీలించారు. సరైన పత్రాలు లేని 50 బైకులు, 3కార్లు, 4ఆటోలను సీజ్ చేశారు. కాలనీవాసులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గంజాయి, మత్తు పదార్థాలను వాడరాదని సీఐ గంగాధర్ సూచించారు.
ATP: గుత్తి వీరారెడ్డి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ.. కాలనీలో మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
KDP: సింహాద్రిపురం నూతన ఎస్సైగా డా. నాయక్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని అన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు.
GNTR: రాష్ట్ర రాజధానిలోని SRM యూనివర్సిటీలో మంగళవారం జరగనున్న క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీస్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. సోమవారం ఆయన SRM తదితర ప్రాంతాల్లో పర్యటించి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
VZM: గజపతినగరంలోని సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం శుద్ధ జల కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యురాలు రఘుమండ లక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించారు. దివంగత మాజీ ఎంపీ కొండపల్లి పైడితల్లి నాయుడు జ్ఞాపకార్థం 3 లక్షల 75 వేల రూపాయలు విలువగల శుద్ధ జల కేంద్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొండలరావు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా శ్రీసత్య సాయి సేవా సంస్థల ముఖ్యపథాధికారుల సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు తమ అమూల్యమైన సందేశంతో చైతన్యపరచి, స్ఫూర్తినింపి, దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో ప్రతి గ్రామానికి సేవలు అందిస్తూ.. భజన మండలిలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆధ్యాత్మిక భావనలు కలుగజేయుట ద్వారా గ్రామాలలో శాంతి సామరస్యాలు నెలకొల్పుతారన్నారు.
NDL: నంద్యాల కలెక్టరేట్‌లో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి కలెక్టర్ జి.రాజకుమారి అర్జీలు స్వీకరించారు. PGRS అర్జీలు రీ-ఓపెన్ కాకూడదని, అధికారులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, జిల్లాస్థాయి అధికారులు హాజరయ్యారు.
ప్రకాశం: కంభం పట్టణంలోని ఉపాధి హామీ (MGNREGS) పనులను ఎంపీడీఓ వీరభద్రచారి సోమవారం ఫీల్డ్ అసిస్టెంట్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, నాణ్యతపై సమీక్ష నిర్వహించారు. అలాగే కూలీలతో మాట్లాడి, హాజరు నమోదు విధానం, పనుల అమలు తీరు గురించి వివరాలు తెలుసుకున్నారు. పనులు నాణ్యతగా, సమయానికి పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.
VSP: రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోట్ పోటీలలో విశాఖపట్నం జట్టు తొలిసారిగా పాల్గొని కేవలం 6 సెకన్ల తేడాతో నాలుగో స్థానం సాధించింది. పరిమిత వనరులు, సరైన ప్రాక్టీస్ లేకపోయినా సీనియర్ జట్లతో సమానంగా పోటీపడి ప్రతిభ చూపింది. కోచ్ వి. దాసారావు మాట్లాడుతూ.. సరైన సదుపాయాలు కల్పిస్తే క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధిస్తారని తెలిపారు.
కృష్ణా: మోపిదేవిలోని శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ సకలేశ్వర స్వామి దేవస్థానం నూతన ఛైర్మన్‌గా టీడీపీ రైతు నేత గవిని శివరామకృష్ణ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్, టీడీపీ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాస్ ఆయనను సత్కరించారు. డైరెక్టర్లుగా ఏడుకొండలు, నాగమణి, నాగరాజు, సుధారాణి, వెంకట సుబ్బారావు, సీతామహాలక్ష్మి, బేబీ బాధ్యతలు చేపట్టారు.
AKP: నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ బలిఘట్టం బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పెద్ద చెరువు ప్రాంతంలో 108 అడుగులతో నిర్మించబోతున్న శివపార్వతుల విగ్రహంతో రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు. సృష్టి క్షేత్రాన్ని బలిఘట్టం పుణ్యక్షేత్రంలో నిర్మించాలని డిమాండ్ చేశారు.
ATP: రాయదుర్గం పట్టణం కోటలో స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 20వ తేదీ సీఎం చంద్రబాబు జన్మదిన సందర్భంగా పది రోజుల పాటు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ ఆధ్వర్యంలో మూడవ రోజు త్రిపుర సుందరీ దేవి హోమాన్ని నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన హోమంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థనలు చేశారు.
CTR: చౌడేపల్లెలోని ప్రసిద్ధ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 21 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 3 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 27న స్వామివారి కళ్యాణోత్సవం, 28న రథోత్సవం నిర్వహిస్తారు. రోజూ వాహన సేవలు జరుగుతాయని వారు పేర్కొన్నారు.