• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘నీటి భద్రతతోనే జల మట్టం పెంపు’

ASR: పాడేరులో భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ‘నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత’ 100 రోజుల కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, కలెక్టర్ నిశాంతితో కలిసి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు జలమట్టాన్ని 1.5 మీటర్లు పెంచాలని ఆమె అధికారులకి సూచించారు. పంచసూత్రాలు అమలుచేస్తూ ప్రతి నీటిబొట్టును కాపాడుకోవాలని, ఇందులో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆమె కోరారు.

April 6, 2026 / 04:36 PM IST

లబ్ధిదారులకు CMR చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CTR: చిత్తూరు నగరంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీ మోహన్ లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం రూ.38,51,938 విలువైన చెక్కులను అందజేశారు. నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులు ఈ చెక్కులను పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

April 6, 2026 / 04:31 PM IST

ప్రాజెక్టుకు పూర్తి అనుమతులు నేటికీ రాలేదు: జూలకంటి

PLD: వరికిపూడిశెల ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిస్థాయి అనుమతులు నేటికీ రాలేదని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. సోమవారం మాచర్ల పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు ప్రాజెక్టుపై సరియైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అటవీ శాఖ అనుమతులు రాగానే అన్ని అనుమతులు వచ్చాయని అజ్ఞానంతో మాట్లాడుతున్నారన్నారు.

April 6, 2026 / 04:30 PM IST

జిల్లాలో భారీ వర్షం.. పిడుగుపాటుతో ఒకరు మృతి

ప్రకాశం: పుల్లలచేరువులో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా గ్రామంలో పిడుగుపాటుకు ఓ యువకుడు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

April 6, 2026 / 04:30 PM IST

రాజముద్రతో నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ

W.G: పాలకోడేరు(మం) గరగపర్రు గ్రామంలో పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందజేసే కార్యక్రమం సోమవారం నిర్వహించారు. అసెంబ్లీ డిప్యుటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. రాజముద్రతో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆయనతో పాటు అధికారులు, రైతులు, కూటమి నేతలు ఉన్నారు.

April 6, 2026 / 04:30 PM IST

వీరులపాడు మహిళా సమైఖ్యకు భారీ ఆర్థిక మద్దతు

NTR: వీరులపాడు మండల మహిళా సమైఖ్య ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి డ్వాక్రా మహిళలకు చెక్కులను అందజేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, వివిధ పథకాల ద్వారా మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తోందని తెలిపారు.

April 6, 2026 / 04:30 PM IST

పీజీఆర్ఎస్‌కు 88 వినతులు

PPM: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పీజీఆర్ఎస్‌ సమర్థవంతమైన వేదికని కలెక్టర్ డా ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా PGRS గ్రీవెన్స్‌లో సమస్యలను పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్‌కు 88 వినతులు, రెవెన్యూ రెవెన్యూ క్లినిక్‌కు 25 వినతులు అందాయన్నారు. సమస్యలన్నీ నిర్దిష్టమైన గడువులోగా పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు.

April 6, 2026 / 04:24 PM IST

బద్వేలులో వృద్ధుడిపై దాడి

KDP: బద్వేలులో ఆదివారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు రోడ్డులో టీ తాగి ఇంటికి వెళ్తున్న అల్లూరి వెంకటేశయ్య (70)పై నలుగురు దుండగులు దాడి చేశారు. పాత కక్షలతో దారి కాచి, కట్టెలతో తీవ్రంగా కొట్టారు. బాధితుడు వేడుకున్నా కనికరం చూపకుండా దారుణంగా హింసించి, ఆయన వద్ద ఉన్న సుమారు రూ.20 వేలు, మొబైల్ ఫోన్ లాక్కొని పరారయ్యారని బాధితుడు వాపోయాడు.

April 6, 2026 / 04:20 PM IST

బాపట్లలో ‘బాలవనం’ ప్రారంభం

BPT: బాపట్ల పట్టణంలోని 9వ వార్డు గుంటూరు బ్రిడ్జి కింద నూతనంగా ఏర్పాటు చేసిన ‘బాపట్ల బాలవనం’ను జిల్లా ఇంచార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పాల్గొన్నారు. చిన్నారులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా పార్కును రూపొందించామని తెలిపారు.

April 6, 2026 / 04:14 PM IST

మంత్రి లోకేష్‌తో ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్

KRNL: మంత్రి లోకేష్‌ను ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. లోకేష్ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ బలోపేతానికి సంబంధించిన కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ అభివృద్ధి పనుల అమలు విధానం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

April 6, 2026 / 04:14 PM IST

సాగునీటి భద్రత కోసం చర్యలు

SKLM: మందస మండలంలో సాగునీటి భద్రత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. టీడీపీ మందస మండల అధ్యక్షులు భావన దుర్యోధన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం మందస జన చెరువు దగ్గర కార్యక్రమం నిర్వహించారు. సాగునీటి సంఘాల అధ్యక్షులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు. ఏప్రిల్ 21 నుండి జూలై 14వ తేదీ లోపల పనులన్నింటినీ పూర్తి చేయాలని తెలిపారు.

April 6, 2026 / 04:11 PM IST

పుంగనూరులో ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

CTR: పుంగనూరు మండలం సింగిరిగుంట గ్రామపంచాయతీలో సోమవారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పట్టణంలోని కొత్తయిండ్లు, సింగిరిగుంట వద్ద ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు, రాష్ట్ర నాయకుడు రాజారెడ్డి తదితరులు కలిసి జెండాను ఎగురవేశారు. 1980 ఏప్రిల్ 6న అటల్ బిహారీ వాజ్‌పేయీ నేతృత్వంలో బీజేపీ స్థాపించారని తెలిపారు.

April 6, 2026 / 04:06 PM IST

‘భూగర్భ జలాలు పెంచటమే ప్రభుత్వ లక్ష్యం’

కృష్ణా: రాష్ట్రంలో భూగర్భ జలాలు పెంచటమే ప్రభుత్వ లక్ష్యం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం చల్లపల్లి మండలం వక్కలగడ్డలో బస్ షెల్టర్ వద్ధ ఉన్న పంచాయతీ చెరువు వద్ధ భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ జల ధార కార్యక్రమం ద్వారా వంద రోజుల ప్రణాళిక చేపట్టినట్లు తెలిపారు.

April 6, 2026 / 04:05 PM IST

ఆయుష్మాన్ వయో వందన కార్డుల సమస్యలపై వినతి

E.G: ఆయుష్మాన్ వయో వందన కార్డులకు వైద్య సదుపాయాలు అందించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివ రామకృష్ణం రాజు, కో కన్వీనర్ యానాపు ఏసు కలెక్టర్‌కి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద నిర్వహించిన PGRSలో వినతి పత్రం సమర్పించారు. ఆయుష్మాన్ వయో వందన కార్డులను రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తప్పనిసరిగా అంగీకరించాలన్నారు.

April 6, 2026 / 04:00 PM IST

నీటి భద్రతపై ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌: ఎమ్మెల్యే కన్నా

PLD: “నీటి భద్రత-సాగు నీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం వంద రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని సూచించారు. కాల్వలు, చెరువులు, చెక్‌డ్యాంలను పునరుద్ధరించి నీటి నిల్వకు సిద్ధం చేయాలని తెలిపారు.

April 6, 2026 / 04:00 PM IST