• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వట్టిచెరుకూరులో పర్యటించిన జేసీ అశుతోష్ శ్రీవాస్తవ

GNTR: వట్టిచెరుకూరు మండలంలో జేసీ అశుతోష్ శ్రీవాస్తవ శనివారం పర్యటించారు. వట్టిచెరుకూరు మండలంలో సర్వే నెం.241లో చెరువుతో పాటు అక్కడ ఉన్న నివాస స్థలాలు కూడా పోరంబోకుగా నమోదై ఉండటం, దానిని గ్రామ కంఠంగా మార్పులు చేయాలని కోరుతూ ప్రజలు కోరడం జరిగింది. ఈ మేరకు వాస్తవ పరిస్థితులను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులను త్వరితగతిన వారి నివేదికను సమర్పించాలని కోరారు.

April 4, 2026 / 04:43 PM IST

జగన్‌పై ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఘాటు విమర్శలు

CTR: పెద్ద పంజాణిలో జరిగిన సర్పంచుల సన్మాన కార్యక్రమం, ఈ-ఆటోల ప్రారంభోత్సవంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురిచేశారని ఆరోపించారు. రాజధాని అంశంపై స్పష్టత లేకుండా గంటకో మాట మార్చుతున్నారని విమర్శించారు.

April 4, 2026 / 04:41 PM IST

మొక్కలు నాటేందుకు భూములు సిద్ధం చేయాలి: కలెక్టర్

VZM: మిషన్ హార్టి విజన్‌లో భాగంగా జిల్లాలో రెండో విడతలో 7260 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు జూన్ నాటికి భూములను సిద్ధం చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 275 బ్లాక్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

April 4, 2026 / 04:35 PM IST

బేతంచెర్లలో పైపులైన్ పగిలి నీరు వృథా.!

NDL: బేతంచెర్లలో స్టేట్ బ్యాంక్ సమీపంలో సిమెంట్ ట్రక్కు ఇరుక్కుపోవడంతో తాగునీటి పైపులైన్ పగిలి నీరు వృథాగా పోతోందని స్థానికులు తెలిపారు. డ్రైవర్ టీ తాగేందుకు ట్రక్కును పక్కకు నిలపగా, టైర్లు భూమిలోకి కుంగి లోపల ఉన్న పైపు దెబ్బతిసిందన్నారు. దీంతో భారీగా నీరు బయటకు వస్తోందని వెల్లడించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు ఇవాళ మున్సిపల్ అధికారులను కోరారు.

April 4, 2026 / 04:25 PM IST

భక్తులకు భోజనాలు వడ్డించిన మాజీ రుడా ఛైర్మన్

E.G: రాజమండ్రి తాడితోటలో శ్రీరామనవమి అన్నసంతర్పణ కార్యక్రమంలోవైసీపీ మాజీ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్, మాజీ రుడా ఛైర్మన్ మేడపాటి షర్మిల రెడ్డి శనివారం పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని భక్తులకు స్వయంగా భోజనాలు వడ్డించి భక్తిని చాటుకున్నారు. రాష్ట్ర బీసీ యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ 32వ వార్డు ఇంఛార్జ్ బూడిద శరత్ కుమార్, కాటం సంజయ్ పాల్గొన్నారు.

April 4, 2026 / 04:20 PM IST

టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలి: సీపీ

VSP: వ్యాధుల నియంత్రణకు ప్రతీ ఒక్కరూ టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ సూచించారు. శనివారం సీతమ్మధారలో లయన్స్ క్యాన్సర్ ఆస్పత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ టీకా కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు లయన్స్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

April 4, 2026 / 04:02 PM IST

సింహాద్రిపురం నూతన తహసీల్దార్‌గా అనురాధ

KDP: సింహాద్రిపురం నూతన తహసీల్దార్‌గా బి. అనురాధ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె డీఎం సివిల్ సప్లై విభాగంలో విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై తాజా బదిలీలలో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.

April 4, 2026 / 04:01 PM IST

తాడేపల్లిగూడెంలో CMRF చెక్కులు అందజేత

W.G: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో ‘గ్రీవెన్స్ – ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ను పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ వలవల బాబ్జీ శనివారం ఏర్పాటు చేశారు. అనంతరం ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు, స్వీకరించారు. సమస్య పరిష్కారించాలని అధికారులతో మాట్లాదారు. రూ.5.50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందచేశారు.

April 4, 2026 / 04:00 PM IST

అమరావతికే కాంగ్రెస్ మద్దతు: క్రాంతి నాయుడు

అమరావతి రాజధానిగా కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని కర్నూలు జిల్లా అధ్యక్షుడు క్రాంతి నాయుడు తెలిపారు. శనివారం జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతితో పాటు రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. మూడు రాజధానుల పేరుతో గతంలో కాలయాపన జరిగిందని, ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు.

April 4, 2026 / 04:00 PM IST

స్క్రాప్ నిల్వ చేసిన షాపు దగ్ధం

ప్రకాశం: కొరిసిపాడు మండలం మేదరమెట్ల టౌన్‌లోనే సెయింట్ ఆర్నాల్డ్ స్కూల్ ఎదురుగా ఉన్న స్క్రాప్ నిల్వ ఉంచిన షాపులో శనివారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించి అద్దంకి నుంచి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ అపాయం జరగలేదు. మంటలను పైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు.

April 4, 2026 / 04:00 PM IST

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన మంత్రి

NDL: బనగానపల్లె ఎమ్మెల్యే, రోడ్ల భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇవాళ మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వారు మంత్రికి వినతి పత్రాలను అందజేశారు.

April 4, 2026 / 04:00 PM IST

జనసేన పార్టీ ఫ్లెక్సీల ధ్వంసంపై ఆగ్రహం

కోనసీమ: జనసేన పార్టీ ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన ఘటనలో సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సంపత్ డిమాండ్ చేశారు. కె.గంగవరం మండలం బాలాంత్రంలో జనసేన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపి వేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగినా అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు.

April 4, 2026 / 04:00 PM IST

‘బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలి’

GNTR: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును ఆ పదవి నుంచి వెంటనే తొలగించాలని ప్రత్తిపాడు వైసీపీ ఇంఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. నల్లపాడు వెంకటేశ్వర స్వామి గుడిలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన నాయుడును సీఎం చంద్రబాబు కాపాడటం దారుణమన్నారు. తిరుమల పవిత్రతను మంటగలుపుతున్న వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

April 4, 2026 / 04:00 PM IST

తడికలపూడి ఎస్సైగా వల్లి పద్మ బాధ్యతలు

ELR: కామవరపుకోట మండలం తడుకలపూడి ఎస్సై‌గా ఇవాళ వల్లి పద్మ బాధ్యతలు చేపట్టారు. గతంలో పని చేసిన SI చెన్నారావు ఇటీవల వీఆర్‌కి బదిలీ ఆయన సంగతి తెలిసిందే. స్టేషన్ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. మండల పరిధిలోని అసాంఘిక కార్యక్రమాల నిరోధానికై కృషి చేస్తానని తెలిపారు. ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే నేరుగా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

April 4, 2026 / 04:00 PM IST

గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

SKLM: పాతపట్నంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యా వాతావరణం, విద్యార్థుల వసతి సదుపాయాలు, భోజన ఏర్పాట్లు వంటి అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.

April 4, 2026 / 03:55 PM IST