• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నడక మైదానానికి పివిజి రాజు పేరు పెట్టాలి

VZM: స్థానిక 42వ డివిజన్‌ అయ్యన్నపేట జంక్షన్‌ వద్ద మున్సిపల్‌ నడక మైదానానికి గొప్ప దాత, విద్యాదాత పీవీజీ.రాజు పేరు పెట్టాలని ప్రముఖ సామాజికవేత్త త్యాడా రామకృష్ణ కోరారు. ఈ మేరకు శుక్రవారం MLA అతిది గజపతిరాజును కలసి వినతిపత్రం అందజేసారు. అనంతరం మాట్లాడుతూ.. పిల్లలకు క్రీడా పరికరాలు, యువతీ యువకులకు బహిరంగ వ్యాయామశాలా పరికరాలు ఎర్పాటు చేయాలని కోరామన్నారు.

April 4, 2026 / 07:12 AM IST

గుర్తుతెలియని మృదేహం లభ్యం

KDP: బద్వేల్ మండలం పెద్ద చెరువు దగ్గర గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. దాదాపు 4 రోజుల క్రితం చనిపోయి ఉంటాడని తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బద్వేల్ సీఐ రామకృష్ణ మృతుడి వివరాలు ఎవరికైనా తెలిసి ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు. ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

April 4, 2026 / 07:05 AM IST

భక్తి ముందు ఓడిన గర్వం..!

తిరుమలలో తొండమాన్ చక్రవర్తి శ్రీవారికి బంగారు పుష్పాలతో అర్చనలు చేస్తూ తనకన్నా గొప్ప భక్తుడు లేడని గర్వించేవాడు. ఒకరోజు శ్రీవారి పాదాల చెంత మట్టిపూలు కనిపించాయి. ఆశ్చర్యపోయిన రాజుకు స్వామివారే కుమ్మరి దాసుడి భక్తిని వివరించారు. పేదవాడైన అతను భక్తితో మట్టిపూలు సమర్పించేవాడు. నిజమైన భక్తి సంపదలో కాదు, మనసులో ఉందని గ్రహించిన తొండమాన్ వినమ్రుడయ్యాడు.

April 4, 2026 / 07:04 AM IST

నేడు గవర్నర్ పర్యటన షెడ్యూల్ విడుదల

ATP: రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈ నెల 6న ఉ.9.25 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి 10.10 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11.25 గంటలకు అనంతపురం జేఎన్‌టీయూకు చేరుకుని స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం మ.1 గంటకు అనంతపురం నుంచి బయలుదేరి పుట్టపర్తికి చేరుకుని విజయవాడకు వెళ్తారు.

April 4, 2026 / 07:00 AM IST

6 నుంచి పది మూల్యాంకనం

E.G: టెన్త్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ ) సోమవారం నుంచి బీవీఎం ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో జరుగనుందని డీఈవో కంది వాసుదేవరావు తెలిపారు. శుక్రవారం రాజమండ్రి బీవీఎమ్ పాఠశాలలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. స్పాట్ వాల్యూయేషన్‌లో పని చేయుటకు జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్లుగా నియమించారు. 

April 4, 2026 / 07:00 AM IST

ఎన్నికలలో ప్రతి కార్యకర్త ఐక్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

SKLM: రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్త ఐక్యంగా పనిచేయాలని పలాస ఎమ్మెల్యే శిరీష అన్నారు. పలాసలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే శిరీష టీడీపీ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణ, ప్రజల సమస్యల పరిష్కారం వంటి కీలక అంశాలపై సమావేశం నిర్వహించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అని సూచించారు.

April 4, 2026 / 06:54 AM IST

‘చలో ఆకివీడు’కు అనుమతి లేదు: ఎస్సై

W.G: ఈ నెల 5వ తేదీన చేపట్టనున్న ‘చలో ఆకివీడు’ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేదని ఎస్సై హనుమంతు నాగరాజు స్పష్టం చేశారు. దత్త గుడి నుంచి రామాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తామని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మండలంలో ప్రస్తుతం 144 సెక్షన్, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయని, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

April 4, 2026 / 06:45 AM IST

ఆస్తి కోసం తండ్రి హత్య.. ముగ్గురు అరెస్ట్

KRNL: ఆస్తి వివాదం కారణంగా కన్న తండ్రి నన్నేసాబ్ను హత్య చేసిన ఇద్దరు కుమారులను, వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుంటనహాల్ గ్రామంలో మార్చి 30న జరిగిన ఈ హత్య కేసులో, ఆస్తి విషయంలో తలెత్తిన వివాదమే కారణమని పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న పెద్దకుమారుడు నూర్ మహమ్మద్, జునైద్ పాటు అతని స్నేహితుడు రీహను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

April 4, 2026 / 06:45 AM IST

బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: మంత్రి

శ్రీకాకుళం మండలం సింగుపురంలో ఆహారం వికటించడం (ఫుడ్ పాయిజనింగ్) వల్ల పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అప్రమత్తమయ్యారు. ఈ విషయం పై ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో శుక్రవారం రాత్రి ఫోన్‌‌లో మాట్లాడి, బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

April 4, 2026 / 06:42 AM IST

ఈ నెల 12 న ప్రపంచ శాంతి కోరుతూ సెమినార్

VZM: ఈ నెల 12న ప్రపంచ శాంతి కోసం బొబ్బిలిలో సెమినార్‌ నిర్వహిస్తున్నట్లు గురజాడ అద్యాయన వేదిక కన్వీనర్‌ విజయ గౌరీ తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాల సామ్రాజ్యవాద దాడులను నిరసిస్తూ, యుద్ధం ఆగి ప్రపంచశాంతి కలగాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రముఖ సామాజిక విశ్లేషకులు రాంభూపాల్ వక్తగా హాజరవుతారన్నారు.

April 4, 2026 / 06:33 AM IST

మధురవాడలో తల్లి, ఇద్దరు పిల్లలు మిస్సింగ్

VSP: పీ.ఎం.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వతంత్ర నగర్ ఎన్టీఆర్ హుదూద్ కాలనీ (SF 2, బ్లాక్- 3)కు చెందిన భార్య తేజస్విని, కుమారుడు ధనుష్ కుమార్, కుమార్తె వేదిత కనబడుటం లేదు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఈనెల 2వ తేదీన మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అన్ని చోట్లా వెతికినా ఎలాంటి సమాచారం దొరకలేదన్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

April 4, 2026 / 06:28 AM IST

అయ్యవారిపల్లిలో సీతారాముల కళ్యాణ మహోత్సవం

అన్నమయ్య: రైల్వేకోడూరు మండలంలోని కే.బుడుగుంటపల్లి పంచాయతీ అయ్యవారిపల్లి గ్రామంలో 7 రోజులుగా జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి సీతా సమేత శ్రీరామ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామస్తులందరూ కలిసికట్టుగా, ఉభయ దాతల సహకారంతో ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

April 4, 2026 / 06:25 AM IST

గుడిబండలో అభివృద్ధి పనుల పరిశీలన

సత్యసాయి: గుడిబండ మండలంలోని వీరజ్జనపల్లి, మోరుబగల్, వడ్రహట్టి, ఉప్పరహట్టి గ్రామాల్లో జరుగుతున్న రహదారులు, కల్వర్టుల నిర్మాణ పనులను ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డా. శ్రీనివాస మూర్తి పరిశీలించారు. ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు సహకారంతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. వీటి వల్ల వర్షాకాలంలో ప్రజల రాకపోకల ఇబ్బందులు తొలగుతాయని పేర్కొన్నారు.

April 4, 2026 / 06:23 AM IST

టీడీపీ నాయకులను పరామర్శించిన రాయదుర్గం ఎమ్మెల్యే

ATP: రోడ్డు ప్రమాదంలో గాయపడి అనంతపురం పావని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సర్పంచ్ నాగరాజు, యూనిట్ ఇంచార్జి సత్యనారాయణను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

April 4, 2026 / 06:21 AM IST

వెంకటేశ్వర స్వామి దర్శానాలు తాత్కాలికంగా బంద్

కాకినాడలోని జగన్నాథాపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శానాలను ఈ నెల 5వ తేదీ నుంచి 10 తేదీ వరకు ఉండవని ఈఓ సత్యవాణి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆలయంలో మరమ్మతుల కారణంగా దర్శనాలను నిలిపివేస్తున్నామని చెప్పారు. కళ్యాణ మండపంలో ఉన్న ఉత్సవ మూర్తులను భక్తులు దర్శించుకోవాలన్నారు. ఈ అసౌకర్యానికి సహాకరించాలని ఆమె కోరారు.

April 4, 2026 / 06:20 AM IST