• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఆదోనిలో బాల్య వివాహం అడ్డుకున్న పోలీసులు

KRNL: ఆదోనిలోని తిరుమల నగర్‌లో బాల్యవివాహం జరగబోతోందనే సమాచారం అందడంతో అధికారులు బుధవారం అప్రమత్తమయ్యారు. ఇద్దరు మైనర్లకు పెళ్లి జరుపుతున్నారన్న సమాచారంతో శక్తి టీం అక్కడికి వెళ్లి విచారణ చేపట్టింది. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్యవివాహం చట్టరీత్యా నేరమని వివరించారు. ఆదేశాలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

April 9, 2026 / 07:30 AM IST

నేడు ఉపాధ్యాయుల నిరసన.. ఫ్యాప్టో పిలుపు

W.G: ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు గురువారం వీరవాసరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షులు విజయరామరాజు తెలిపారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు జరిగే ఈ ఆందోళనలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా తమ గళం వినిపిస్తామని తెలిపారు.

April 9, 2026 / 07:30 AM IST

మహిళా సంఘాల సభ్యులతో వెలుగు సీసీ సమావేశం

PPM: మన డబ్బులు మన లెక్కలు యాప్‌ ద్వారా మహిళా సంఘాల సభ్యులు పొదుపు, అప్పు నిల్వలు వారివారి మొబైల్లలో తెలుసుకోవచ్చని వెలుగు సీసీ పి.రామకృష్ణ రావు సూచించారు. ఈ మేరకు బుధవారం రాత్రి పాచిపెంట మండలం పణుకువలసలో మహిళా సంఘాల సభ్యులకు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పొదుపులో ఉన్న అమౌంట్‌ను డిపాజిట్‌ చేసుకోవాలని, అప్పులు సకాలంలో చెల్లించాలని కోరారు.

April 9, 2026 / 07:29 AM IST

‘భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యం’

SKLM: జిల్లాలో భూగర్భ జల మట్టాలను పెంచి, నీటి భద్రతను కల్పించడమే లక్ష్యంగా జలధార -జల హారతి 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా అధికారులతో మాట్లాడారు. ప్రజలను, నీటి సంఘాలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేయాలన్నారు.

April 9, 2026 / 07:27 AM IST

మహిళా కారాగారాన్ని సందర్శించిన జడ్జి

E.G: రాజమండ్రి మహిళా కారాగారాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి ఎన్. శ్రీలక్ష్మి బుధవారం సందర్శించి ఖైదీల సదుపాయాలను పరిశీలించారు. న్యాయవాదులు లేని వారికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని, బెయిల్ లేదా అప్పీలు దాఖలుకు సంస్థ సహకరిస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. ఆహార నాణ్యతపై ఆరా తీస్తూ, ఖైదీల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

April 9, 2026 / 07:22 AM IST

‘ఫ్లైఓవర్లు నిర్మిస్తే రాకపోకలు సులభమవుతాయి’

VSP: భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బుధవారం వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రోడ్ల పురోగతిపై ఎంవీపీ కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం దృష్ట్యా 7 రోడ్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆనందపురం, అడివివరం ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మిస్తే రాకపోకలు సులభమవుతాయని తెలిపారు. భూ నిర్వాసితులకు త్వరగా టీడీఆర్లు ఇవ్వాలని సూచించారు.

April 9, 2026 / 07:19 AM IST

‘బొబ్బిలి నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి పని చేయాలి’

VZM: బొబ్బిలి నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి పని చేయాలని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడును మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం జగన్‌ను కలిశారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి కలిసికట్టుగా పని చేయాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి ప్రణాళికతో పని చేయాలని సూచించారు.

April 9, 2026 / 07:19 AM IST

విద్యార్థుల భవిష్యత్తుకు మార్కులే పునాది: కలెక్టర్

కోనసీమ: విద్యార్థుల భవిష్యత్తుకు మార్కులే పునాది అని కలెక్టర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. అమలాపురం జెడ్పీ హైస్కూల్లోని పదో తరగతి మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించిన ఆయన, ఈ ప్రక్రియను పవిత్ర బాధ్యతగా చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థి జీవితంలో ఇది కీలక మలుపు అని, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కలెక్టర్ వెంట విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

April 9, 2026 / 07:17 AM IST

అక్రమంగా తరలిస్తున్న చికెన్ వ్యర్ధాలు పూడ్చివేత

NLR: మర్రిపాడు మండలం నెల్లూరు – ముంబై 67 జాతీయ రహదారి‌పై కర్ణాటక నుంచి అక్రమంగా చికెన్ వ్యర్ధాలను తరలిస్తున్న వాహనాలపై మర్రిపాడు పోలీసులు వరుస దాడులు చేస్తున్నారు. పోలీసులు ఎస్ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ట్రక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్, రెవెన్యూ సిబ్బందితో కలిసి ఏఎస్సై నజీర్ చికెన్ వ్యర్థాలను పూడ్చిపెట్టారు.

April 9, 2026 / 07:14 AM IST

నాందేడ్ – ధర్మవరం రైలు రెగ్యులర్ సర్వీస్

సత్యసాయి: నాందేడ్ – ధర్మవరం ప్రత్యేక రైలును రెగ్యులర్ సర్వీసుగా మారుస్తూ కేంద్ర రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. హిందూపురం ఎంపీ బి.కె. పార్థసారథి విజ్ఞప్తి మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మార్పునకు ఆమోదం తెలిపారు. ఇక నుంచి ఈ రైలు 17635/17636 నంబర్లతో హజూర్ సాహిబ్ నాందేడ్ – ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌గా సేవలు అందించనుంది.

April 9, 2026 / 07:11 AM IST

అనధికార లేఔట్లకు హెచ్చరిక నోటీసు బోర్డులు

CTR: కుప్పం (M) దాసే గానూరు పంచాయతీలో అక్రమంగా వెలిసిన లేఔట్లలో పంచాయతీ అధికారులు నోటీసు బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా వేసిన లేఔట్లలో ఎవరైనా స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడితే వారికి ఎలాంటి మౌలిక వసతులు కల్పించడం జరగదని పంచాయతీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు.

April 9, 2026 / 07:11 AM IST

నగదు పట్టుబడిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు

ఎన్టీఆర్: విజయవాడ గుణదల పడవలరేవు వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. పోలీసులను చూసి కారును వెనక్కి తిప్పేందుకు ప్రయత్నించిన బల్వంత్ అమర్సింగ్ సోలంకీ, అల్పేష్ కుమార్లను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సత్యరమేష్ తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు.

April 9, 2026 / 07:11 AM IST

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్.. ఉద్యోగి సస్పెండ్

ప్రకాశం: కనిగిరి(M) తాళ్లూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్‌గా పనిచేస్తున్న దద్దాలి శ్రీనివాస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీనిపై కేసు నమోదు అయింది. దీంతో విచారణ జరిపిన డీఈఓ రేణుక శ్రీనివాసరావును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

April 9, 2026 / 07:09 AM IST

శ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్‌కు భారీ విరాళం

TPT: శ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్‌కు తిరుపతికి చెందిన పి.సతీష్ కుమార్, పి.రోజా దంపతులు విరాళంగా రూ.10 లక్షలు నిన్న అందించారు. ఈ మేరకు డీడీని తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో టీటీడీ ఈవో ఎం.రవిచంద్రకి దాత అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను టీటీడీ ఈవో అభినందించారు.

April 9, 2026 / 07:07 AM IST

‘జనాభా గణన విజయానికి ప్రజల సహకారం అవసరం’

GNTR: జనాభా గణన-2027 విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయి కాంత్ వర్మ తెలిపారు. జనాభా గణనను ఈసారి రెండు దశల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తిగా డిజిటల్ విధానంలో చేపట్టనున్న ఈ ప్రక్రియలో మొబైల్ యాప్ ద్వారా డేటా సేకరణ జరుగుతుందని వెల్లడించారు.

April 9, 2026 / 07:04 AM IST