ప్రకాశం: పుల్లలచేరువులో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా గ్రామంలో పిడుగుపాటుకు ఓ యువకుడు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.