• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కర్నూలులో అత్యధికంగా 44.2 డిగ్రీల నమోదు

KRNL: జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఇవాళ కర్నూలు జిల్లా లద్దగిరి, అత్యధికంగా 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

April 15, 2026 / 10:00 PM IST

రౌడీయిజంపై ఉక్కుపాదం: ఎస్పీ

KDP: జిల్లాలో రౌడీయిజం, గంజాయి కార్యకలాపాలకు తావులేదని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ బుధవారం ప్రొద్దుటూరులో జరిగిన నేర సమీక్షా సమావేశంలో స్పష్టం చేశారు. మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. బెల్ట్ షాపులు, బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు తీసుకోవాలని, బెట్టింగ్, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు.

April 15, 2026 / 10:00 PM IST

ఎమ్మెల్యే కోట్లను కలిసిన వలసల రామకృష్ణ

NDL: టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన వలసల రామకృష్ణ బుధవారం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల సమన్వయం వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. కొత్తగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణకి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.

April 15, 2026 / 10:00 PM IST

‘నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది వైసీపీనే’

PLD: పెద్దకూరపాడు నియోజకవర్గ చరిత్రలోనే అభివృద్ధి జరిగిందంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని తాడికొండ YCP పరిశీలకులు ఈదసాంబిరెడ్డి అన్నారు. ఏ గ్రామంలో చూసిన రోడ్లు, సచివాలయాలు, ఆర్బికేల నిర్మాణం జరిగిందన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత వైసీపీకే దక్కిందన్నారు.

April 15, 2026 / 09:31 PM IST

రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శిగా అర్చన

SKLM: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహక కార్యదర్శిగా బగ్గు అర్చన నియమితులయ్యారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజల సేవలో నిమగ్నం అవుతానని చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమెను అభినందించారు.

April 15, 2026 / 09:30 PM IST

దేవనకొండ మండలంలో ప్రత్యేక అధికారుల నియామకం

KRNL: దేవనకొండ మండలంలోని 26 గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవో జ్యోతి తెలిపారు. అలారుదిన్నె, దేవనకొండ, కరివేములకు ఎస్.జ్యోతి.. బండపల్లి, గుండ్లకొండ, పాలకుర్తికు మొహమ్మద్ రఫీ, జిలేడుబుడకల, కప్పట్రాళ్లకు బి. ఉషారాణి, కె. వెంకటాపురం-పల్లెదొడ్డికు ఎం. సుదర్శనం, కొత్తపేట, కుంకనూరుకు ఎన్జీ. వెంకటేశ్.. మాచారానికి కె. విజయ నియమితులయ్యారు.

April 15, 2026 / 09:30 PM IST

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎం.ఏ. షరీఫ్

W.G: నరసాపురానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎం.ఏ. షరీఫ్‌కు పార్టీ అధిష్టానం గుర్తింపునిచ్చింది. పార్టీలో అత్యున్నత నిర్ణాయక విభాగమైన ‘పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయనను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా ఉన్న షరీఫ్, గతంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా, క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్‌గా విశేష సేవలు అందించారు.

April 15, 2026 / 09:30 PM IST

గృహ గణన పత్రికలను ఆవిష్కరించిన MLA

ELR: జనాభా గణన 2027 కార్యక్రమంలో ఇంటి జాబితా, గృహ గణనపై అవగాహన కల్పించే పత్రికను ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు ఆవిష్కరించారు. స్థానిక MLA క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం జనాభా గణన కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు పూర్తి సమాచారం అందించాలన్నారు.

April 15, 2026 / 09:30 PM IST

ఇంటర్‌లో గోడి కళాశాల విద్యార్థులు ప్రతిభ

కోనసీమ: అల్లవరం మండలం గోడిలో ఉన్న అంబేద్కర్ గురుకులం బాలుర కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో ప్రతిభ చూపారని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరంలో 83.33%, ద్వితీయ సంవత్సరంలో 86% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అన్నారు. ఫస్ట్ ఇయర్‌లో రోహిత్ 482 మార్కులు, బాల సందీప్ 435 మార్కులు సాధించారన్నారు.

April 15, 2026 / 09:26 PM IST

ఏల్చూరులో ఓటర్ లిస్ట్ పబ్లికేషన్

BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలో ఓటర్ల తుది జాబితాను అధికారికంగా ప్రచురించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ పేర్లు ఓటర్ లిస్ట్‌లో ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. అర్హత కలిగిన వారు పేర్లు లేకపోతే సవరణలు, అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశం ఉందని తెలిపారు.

April 15, 2026 / 09:22 PM IST

ఈనెల 16 నుంచి స్వీయ గణన ప్రక్రియ: కలెక్టర్

NTR: స్వీయ గణన ప్రక్రియను ఈనెల 16 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. జీ. లక్ష్మీశ తెలిపారు. ఈ సందర్భంగా https://se.census.gov.in⁠ పోర్టల్ ద్వారా ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ విధానం ద్వారా సమయం ఆదా అవడంతో పాటు కచ్చితమైన డేటా లభిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చైతన్యంతో పాల్గొని జనగణనను విజయవంతం చేయాలని కోరారు.

April 15, 2026 / 09:00 PM IST

టాప్ 3 నిలవడం గర్వకారణం: మంత్రి

ఇంటర్మీడియట్ ఫలితాల్లో మన్యం జిల్లా అద్భుతమైన ప్రగతిని కనబరచడంపై రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. గతేడాది రాష్ట్ర స్థాయిలో 7వ స్థానంలో ఉన్న జిల్లా, ఈ ఏడాది 87 శాతం ఉత్తీర్ణతతో ఏకంగా మూడో స్థానానికి చేరుకోవడం గర్వకారణం అని మంత్రి కొనియాడారు. అభివృద్ధి చెందిన జిల్లాలతో పోటీపడిన టాప్ 3లో నిలవడం నిదర్శమన్నారు.

April 15, 2026 / 09:00 PM IST

తాగునీరు సౌకర్యం కల్పించండి సారు..!

ASR: ముంచంగిపుట్టు మండలంలోని మాకవరం పంచాయతీ కేంద్రంలో తీవ్రమైన నీటి కొరత నెలకొంది. సుమారు 80 కుటుంబాల గిరిజనులు ఒకే బోరు, ఊటగెడ్డ నీటిపై ఆధారపడుతున్నాయి. వేసవి తీవ్రతతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు, ప్రభుత్వం స్పందించి మంచినీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

April 15, 2026 / 09:00 PM IST

ప్రాణాలకు పెనుముప్పుగా మారిన డంపింగ్ యార్డు..!

NDL: ఆళ్లగడ్డలోని సత్రం వీధి, అమ్మవారిశాల వీధి శివార్లలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ పొగ పీల్చి ప్రజలు రోజూ ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని తడి, పొడిచెత్తను సేకరించి డంప్ యార్డుకు తరలించి పారిశుద్ధ్య కార్మికులు నిప్పు పెడుతుండటంతో పొగ వీధుల నిండా అలుముకుంటోంది. దీనివల్ల రోగాలు వ్యాపిస్తున్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

April 15, 2026 / 09:00 PM IST

మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్.?

GNTR: భారత్‌నెట్, పీఎం-వాణీ పబ్లిక్ వైఫై విస్తరణపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షించారు. సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించే మార్గాలపై చర్చించారు. అమలు ప్రక్రియలు, వ్యయ నిర్మాణంపై పలు సూచనలు చేశారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం నాణ్యమైన ఇంటర్నెట్ అందించడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

April 15, 2026 / 08:44 PM IST