PPM: సీతానగరం మండలం చినభోగిలి గ్రామంలోని శ్రీ రామాలయాన్ని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గురువారం సందర్శించారు. ముందుగా ఎమ్మెల్యేకు గ్రామ పెద్దలు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికి ఎమ్మెల్యేను సత్కరించారు. అనంతరం ఆయన శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
VZM: జామి మండలం కుమారం గ్రామంలో గురువారం ACLP డ్వాక్రా సంఘాల శిక్షణ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీఎం అప్పలనాయుడు మాట్లాడుతూ.. మహిళా సంఘాల అభివృద్ధికి ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్భంగా యాన్యువల్ క్రెడిట్ లైలీవుడ్ ప్లాట్స్, వార్షిక రుణ జీవనోపాదుల ప్రణాళిక వంటి అంశాల మీద చర్చించారు.
ELR: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి ప్రజలకు అండగా నిలవాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఇవాళ పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
KRNL: రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలు కొనసాగుతున్నాయని వైసీపీ ధ్వజమెత్తింది. రుద్రవరం టోల్ ప్లాజా వద్ద తనను గుర్తించలేదన్న కోపంతో మహేష్ అనే ఉద్యోగిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి బెదిరించారు. ఆయన ఆదేశాలతో అనుచరులు సదరు ఉద్యోగిని వాహనంలో బలవంతంగా ఎమ్మెల్యే సొంత గ్రామానికి తరలించారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేసింది.
SKLM: మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర కల్పించకపోవడం పట్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రణస్థలం మండలం నగరపాలెంలో పంటను గురువారం పరిశీలించి, రైతులతో మాట్లాడారు. క్వింటాలు రూ. 2400 నుంచి రూ. 1600కి పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రకాశం: గ్రామీణ సంపద పెంపుదలకు పెయ్యదూడల ఉత్పత్తి పథకం ఎంతో మేలని ప్రకాశం జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. మర్రిపూడిలో డాక్టర్ మని శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన 56వ ప్రదర్శన సభలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం దూడల కోసం ప్రత్యేక టీకాను కేవలం రూ. 150కే అందిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
KRNL: వెలగపూడి అసెంబ్లీ భవనంలో ఇవాళ జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. రోడ్లు, భవనాల శాఖ ఆడిట్ అంశాలు, టెండర్ డిస్కౌంట్ మాఫీ వల్ల పెరిగిన వ్యయంపై చర్చించారు. ప్రజాధనాన్ని పారదర్శకంగా వినియోగించాలని ఆయన అధికారులకు సూచించారు.
ASR: గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నూతన కలెక్టర్, ఐటీడీఏ పీవోలను కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గిరిజనేతరులు 1/70 చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్రమ కట్టడాలు చేపడుతున్నారని ఆరోపించారు. గిరిజన హక్కుల రక్షణ కోసం 1/70 చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరారు.
SKLM: రణస్థలం మండలం గరికపాలెం గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ గురువారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.
విశాఖ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ గురువారం నిర్వహించారు. త్రీ టౌన్, పెందుర్తి స్టేషన్ల పరిధిలోని ఇళ్లను, వాహనాలను నిశితంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా సరైన ధృవపత్రాలు లేని 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యలు నేరాల నియంత్రణకు దోహదపడతాయని పోలీసులు తెలిపారు.
PPM: సీతానగరం మండలం జోగింపేట అంబేద్కర్ గురుకులంలో పిల్లలకు గురువారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా MLHP నవీన్ జ్వరం, జలుబు, దగ్గు, స్కిన్ ఎలర్జీ, హీమోగ్లోబిన్ వంటి పరీక్షలు చేశారు. అనంతరం అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. అలాగే, పిల్లలకు పౌష్టిక ఆహారం, నిద్ర, వ్యక్తిగత, మరుగుదొడ్ల పరిశుభ్రత, హ్యాండ్ వాషింగ్‌పై అవగాహన కల్పించారు.
VZM: జనగణన భవిష్యత్ ప్రణాళికలకు పునాది అని కలెక్టర్ రాం ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం గంట్యాడ ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న జనగణన శిక్షణను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డేటా సేకరణలో ఖచ్చితత్వం అవసరమని ప్రతి ఇంటి సమాచారం పూర్తిస్థాయిలో నమోదు చేయాలని సూచించారు. అలాగే, సెల్ఫ్ ఎన్యుమరేషన్ వినియోగంపై దిశా నిర్దేశం చేశారు.
NLR: కందుకూరు పట్టణంలోని 13వ వార్డు బండపాలెం, రామ్ నగర్, ఆనందపురం రోడ్డు ప్రాంతాల్లో ఎమ్మెల్యే నాగేశ్వరరావు గురువారం పర్యటించారు. మున్సిపల్ కమిషనర్ అనూష, పార్టీ నేతలతో కలిసి ఆయన రోడ్లు, కాలువలను పరిశీలించారు. కాలువల్లో మురుగునీరు నిల్వ ఉండడం, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆక్రమణలు, పూడిక వంటి సమస్యలను గమనించి, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
E.G: కందుకూరి వీరేశలింగం పంతులు 178వ జయంతి వేడుకల్లో తూ.గో జిల్లా వాణిజ్య విభాగం ప్రెసిడెంట్ నల్లమిల్లి సుబ్బారావు హాజరయ్యారు. గురువారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. నవీన సమాజానికి బాటలు వేసిన సంఘసంస్కర్త, రచయిత కందుకూరి వీరేశలింగం అని కొనియాడారు. ఈ వేడుకల్లో కోడూరి శాంతారామ్, మాజీ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ బూరగడ్డ పాల్గొన్నారు.
AKP: విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో ఇంటర్ ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఫెయిల్ అయిన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. తక్కువ ఉత్తీర్ణత నమోదైన కళాశాలల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.