• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఘనంగా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు

KRNL: మహాత్మ జ్యోతిబా ఫూలే సామాజిక సమానత్వానికి పునాది వేసిన మహనీయుడని మంత్రాలయం మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ బొగ్గుల తిక్కన్న కార్తికేయ పేర్కొన్నారు. ఫూలే 199వ జయంతి సందర్భంగా శనివారం ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బంది ఎం. రామన్న, జె. హనుమంతు ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో కలిసి పని ప్రదేశంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

April 11, 2026 / 11:27 AM IST

గుట్టలు గుట్టలుగా చెత్త.. స్థానికుల ఆగ్రహం

తూ.గో: కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో రోడ్డు పక్కనే చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డంపింగ్ యార్డు ఉన్నప్పటికీ పంచాయతీ నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. దుర్వాసన వ్యాపించి, చెత్త ఇళ్లలోకి చేరుతోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

April 11, 2026 / 11:18 AM IST

జిల్లాలో బాలికల క్రికెట్ పోటీల ఎంపికలు

KRNL: అవుట్ డోర్ స్టేడియంలో ఈనెల 12న బాలికల క్రికెట్ పోటీల ఎంపికలు జరుగుతాయని ఇవాళ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దేవేంద్ర గౌడ్ తెలిపారు. అండర్-15, 19, 23, సీనియర్ విభాగాల్లో రేపు ఉదయం 10 గంటలకు ఇవి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు జనన ధ్రువీకరణ పత్రం, గుర్తింపు కార్డులతో హాజరుకావాలని సూచించారు.

April 11, 2026 / 11:15 AM IST

‘మున్సిపల్ టీచర్లకు ఇంక్రిమెంట్లు ఇవ్వండి’

గుంటూరు జిల్లా ఎస్టీయూ నేతలు పాఠశాల విద్యాశాఖ నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తమీమ్ అన్సారియాను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు, పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బిల్లుల గురించి వివరించారు.

April 11, 2026 / 11:15 AM IST

కనిగిరిలో ఘనంగా పూలే జయంతి వేడుకలు

ప్రకాశం: కనిగిరి పట్టణంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా స్థానిక ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహానుభావుడు జ్యోతిరావు పూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన గొప్ప సామాజిక సంఘ సంస్కర్త అని కొనియాడారు.

April 11, 2026 / 11:12 AM IST

ఘనంగా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

BPT: సంతమాగులూరు మండల కేంద్రంలోని స్థానిక గ్రంథాలయంలో శనివారం సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే, స్వాతంత్య్ర సమరయోధురాలు కస్తూర్బా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథ పాలకుడు బాదం విజయభాస్కర్ రెడ్డి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

April 11, 2026 / 11:11 AM IST

ఫూలే చేసిన కృషి చిరస్మరణీయం: ఎంపీ అంబిక

ATP: జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో సామాజిక సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూల నాగరాజుతో కలిసి ఫూలే చిత్రపటానికి నివాళులర్పించారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఫూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.

April 11, 2026 / 11:02 AM IST

బ్రహ్మోత్సవాల్లో గజవాహనంపై స్వామివారి దర్శనం

ప్రకాశం: మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం చెన్నకేశవస్వామి గజవాహనంపై సార్వభౌమాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని ఉత్సవపీఠంపై ప్రతిష్ఠించి అర్చన, నివేదన, మంగళహారతి నిర్వహించారు. అనంతరం స్వామివారికి మాడవీధు గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు.

April 11, 2026 / 10:52 AM IST

గజపతినగరంలో జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

VZM: గజపతినగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ పార్టీ గజపతినగరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతకై అవిశ్రాంతంగా కృషిచేసిన సంఘసంస్కర్త అని చెప్పారు.

April 11, 2026 / 10:49 AM IST

పోరాట యోధుడు కామ్రేడ్ పైలా వాసుదేవరావు వర్ధంతి కార్యక్రమం

SKLM: సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్రకమిటీ సభ్యులు, జిల్లా సాయుధరైతాంగ పోరాటయోధుడు కామ్రేడ్ పైలా వాసుదేవరావు 16వ వర్ధంతి కార్యక్రమం శ్రీకాకుళం మండలం తంగివానిపేటలో ఇవాళ నిర్వహించారు. IFTU జిల్లా నాయకురాలు కామ్రేడ్ సవలాపురపు కృష్ణవేణి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రైతాంగం కోసం ఆయన చేసిన పోరాటం ఎనలేనిదని అన్నారు.

April 11, 2026 / 10:49 AM IST

సిబ్బంది సమస్యలకు ‘ఎస్పీ సంపర్క్’ సేవ ప్రారంభం

గుంటూరు జిల్లా పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం ఎస్పీ వకుల్ జిందాల్ ‘ఎస్పీ సంపర్క్’ పేరుతో కొత్త వ్యవస్థను ప్రారంభించారు. కానిస్టేబులరీ స్థాయి సిబ్బంది తమ సమస్యలను నేరుగా తెలియజేసేందుకు ఈ సేవ ఉపయోగపడుతుందని ఎస్పీ తెలిపారు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు 8688831470 నంబర్‌లో అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.

April 11, 2026 / 10:41 AM IST

ప్రొద్దుటూరులో వాహనాలు స్వాధీనం

KDP: పొద్దుటూరు ASP విభుకృష్ణ ఆధ్వర్యంలో నేరాల కట్టడికి ఇక్కడి పోలీసులు దూకుడు పెంచారు. సబ్ డివిజన్‌లోని Clలు, SIలు శనివారం ఉదయం స్థానిక 1- టౌన్ స్టేషన్ పరిధిలో ఈశ్వర్ రెడ్డి నగర్ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. రౌడీ, సస్పెక్ట్ షీటర్స్ ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారి కదలికల వివరాలను నమోదు చేసుకున్నారు. సరైన పత్రాలులేని 92 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

April 11, 2026 / 10:37 AM IST

చెన్నూరులో అసాంఘిక శక్తులపై డ్రోన్ నిఘా

KDP: చెన్నూరులో గంజాయి, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో సీఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు డ్రోన్ నిఘా ఏర్పాటు చేశారు. లక్ష్మీనగర్, దౌలతాపురం, జగనన్న కాలనీల్లో స్పెషల్ పార్టీ పోలీసులు తనిఖీలు చేశారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

April 11, 2026 / 10:32 AM IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ప్రకాశం: తాళ్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివరామపురం గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం స్కూలు బస్సును ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి కర్రపాటివారిపాలెంకు చెందిన ఆంజనేయులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

April 11, 2026 / 10:24 AM IST

జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ గడువు పొడిగింపు

GNTR: జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం గడువును పొడిగించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం ద్వారా జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు క్యాష్‌లెస్ చికిత్స కొనసాగుతుంది. ఈహెచ్‌ఎస్ ప్రమాణాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా అందించనున్నారు.

April 11, 2026 / 10:22 AM IST