• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఎర్నిమాంబ అమ్మవారి జాతరకు ఏర్పాట్ల సమీక్ష

VSP: జ్ఞానాపురంలోని శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం మే 12 నుంచి 17 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సి.హెచ్. వంశీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. జాతరను వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. సమావేశంలో ఆలయ అధికారులు, దేవదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

April 4, 2026 / 10:22 PM IST

జిల్లా కలెక్టర్‌ను కలసిన నరవ దంపతులు

KRNL: పెద్దకడబూరు మండలంలో ప్రజా సమస్యలపై TDP రాష్ట్ర రైతు ప్రతినిధి రమాకాంత్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి శశిరేఖ ఇవాళ జిల్లా కలెక్టర్‌ ఏ.సిరిని కలిశారు. కలెక్టర్ ఛాంబర్‌లో రైతుల ఇబ్బందులు, తాగునీరు, రహదారులు, సాగునీటి కొరత వంటి సమస్యలను వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారం కోరారు. సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

April 4, 2026 / 10:00 PM IST

‘ఆధునిక టెక్నాలజీ శిక్షణతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్’

KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని టెక్‌వేవ్స్ ట్రైబ్ అకాడమీ తొలి వార్షికోత్సవం సందర్భంగా DSP భార్గవి అకాడమీ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, MERN ఫుల్ స్టాక్ వంటి రంగాల్లో శిక్షణతో విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని తెలిపారు. స్థానిక యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 4, 2026 / 10:00 PM IST

11వ స్థానంలో పలనాడు జిల్లా

PLD: పీహెచ్సీ పనితీరు ర్యాంకింగ్స్‌లో ఫిబ్రవరి 2026కు సంబంధించి జిల్లా 11వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 39 పీహెచ్సీలలో 7 ఏ గ్రేడ్, 23 బీ, 9 సీ గ్రేడ్లు సాధించాయి. మొత్తం 195 మార్కుల్లో 154 మార్కులు పొందింది. వెనుకబడిన ప్రాంతాలలో సేవలు మెరుగుదల అవసరం ఉన్నప్పటికీ మొత్తం ఆరోగ్య సేవల నాణ్యత క్రమంగా పెరుగుతుందని అధికారులు తెలిపారు.

April 4, 2026 / 10:00 PM IST

బాధిత కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

GNTR: పొన్నూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చెక్కులు పంపిణీ చేశారు. నలుగురు బాధిత కుటుంబాలకు రూ.7 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు సాయం అందించారు. బాజీకి రూ.2 లక్షలు, కోటేశ్వరరావుకు రూ.2 లక్షలు, కుద్దుస్‌కు రూ.లక్ష, మస్తాన్ వలీకి రూ.2 లక్షలు ఇచ్చారు.

April 4, 2026 / 10:00 PM IST

చెరువులో గుర్తుతెలియని మృతదేహం

BPT: స్టువర్టుపురం ఐదో గ్యాంగ్ వెనుక చెరువులో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. నీటిలో శవం ఉండటాన్ని వీఆర్వో గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి వయసు 40-45 ఏళ్లు ఉంటుంది. వయొలెట్ టీషర్ట్, గ్రీన్ షార్ట్, లుంగీ ధరించాడు. ఘటనపై వెదుళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిస్తే ఎస్హెచ్ఓకు సమాచారం ఇవ్వాలని కోరారు.

April 4, 2026 / 10:00 PM IST

రేపటి నుంచి మాంసం షాపులకు అనుమతి

NTR: నందిగామలో మాంసం షాపులు, హోటళ్లకు రేపటి నుంచి అనుమతి ఇచ్చారు. చందాపురం గ్రామంలో ఆరోగ్య పరిస్థితి అదుపులోకి రావడంతో పాటు గత ఐదు రోజులుగా కొత్త కేసులు నమోదు కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 5 నుంచి గొర్రె, మేక, కోడి, చేపలు తదితర మాంసం తాజాగానే వధించి విక్రయించాలని అధికారులు సూచించారు. నిల్వ మాంసం విక్రయానికి అనుమతి లేదని తెలిపారు.

April 4, 2026 / 10:00 PM IST

హోం మంత్రిపై విమర్శలు

AKP: పీఎం, సీఎం, డిప్యూటీ సీఎంను పొగుడుతూ జగన్‌ను తిట్టడానికే హోం మంత్రి వంగలపూడి అనితకు సమయం సరిపోతుంది అని పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కంబాల జోగులు విమర్శించారు. శనివారం నక్కపల్లిలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, గంజాయి రవాణా జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇక నుంచి చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతామన్నారు.

April 4, 2026 / 09:59 PM IST

‘మన్యం వేసవి వినోదం’ ప్రారంభం

పార్వతీపురం జిల్లాలో ‘మన్యం వేసవి వినోదం’ కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఐటీడీఏ పార్కుల్లో ప్రత్యేక రాయితీలు కల్పించగా, ఉపాధ్యాయులకు ఉచిత ప్రవేశం కల్పించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

April 4, 2026 / 09:45 PM IST

అభివృద్ధి పనులపై సమీక్ష

ప్రకాశం: వెలిగండ్ల మండలం మరపుగుంట్ల స్వర్ణ గ్రామంలో యు.ఎఫ్.ఎస్ సర్వే, అభివృద్ధి పనులను శుక్రవారం డబ్ల్యూ డిప్యూటీ ఎంపీడీవో ఎస్. రాంప్రసాద్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించి, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

April 4, 2026 / 09:32 PM IST

ప్రతి శనివారం రోడ్డు భద్రత డ్రైవ్: ఎస్పీ

KRNL: జిల్లాలో రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రతి శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై ప్రచారం చేపట్టారు. హెల్మెట్ ధరించడం, ఓవర్ స్పీడ్, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని పేర్కొన్నారు. జనవరి 1 నుంచి ఏప్రిల్ 3 వరకు పలు ఉల్లంఘనలపై ఈ-చలాన్లు నమోదు చేసినట్లు తెలిపారు.

April 4, 2026 / 09:30 PM IST

స్వామివారి సేవలో మాజీ మంత్రి

CTR: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానాన్ని కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు.

April 4, 2026 / 09:30 PM IST

జిల్లాలో అక్రమ మద్యం విక్రయం బట్టబయలు

KDP: కలసపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నారెడ్డి పల్లిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 7 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు SI సుబహాన్ తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

April 4, 2026 / 09:30 PM IST

గ్యాస్ ఏజెన్సీల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు

GNTR: మంగళగిరిలో గ్యాస్ డోర్ డెలివరీ నిలిపివేతపై తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర స్పందించారు. అధికారులతో కలిసి ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. నిబంధనల ప్రకారం వినియోగదారుల ఇళ్ల వద్దకే సిలిండర్లను డెలివరీ చేయాలని ఆదేశించారు. వాహనాల వద్దకే వచ్చి సిలిండర్లు తీసుకెళ్లాలని ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 4, 2026 / 09:30 PM IST

పిచ్చాటూరులో అంగన్‌వాడి పోస్టుల భర్తీ

TPT: పిచ్చాటూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లో అంగన్‌వాడి కార్యకర్త-1, హెల్పర్- 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏప్రిల్ 6 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హతలు కలిగిన స్థానిక మహిళలు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలన్నారు. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారన్నారు.

April 4, 2026 / 09:29 PM IST