పల్నాడు: శావల్యాపురం మండలం పొట్లూరులోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఆదివారం తిరుణాల వేడుకలను భక్తులు వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అర్చనలు, అభిషేకాలు, కుంకుమ పూజలతో మొక్కులు తీర్చుకున్నారు. విద్యుత్ ప్రభలు నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
W.G: నిబంధనలు పాటించడం బాధ్యత మాత్రమే కాదని, అది వాహనదారుల భద్రత కూడా అని నరసాపురం టౌన్ ఎస్సై సీహెచ్ జయలక్ష్మి అన్నారు. ఆదివారం నరసాపురం పట్టణంలోని వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకపోవడం, అతివేగం, మొబైల్ డ్రైవింగ్, నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విధించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు, జరిమానాలు తప్పవని ఎస్సై తెలిపారు.
గుంటూరులో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్‌లో తెనాలి ఎన్సీఆర్ఎం హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు. 7, 8 తరగతుల విద్యార్థులు భావన, పార్ధు, జాస్మిన్, రామకృష్ణ, రమ్య చిత్రలేఖనంలో బంగారు, వెండి పతకాలు గెలుచుకున్నారు. వీరికి హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థుల ప్రతిభపై ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.
PLD: నరసరావుపేట పట్టణం బరంపేటలో ఆదివారం శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి మోహనరంగా విగ్రహాలను ఘనంగా ఆవిష్కరించారు. తెలుగు సామ్రాజ్య వైభవాన్ని చాటిన శ్రీకృష్ణదేవరాయలు స్ఫూర్తిదాయకుడని, ప్రజల కోసం పోరాడిన నేతగా వంగవీటి మోహనరంగా గుర్తుండిపోతారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
KKD: అంబేద్కర్ జయంతిని మద్యపాన నిషేధ దినంగా ప్రకటించాలని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ, అంబేద్కర్ యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. ఆదివారం సాయంత్రం గొల్లప్రోలు పట్టణంలోని ఎస్సీ పేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.
ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదివారపు పేటలోని ఓ ఇంట్లో పేకాట నిర్వహిస్తున్న సమాచారంతో సీఐ అశోక్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో నలుగురు మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. రూ.10వేల నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
VZM: దత్తి రాజేరు మండలంలోని దత్తి గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ఈ నెల 21వ తేదీన చినజీయర్స్వామి వస్తున్నట్లు ఆలయ ధర్మకర్త పెంకి తిరుపతినాయుడు ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు. ఆరోజు ఉదయం ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని, భక్తులకు ఆధ్యాత్మిక సందేశం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
కోనసీమ: పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సోమవారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయ 11 గంటలకు నేదునురు సొసైటీ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పి గన్నవరం మండలం ఎమ్మెల్యే వారి క్యాంపు కార్యాలయం వద్ద సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేస్తారు.
ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఈ వారం జరిగిన పశువులు, జీవాల సంతల ద్వారా రూ.4.50 లక్షలకు పైగా ఆదాయం లభించినట్లు మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి తెలిపారు. అందులో శనివారం జరిగిన గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంత నుంచి రూ.2.84 లక్షలు, ఆదివారం జరిగిన ఆవులు, ఎద్దుల సంత ద్వారా రూ.1.66 లక్షల మేర వసూలైనట్లు ఆమె మీడియాకు వెల్లడించారు.
KKD: గొల్లప్రోలు మండల పరిధిలో చేబ్రోలు మల్లవరం లక్ష్మీపురం గ్రామాల్లో సుడిగాలుల వల్ల నష్టపోయిన పంట పొలాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయకుమార్ పరిశీలించారు. సుడిగాలుల వల్ల దెబ్బతిన్న పంటలపై ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగిందని అక్కడి నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత పంట నష్టం నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.
VSP: సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏప్రిల్17న గంధం అమావాస్యను పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు రానున్నారు.16న సాయంత్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి రాత్రి కొండదిగువన వరాహ పుష్కరిణి వద్ద, కొండపైన జాగరం చేసి అమావాస్య రోజు దర్శించుకోవడం ఆనవాయితిగా వస్తోంది.
VZM: రాజాం SI పి. వేంకటేశ్వరరావు ఆదివారం సాయంత్రం పోలీస్ స్టేషన్ పరిధిలో చెడు నడత కలిగిన వ్యక్తులను వారి వృత్తి ప్రవృత్తులపై వివరాలు సేకరించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి నేర కార్యకలాపాలలో పాల్గొనవద్దని వారిని హెచ్చరించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, కుటుంబ పోషణ కోసం కష్టపడి పని చేయాలని సూచించారు.
అన్నమయ్య: మదనపల్లెలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాలెపాడు గ్రామం, ఆవులపల్లికి చెందిన వెంకటేశ్, గంగరాజు, శివ అనే ముగ్గురు యువకులు బైక్‌పై మదనపల్లె టమాటా మార్కెట్ వైపు వెళ్తుండగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రకాశం: పామూరు పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న ఆరు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నిర్వహించిన తనిఖీలలో భాగంగా సీఐ వినోద్ కుమార్ చర్యలు చేపట్టి, ఆరు ఆటోలను సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రత కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
KDP: బద్వేలులోని 132-33 కేవీఏ సబ్ స్టేషన్‌లో నిర్వహణ పనులు చేస్తుండటంతో ఇవాళ మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు బద్వేలు, గోపవరం, అట్లూరు, బి. మఠం మండలాల పరిధిలోని సబ్ స్టేషన్‌లలో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈఈ ఎం.కుళ్లాయప్ప, బద్వేలు ఏఈ మేరీ షర్మిళరాణి తెలిపారు. విద్యుత్తు వినియోగదారులు సహకరించాలని వారు కోరారు.