• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

న్యూస్ ఛానల్ యజమానిపై వైసీపీ నేతలు ఫిర్యాదు

ELR: వైసీపీ కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక టీవీ ఛానల్ యజమానిని తక్షణమే అరెస్ట్ చేయాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. గురువారం ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం చేబ్రోలు ఎస్ఐ సూర్యభగవాన్‌కు ఫిర్యాదు చేశారు.

April 9, 2026 / 07:42 PM IST

పాత వాహనాల కొనుగోలులో అప్రమత్తత అవసరం: ఎస్పీ

 కర్నూలు: పాత వాహనాలను కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. తక్కువ ధరకే వస్తున్నాయని ఆశపడి రిజిస్ట్రేషన్ పత్రాలు లేని వాహనాలు కొనవద్దని, ఆ వాహనాలను కొని ఇబ్బందులు పాలవ్వకూడదని  జిల్లా ప్రజలకు తెలిపారు.​మోటారు వాహనాల చట్టం ప్రకారం, సరైన పత్రాలు లేని వాహనాలను కలిగి ఉండటం లేదా నేరమని తెలిపారు.

April 9, 2026 / 07:25 PM IST

క్యూబాకు మద్దతుగా జోలి పట్టిన సీపీఎం

W,G: తాడేపల్లిగూడెం ఉల్లిపాయల మార్కెట్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద క్యూబా‌కు మద్దతుగా జోలిపట్టి కార్యక్రమం గురువారం సీపీఎం నేతలు నిర్వహించారు. ఇరాన్ తర్వాత క్యూబా దేశంపై దాడులు చేస్తామని ట్రంప్ ప్రకటించడంతో పాటు ఆ దేశానికి వచ్చే ఎగుమతి, దిగుమతులపై ఆంక్షలు విధించడం సరికాదని సీపీఎం మండల కన్వీనర్ సిరపరపు రంగారావు అన్నారు.

April 9, 2026 / 07:24 PM IST

రాయచోటీలో ఎన్యూమరేటర్లకు శిక్షణ

అన్నమయ్య: రాయచోటీ మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ నిర్వహించారు. ట్రైనర్లు గౌస్ పీర్, ఇంతియాజ్ ఖాన్, జఫరుద్దీన్, వెంకట రమణ శిక్షణ అందించారు. రెండు బ్యాచ్‌లుగా 50 మందికి చొప్పున డేటా సేకరణ, ఫీల్డ్ మార్గదర్శకాలపై వివరించారు. ఫీల్డ్‌లో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించాలో కూడా సూచనలు ఇచ్చారు.

April 9, 2026 / 07:23 PM IST

టీడీపీ నాయకుని విగ్రహం ఆవిష్కరణ

PLD: నరసరావుపేట మండలం చింతలపాలెం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు, దివంగత కడియం కోటి సుబ్బారావు విగ్రహావిష్కరణ మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చదలవాడ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు.

April 9, 2026 / 07:20 PM IST

మైలవరం నూతన తహశీల్దార్ ఈయనే..!

KDP: మైలవరం మండల తహశీల్దార్ ఓతూరు షఫీ గురువారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ముద్దునూరు MLS పాయింట్లో డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేసిన ఆయన, బదిలీపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ పనులు, రీసర్వే సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

April 9, 2026 / 07:14 PM IST

పట్టపగలే వెలుగులు

కృష్ణా: మోపిదేవి(M) పెదప్రోలు గ్రామపంచాయతీలో వీధి దీపాల సమస్య తీవ్రంగా ఉంది. జనసంచారం లేని పొలాల్లో లైట్లు ఏర్పాటు చేసి, పగలు కూడా ఆఫ్ చేయకపోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవసరమైన వీధుల్లో మాత్రం దీపాల లేమితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సకాలంలో లైట్లు ఆఫ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

April 9, 2026 / 07:11 PM IST

చీమకుర్తిలో గంజాయి చాక్లెట్లు స్వాధీనం

ప్రకాశం: చీమకుర్తి మండలం బుధవాడ గ్రామంలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనివద్ద నుంచి 800 గంజాయి చాక్లెట్లు, 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్లపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

April 9, 2026 / 07:10 PM IST

ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను పరిశీలించిన ఏవో

ASR: పట్టాదారు పాస్ పుస్తకాలు, పోడు పట్టాలు ఉన్న ప్రతి రైతూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని కొయ్యూరు ఏవో పీ.శివరామ్ ప్రసాద్ సూచించారు. కొయ్యూరు మండలం రావణాపల్లిలో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను ఆయన పరిశీలించారు. సిబ్బందితో కలిసి పలువురు రైతులకు స్వయంగా రిజిస్ట్రేషన్ చేశారు.

April 9, 2026 / 07:09 PM IST

భోగాపురం రహదారి పనుల పరిశీలన

VSP: విశాఖ ఎంపీ శ్రీ భరత్, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ భోగాపురం ఎయిర్‌పోర్ట్ అనుసంధాన రహదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా అడవివరం నుంచి వివిధ మార్గాల్లో పనుల నాణ్యతను తనిఖీ చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్ల నిర్మాణం జరగాలని అధికారులను ఆదేశించారు. జూన్ మొదటి వారం నాటికి ప్రధాన రహదారుల పనులు పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.

April 9, 2026 / 07:09 PM IST

గ్యాస్, రేషన్ పంపిణీలో పారదర్శకత అవసరం: జేసీ

SS: పుట్టపర్తి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్‌లో గురువారం పౌరసరఫరాల శాఖపై జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు డోర్ డెలివరీ విధిగా చేయాలని, అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేషన్ బియ్యం నాణ్యతపై వినియోగదారుల సంతృప్తిని పెంచాలని సూచించారు.

April 9, 2026 / 07:08 PM IST

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం: కమిటీ సభ్యులు

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో కనకదుర్గమ్మ దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఈ నెల 12న జరగనుంది. గతంలో జొన్నవాడ ఆలయ ఛైర్మన్‌గా విశేష సేవలందించిన పుట్టా లక్ష్మి సుబ్రహ్మణ్యం నాయుడును ఈ ఆలయ ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీ. ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని కమిటీ సభ్యులు ధీమా వ్యక్తం చేశారు.

April 9, 2026 / 07:05 PM IST

పర్యాటక భవనాల లీజుకు బహిరంగ వేలం

ATP: జిల్లాలోని పర్యాటక ప్రాపర్టీల నిర్వహణకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటక అధికారి తెలిపారు. మారూరు టోల్ గేట్ రెస్టారెంట్, తాడిపత్రి హోటల్, ఎంపీఆర్ డ్యామ్ రెస్ట్ హౌస్ భవనాలను వార్షిక లీజు పద్ధతిలో కేటాయించనున్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 16వ తేదీలోపు పర్యాటక కార్యాలయంలో వివరాలు పొందవచ్చన్నారు. కాగా, ఏప్రిల్ 17న వేలం ఉంటుందని వెల్లడించారు.

April 9, 2026 / 07:05 PM IST

జిల్లా వ్యాప్తంగా నాలుగో విడత రీ సర్వే

SKLM: జిల్లా వ్యాప్తంగా నాలుగో విడత రీ సర్వే జరగనున్నదని సర్వే, భూములు అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. జ్యోషిత అన్నారు. ఈ మేరకు గురువారం మందస తహసీల్దార్ మిస్కా శ్రీకాంత్ ఆధ్వర్యంలో రీ సర్వేపై గ్రామ సర్వేయర్లకు రివ్యూ సమావేశం నిర్వహించారు. రీ సర్వే సమయంలో ఈకేవైసీ చేయాలని, రైతులతో సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు.

April 9, 2026 / 07:05 PM IST

చిన్న దిమిలిలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

PPM: భామిని మండలం చిన్న దిమిలి గ్రామంలో సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం, రేషన్ షాపును పరిశీలించి రికార్డులు, సరుకుల పంపిణీపై ఆరా తీశారు. ప్రజలకు సేవలు సకాలంలో అందేలా చూడాలని, నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని ఆదేశించారు.

April 9, 2026 / 07:04 PM IST