శ్రీకాకుళం పట్టణంలోని పిఎన్ కాలనీ సమస్యలను పరిష్కరిస్తానని కమిషనర్ హనుమంతు కుర్మారావు స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం స్వగృహానికి కమిషనర్ చేరుకొని స్థానికులతో సమస్యలపై చర్చించారు. బాల భారత జంక్షన్ నుంచి కిమ్స్ రోడ్డు వరకు ఆక్రమణలు తొలగించేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.
GNTR: ఈ నెల 14న SRM వర్సిటీలో సీఎం పర్యటించనున్నారు. అక్కడ క్వాంటం కంప్యూటర్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఈ పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వర్సిటీలో కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించారు. రూట్ మ్యాప్, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, వేదిక వద్ద పటిష్ట బందోబస్తు తదితర అంశాలపై చర్చించారు.
కృష్ణా: ప్రభుత్వ ప్రోత్సాహంతో మత్స్యకారులు ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం అవనిగడ్డలోని తమ కార్యాలయంలో నాగాయలంక, ఏటిమొగ, గుల్లలమోద, సొర్లగొంది, పాలకాయతిప్ప, పాత ఉపకాలి గ్రామాలకు చెందిన 332 మంది మత్స్యకారులకు బోట్ లైసెన్స్ పత్రాలను ఎమ్మెల్యే అందచేశారు. మండలి వెంకట్రామ్, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
అల్లూరి జిల్లా చింతపల్లి మండలం మేజర్ పంచాయతీ తాజంగిలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను స్థానిక సర్పంచ్ వంతల మహేశ్వరీ చేతుల మీదగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ జిల్లాలో యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈ టోర్నమెంట్‌ని నిర్వహించడం జరుగుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.
W.G: ముత్యాలపల్లిలోని శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. జాతర ముగింపు సందర్భంగా గురువారం సాయంత్రం 6 గంటలకు ఆలయ ప్రాంగణంలో భారీ అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు ఈవో అరుణ్ కుమార్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.
ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారిని ఇవాళ తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆలయ వేద పండితులు ఆయనను ఘనంగా సత్కరించి ఆశీర్వచనాలు అందజేశారు.
PPM: గుమ్మలక్ష్మీపురం(M) తాడికొండ పంచాయతీ శిఖరంపై గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా మారింది. సుమారు 24 కుటుంబాలు, 200కు పైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో గిరిజనులు బిందెడు నీటి కోసం రోజూ 2 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. కొండ జాలలపై ఆధారపడుతూ తెచ్చుకుంటున్న నీరు శుభ్రంగా లేకపోవడంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
SS: కదిరి నియోజకవర్గం మతనగారిపల్లిలో ఐదు రోజులుగా ఉన్న నీటి సమస్యను YCP నేత డా.బత్తల హరిప్రసాద్ పరిష్కరించారు. తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నట్లు గ్రామస్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన హరిప్రసాద్ వ్యక్తిగత చొరవతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయించారు. గడ్డు పరిస్థితుల్లో అండగా నిలిచినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
TPT: నెల్లూరులోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఈనెల 8న వైసీపీ నేతలు ఆందోళన చేశారు. సీఐ శ్రీనివాసరావు ఇతర పోలీసులు అక్కడికి చేరుకుని, ఆందోళనకు అనుమతి లేదని చెప్పినా నేతలు పట్టించుకోలేదు. తమ విధులకు ఆటంకం కలిగించారని సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి కాకాణి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటిపై కేసు నమోదైంది.
VZM : గజపతినగరం మండలంలోని పాతబగ్గం గ్రామంలో ఉచిత సోలార్ విద్యుత్‌ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారికి ప్రభుత్వం ఉచితంగా సోలార్ విద్యుత్‌ను అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
KKD: మత్స్య సంపద పెంపు కోసం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. అద్దరిపేట నుంచి అంతర్వేది వరకు 170 కిలోమీటర్ల పరిధిలోని మత్స్యకారులు ఈ వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. నిషేధ సమయంలో ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం మత్స్యకారులకు రేషన్ పంపిణీ చేయనుంది. మత్స్య సంపద పునరుత్పత్తికి సహకరించాలని అధికారులు తెలిపారు
ATP: గుత్తి పట్టణానికి చెందిన గుర్రం మనోహర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ సమక్షంలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై బీజేపీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ ప్రధాన కార్యదర్శి చామంతుల ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
NLR: ఆత్మకూరు మండలంలో జనగణన కోసం శిక్షణ ప్రక్రియ మొదట విడత పూర్తయ్యిందని తహసీల్దార్ పద్మజ కుమారి ఇవాళ తెలిపారు. మొత్తం 69 మందితో జనగణన నిర్వహిస్తుండగా తొలి శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందితో కొన్ని ఇళ్ల వద్ద వారి వివరాలతో ట్రయల్ నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రతి ఇంట్లో నివసించేవారి వివరాలను నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.
SS: పెనుకొండలో కియా, దాని అనుబంధ పరిశ్రమల రాకతో విద్యా వ్యవస్థ రూపురేఖలు మారుతున్నాయి. CSR నిధులతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నారు. డిగ్రీ కళాశాలలో రూ.80 లక్షలతో ఆధునిక గ్రంథాలయం నిర్మించి, 18 వేలకు పైగా పుస్తకాలను ఆన్‌లైన్ చేశారు. ఇది 83 గ్రామాల విద్యార్థులకు వరంలా మారింది.
VSP: ఈ నెల 14న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతిని నిర్వహిస్తున్నామని డాక్టర్ అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణ్ రావు తెలిపారు. ఆదివారం రామ టాకీస్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ నెల 14న ఉదయం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు, ఎల్ఐసీ కూడలి నుంచి అంబేడ్కర్ భవనం వరకు ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. అనంతరం జయంతి సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.