PLD: జాతీయ రహదారి 167AG పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా కాంట్రాక్టరుకు ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో పనుల పురోగతిని పరిశీలించారు. పిడుగురాళ్ల – సత్తెనపల్లి – పేరేచర్ల రహదారి వెడల్పు తక్కువగా ఉండటంతో హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
KDP: మైదుకూరు-ప్రొద్దుటూరు రహదారి నాగులపల్లె సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. శుక్రవారం రాత్రి రోడ్డుపై మృతదేహం ఉండ టంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఏదైనా వాహనంలో వెళ్తూ ప్రమాదవశాత్తు పడిపోయారా, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. మృతి చెందిన వ్యక్తికి 60 ఏళ్లు ఉంటాయని పోలీసులు చెప్పారు.
తూ.గో: రాజమండ్రి నగరంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేస్తున్నట్టు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక 30వ డివిజన్లోని బెస్తా వీధి, గొల్ల వీధి, రజక వీధిలో రూ. 50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కూటమి అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.
W.G: వినాయక చవితి ఉత్సవాల్లో పర్యావరణానికి హాని కలిగించని మట్టి విగ్రహాలనే వాడాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. భీమవరం కలెక్టరేట్లో పొల్యూషన్ బోర్డ్ అధికారులతో కలిసి నిర్వహించిన ముందస్తు సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో తయారైన విగ్రహాలను ప్రోత్సహించాలని కోరారు.
అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలంలో శుక్రవారం వడదెబ్బతో రామాంజనేయులు (36) అనే యువకుడు మృతి చెందాడు. భార్యతో విభేదాల కారణంగా ఒంటరిగా నివసిస్తూ, మద్యానికి బానిసైన రామాంజనేయులు, శుక్రవారం వడదెబ్బకు గురై గ్రామ సమీపంలో పడి ఉన్నాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు చేరుకుని పరిశీలించేలోపే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు.
NDL: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసి, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని వివిధ ప్రాజెక్టుల ప్రతినిధులకు కలెక్టర్ రాజకుమారి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణపై కలెక్టర్ సమీక్షించారు.
కాకినాడ: ప్రత్తిపాడు సర్కిల్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ ఫలితాలను ఇన్స్పెక్టర్ బి. సూర్య అప్పారావు వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి 10 వరకు నిర్వహించిన తనిఖీల్లో 29 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయన్నారు. కోర్టు విచారణ అనంతరం నలుగురికి 3 రోజుల జైలు శిక్ష, మరో 10 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున ఫైన్ వేశారు.
కడప జిల్లాలో రాత్రిపూట వాహన తనిఖీలు, నాకాబందీ ముమ్మరం చేయాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన పోలీసు అధికారులతో సమీక్ష జరిపారు. రాత్రి 10:30లోగా షాపులు, 10 గంటలకు మద్యం దుకాణాలు మూసివేయాలన్నారు. గంజాయి, బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు. రాత్రిళ్లు రోడ్లపై తిరిగే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
CTR: వెదురు కుప్పం (M) పచ్చికాపల్లం గ్రామ పంచాయితీలో శుక్రవారం స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో పురుషోత్తం పాల్గొని గ్రామ ప్రజలు వారి ఇళ్లలోని నిరుపయోగ సామగ్రిని, చెత్తను ఇచ్చి ఇంటికి కావాల్సిన నిత్యావసరాలను అందజేయడంపై అవగాహన కల్పించారు. నిరుపయోగాన్ని వాడుకలోకి తేవడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
VZM: కేజీబీవీలో 2026-27 ఏడాదికి సంభందించి 6 నుండి10, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తులను ఈనెల 20 వరకు పొడిగించినట్లు DEO మాణిక్యం నాయుడు శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శనివారంతో ప్రవేశాల దరఖాస్తుల ప్రక్రియ ముగిసినప్పటికీ,తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు మరోసారి గడువు పొడిగించినట్లు వెల్లడించారు. ఈ మేరకు SC, ST, BC మైనార్టీ బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
GNTR: ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీఎస్పీ పర్యవేక్షణలో నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఈ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 4 గురిని పట్టుకుని న్యాయస్థానంలో హాజరుపరచగా, ఒకరికి 3 రోజులు, ముగ్గురికి 5 రోజులు జైలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని తెలిపారు.
KRNL: రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. శుక్రవారం కర్నూలులో అత్యధికంగా 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాలలో 41.2, కడపలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో సామాన్య ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.
KRNL: ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై అవినీతి ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్లు హాట్ టాపిక్‌గా మారాయి. టీడీపీ నేత సౌదీ రావుఫ్ మాట్లాడుతూ.. రూ. 10 లక్షల లంచం నిజమేనని, ఈ పోస్టర్ల ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించాలని తెలిపారు. ఇదే సమయంలో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 10 గంటలకు అమలాపురం క్యాంపు కార్యాలయం నందు జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. 10:30 గంటలకు క్యాంపు కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేస్తారు.
ATP: గత ప్రభుత్వం 102 సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేసి రాయలసీమ రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల పనులను జీఓ 365 ద్వారా రద్దు చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం బడ్జెట్లో రూ.10,014 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు.