SKLM: ఎచ్చెర్లలో ఉన్న ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో సోమవారం నుంచి విద్యార్థినుల కోసం పాలీసెట్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. పదో తరగతి విద్యార్హతతో డిప్లమా కోర్సుల్లో ప్రవేశానికి పాలీసెట్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ విక్టర్ పాల్ విద్యారి తెలిపారు. తక్కువ ఖర్చుతో మంచి భవిష్యత్తు డిప్లమోతో సాధ్యమన్నారు.
GNTR: తెనాలి మండలం సంగం జాగర్లమూడి వద్ద సోమవారం ప్రమాదం జరిగింది. తెనాలి-నారాకోడూరు మార్గంలోని మూలమలుపు వద్ద మెడికల్ సరుకు లోడ్‌తో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి కాలువ గట్టుపైకి దూసుకెళ్లింది. కాలువ అంచున ఆటో నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అయితే ఆటోలోని మందుల బాక్సులన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
PLD: శావల్యాపురం మండలం కనుమర్లపూడిలో ‘నీటి భద్రత’ కార్యక్రమం జరిగింది. చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని ప్రోక్లైన్తో చెరువు పనులను ప్రారంభించారు. కాలువల్లో పూడికతీతతో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ప్రతి ఊరిలో ‘గ్రామ నీటి బడ్జెట్’ రూపొందించాలన్నారు. భవిష్యత్ తరాల కోసం జల వనరులను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
NTR: సర్పంచుల పదవీకాలం ముగియడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు నందిగామ MPDO ఆర్.వి.ఎస్. ప్రసాదరావు సోమవారం కంచల గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికను, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
కృష్ణా: మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో 35 ఫిర్యాదులను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సోమవారం స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సమర్పించే అర్జీలపై ఎలాంటి జాప్యం లేకుండా స్పందించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ELR: పోలవరం మండలంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మొక్కజొన్న రైతుల సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు పెరిగాయని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో మద్దతు ధరతో రైతులను ఆదుకుందని కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే క్వింటాకు రూ.2400ల మద్దతు ధర ఇవ్వాలన్నారు.
KRNL: కోసిగి మండలంలో ఆరు సంవత్సరాలుగా కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన అంబేద్కర్ విగ్రహ నిర్మాణ సమస్యకు ఇవాళ పరిష్కారం లభించింది. టీడీపీ ఇంఛార్జి రాఘవేంద్ర రెడ్డి చొరవతో, గ్రామ పెద్దల సమక్షంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించారు. ఈ పరిష్కారంతో కోసిగిలోని మూడు ఎస్సీ కాలనీల దళితులు, మండలంలోని ఇతర దళితులు సంతోషం వ్యక్తం చేశారు.
VSP: దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సోమవారం ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసిన 60 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని, కుటుంబ అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని పేర్కొన్నారు. శిక్షణ పొందిన వారందరినీ ఎమ్మెల్యే అభినందించారు.
VZM: అకాల వర్షాలు, ఈదురు గాలులు కారణంగా చేతివరకు వచ్చిన పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సందర్బంగా బొబ్బిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేయాలని ఆదేశించారు. నివేదికను సత్వరమే తయారుచేయాలని కోరారు.
NDL: పాణ్యం మండలం సుగాలిమెట్టలో జలధార–జలహారతి పనులను మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, కలెక్టర్ రాజకుమారి ఇవాళ ప్రారంభించారు. భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణగా అమలు చేస్తోందని తెలిపారు. సాగునీటి సంఘాలు సమన్వయంతో పని చేసి నీటి వనరులను సంరక్షించాలని సూచించారు. నీటి భద్రతపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చారు.
KDP: గత రాత్రి గాలివాన కారణంగా బ్రహ్మంసాగర్ సమీపంలో విద్యుత్ లైన్లు తెగిపోవడం, నందిపల్లె వద్ద వాటర్ పైప్‌లైన్ దెబ్బతినడంతో తాగునీటి సరఫరా అంతరాయం కలిగింది. మరమ్మతులు పూర్తి చేసినప్పటికీ పూర్తిస్థాయిలో నీటి సరఫరా అందుబాటులోకి రావడానికి మరో అర్ధ రోజు సమయం పడుతుందని బద్వేల్ మున్సిపల్ అధికారులు తెలిపారు.
PLD: సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిని ఏఐటీయూసీ నాయకులు అంజిరెడ్డి, కంబాల శ్రీనివాసరావు, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ పూదోట సందర్శించారు. కూటమి ప్రభుత్వం ప్యానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి రూ.18,600 జీతాలు ఆదేశించినా, కాంట్రాక్టు ఏజెన్సీలు తక్కువ మొత్తంలో మాత్రమే చెల్లిస్తూ దోపిడీ చేస్తున్నాయని వారు ఆరోపించారు.
అన్నమయ్య: రామాపురం మండలం కల్పనాయుని చెరువు గ్రామం మూలపల్లెలో నిర్వహించిన శ్రీ హనుమత్సమేత సీతారామలక్ష్మణ గణపతి విగ్రహ కలశ ప్రతిష్టా మహోత్సవంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయచోటి నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యం నెరవేరుతుండటం ఆనందంగా ఉందన్నారు.
ప్రకాశం: కనిగిరి ఏపీ మోడల్ స్కూల్లో ఈనెల 12న ఆరో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి తులసి తెలిపారు. పరీక్ష రాయనున్న విద్యార్థులు అరగంట ముందుగానే పాఠశాలకు చేరుకుని తమకు కేటాయించిన గదులను చూసుకోవాలని సూచించారు. హాల్ టికెట్లు ఈనెల 3వ తేదీ నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
GNTR: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ నెల 8న నిర్వహించనున్న మెగా కల్చరల్ ఫెస్ట్ వేడుకలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు యూనివర్సిటీ అధికారులు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విశ్వవిద్యాలయం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.