• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

భూగర్భ జలాల మట్టాలను పెంచేందుకు కృషి: కలెక్టర్

మన్యం: జిల్లాలోని నీటి వనరులను శాశ్వత ప్రాతిపాదికన సంరక్షించేందుకు, భూగర్భ జలాల మట్టాలను పెంచేందుకు అత్యధిక సాకేంతికతో కూడిన మ్యాపింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి ప్రధాన కార్యదర్శికి వివరించారు. అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం రీ సర్వే, జలధార తదితర అంశాలపై కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

April 16, 2026 / 07:43 AM IST

టీడీపీ నేతకు నివాళులర్పించిన అధ్యక్షురాలు

KRNL: ఆదోని (M) బైచిగేరి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు బోయ రాముడు అకాల మరణంతో బుధవారం గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గ్రామానికి చేరుకొని పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి రాముడు చేసిన పార్టీ సేవలు అమూల్యమని ఆమె పేర్కొన్నారు.

April 16, 2026 / 07:40 AM IST

ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం: ఎస్సై నరేశ్

CTR: శాంతిపురం మండలంలో ఎలాంటి సమస్యలైనా 112 కాల్ చేస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై నరేశ్ తెలిపారు. ఈ సందర్భంగా మహిళల అక్రమ రవాణా, గంజాయి, డ్రగ్స్ సమస్యలు, దొంగతనం, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి సమస్యలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే 112కి కాల్ చేసి తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.

April 16, 2026 / 07:32 AM IST

టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్‌గా సుజయ్ కృష్ణ రంగారావు

విజయనగరం: టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్‌గా సుజయ్ కృష్ణ రంగారావు ఎన్నికయ్యారు. టీడీపీలో చురుకైనా పాత్ర పోషించడంతో జోనల్ కో-ఆర్డినేటర్‌గా అధిష్ఠానం నియమించింది. సుజయ్ కృష్ణ రంగారావుకు పదవి రావడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా సుజయ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఛైర్మన్‌గా పని చేస్తున్నారు.

April 16, 2026 / 07:31 AM IST

‘సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి’

E.G: నిడదవోలులో ఈ నెల 18న సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్, APSSDC ఛైర్మెన్ బూరుగుపల్లి శేషారావు బహిరంగ సభ వేదిక, హెలిప్యాడ్ నిర్మాణం, పార్కింగ్ ఏర్పాట్లను బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ మేరకు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

April 16, 2026 / 07:31 AM IST

పోలీసులను ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే

కృష్ణా: సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లు, టీవీ మాధ్యమాల్లో తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఇక సహించబోమని వైసీపీ నేత వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుడు పేర్ని నానితో కలిసి అడిషనల్ ఎస్పీ నాయుడుకు ఫిర్యాదు చేశారు. దుష్ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే అబద్ధ ప్రచారాలను వెంటనే అరికట్టాలని వారు ఎస్పీని కోరినట్లు తెలిపారు.

April 16, 2026 / 07:27 AM IST

టెన్త్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పూర్తి: డీఈవో

కోనసీమ: జిల్లాకు అధికారులు పంపించిన 1,79,800 పదవ తరగతి ప్రశ్నాపత్రాల మూల్యాంకనాన్ని విజయవంతంగా పూర్తి చేసామని డీఈవో పి. నాగేశ్వరరావు తెలిపారు. అమలాపురంలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 6వ తేదీ నుంచి బుధవారం వరకు ప్రశ్నా పత్రాలను మూల్యాంకనం చేయడం జరిగిందన్నారు. టీచర్స్‌తో పాటు పలు ఉపాధ్యాయ సంఘాల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు.

April 16, 2026 / 07:25 AM IST

పేదరికాన్ని జయించి.. ఇంటర్‌లో రాణించి

NLR: ఇంటర్ ఫలితాల్లో దివ్యాంగురాలు దీవి భవాని పూజిత బుధవారం ఫలితాల్లో సత్తా చాటింది. పేదరికాన్ని అధిగమించి నెల్లూరు కేఏసీ ప్రభుత్వ కళాశాల నుంచి హెచ్ఈసీ ప్రథమ సంవత్సరంలో 488/500 మార్కులు సాధించింది. తండ్రి ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. సివిల్స్ లక్ష్యంగా చదువుతానని విద్యార్థి తెలిపింది. పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సాధ్యమని ఈ విద్యార్థిని నిరూపించింది.

April 16, 2026 / 07:21 AM IST

పెద్దవడుగూరు మండలంలో చీనీ చెట్ల దగ్ధం

ATP:పెద్దవడుగూరు మండలం చింతలచెరువు గ్రామ రైతు చాకలి బాలరాజుకు చెందిన చీనీ తోట మంటల్లో కాలి పోయింది. బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు తోట సమీపంలోని ఎండు గడ్డికి నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి తోటను చుట్టుముట్టాయి. దీంతో మూడేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న వంద చీనీ చెట్లు, డ్రిప్పు పరికరాలు కాలిపోయాయి. దాదాపు రూ.2 లక్షల మేర నష్టం వాటిలిందన్నారు.

April 16, 2026 / 07:20 AM IST

రోడ్డు ప్రమాదం.. ఇద్దరు పీడీవోలకు గాయాలు

అల్లూరి: కొయ్యూరు మండలం బంగారమ్మపేట జంక్షన్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యూ.చీడిపాలెం, మఠం భీమవరం పంచాయతీ అభివృద్ధి అధికారులు మోహనకృష్ణ, సత్యనారాయణ గాయపడ్డారు. వారు బైక్‌పై కేడీపేట వెళుతుండగా, గేదెలు అడ్డు రావడంతో ప్రమాదం జరిగింది. అటుగా వెళ్తున్న జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్ ప్రమాదాన్ని గమనించారు. వారికి సపర్యలు అందించి, ఆసుపత్రికి తరలించారు.

April 16, 2026 / 07:16 AM IST

జనగణన స్వీయ నమోదుకు సర్వం సిద్ధం: కలెక్టర్

కడప జిల్లాలో 2027 జనగణన సన్నాహాలు పూర్తయ్యాయని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు పోర్టల్, యాప్ ద్వారా ప్రజలు ‘స్వీయ గణన’ చేసుకోవచ్చన్నారు. మే 1 నుంచి 30 వరకు అధికారులు నేరుగా ఇళ్లకు వచ్చి వివరాలు సేకరిస్తారని ఆయన చెప్పారు. ప్రజలంతా వ్యక్తిగత వివరాల గోప్యత గురించి భయపడకుండా కచ్చితమైన సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు.

April 16, 2026 / 07:12 AM IST

టీడీపీ రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్‌గా ఎమ్మెల్యే

SKLM: ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాళం అశోక్ బాబు టీడీపీ రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్‌గా ఎంపిక అయ్యారు. ఈ మేరకు బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఈ ఎంపిక పట్ల ఇచ్చాపురం నియోజకవర్గం టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు MLAకు అభినందనలు తెలిపారు.

April 16, 2026 / 07:10 AM IST

పేలుడు బాధితులకు రూ.5 లక్షల పరిహారం

సత్యసాయి: కదిరి రూరల్ కుమ్మరమండ్లపల్లి పేలుడు ఘటనలో మృతి చెందిన నలుగురి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. గాయపడిన వారికి ఎమ్మెల్యే వ్యక్తిగతంగా ఆర్థిక సాయం ప్రకటించి అండగా నిలిచారు.

April 16, 2026 / 07:09 AM IST

‘బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలి’

TPT: నాగలాపురం మండలంలోని శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో మే 1 నుంచి 9 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించేందుకు సమిష్టిగా పనిచేయాలని జేఈఓ వీరబద్రం ఆదేశించారు. పారిశుధ్యం, తాగునీరు, క్యూలైన్లు, అన్నప్రసాదం వంటి ఏర్పాట్లు మెరుగ్గా ఉండేలా చూడాలని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

April 16, 2026 / 07:05 AM IST

ఆటోలో మర్చిన వస్తువులు తిరిగి అప్పగింత

అనకాపల్లి: గవరపాలెం ప్రాంతానికి చెందిన విషకోటి రజని తన బంధువుల పెళ్లికి సంబంధించిన బట్టలు, విలువైన వస్తువులను ఆటోలో మర్చిపోయారు. తలుపులమ్మ ఆటో స్టాండ్‌కు చెందిన డ్రైవర్ రాజేశ్ వాటిని గుర్తించి భద్రంగా ఉంచి, పోలీస్ స్టేషన్‌లో బాధితురాలికి అప్పగించారు. డ్రైవర్ నిజాయితీకి స్థానికులు ప్రశంసలు తెలిపారు.

April 16, 2026 / 07:04 AM IST