• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విషాదం.. సీపీఐ కార్యకర్త ఈశ్వరయ్య మృతి

KRNL: క్రిష్ణగిరి మండలం ఎన్‌హెచ్ ఎర్రగుడి గ్రామానికి చెందిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శాఖ సభ్యుడు బి. ఈశ్వరయ్య ఆదివారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల పార్టీ నాయకులు, గ్రామస్తులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్థివ దేహానికి సీపీఐ నాయకులు పూలమాలలు అర్పించి, పార్టీ ఎర్రజెండా కప్పి నివాళులు అర్పించారు.

April 6, 2026 / 10:40 AM IST

చికెన్ ధరల వివాదం.. వ్యాపారిపై దాడి

NDL: బనగానపల్లెలో చికెన్ ధరల విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. కిలో చికెన్‌ను రూ. 250కి అమ్ముతున్న వ్యాపారి రసూల్‌పై ఇతర వ్యాపారులు దాడి చేసి గాయపరిచారు. ధరల బోర్డును తొలగించాలని సూచించినా ఆయన అంగీకరించకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన రసూల్‌ను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

April 6, 2026 / 10:40 AM IST

బిల్లులు రాలేదని ఆసుపత్రిలో ఏసీలు, లైట్లు పీకేశాడు..!

NLR: మర్రిపాడు పీహెచ్‌సీలో కొత్తగా నిర్మించిన ల్యాబ్ భవనంలో బిగించిన ఏసీ, లైట్లను కాంట్రాక్టర్ తిరిగి తీసుకెళ్లాడు. రూ.55 లక్షల ఈ ప్రాజెక్టులో తనకు ఇంకా మిగతా బిల్లులు రాలేదనే కోపంతోనే ఈ పని చేశాడు. త్వరలో మంత్రి ఆనం చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించాల్సి ఉండగా ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది.

April 6, 2026 / 10:34 AM IST

పడిపోయిన రొయ్యల ధరలు.. ఆక్వా రైతుల ఆందోళన

KKD: రొయ్యల ధరలు కౌంట్ కు రూ.30 నుంచి రూ.70 వరకు తగ్గాయని కాకినాడ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత లేని సీడ్ వల్ల రొయ్యలు తెగుళ్ల బారిన పడుతున్నాయని, ప్రభుత్వం ఇస్తానన్న విద్యుత్ సబ్సిడీ అందడం లేదని ఆరోపిస్తున్నారు. పెట్టుబడులు రాక నష్టపోతున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని ఆక్వా రైతులు కోరుతున్నారు.

April 6, 2026 / 10:32 AM IST

జాతీయ రహదారిలో స్టాపర్లు ఏర్పాటు

VZM: జాతీయ రహదారి అనుకొని ఉన్న బొండపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో వాహనాల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎస్సై యు. మహేష్ ప్రమాదాలను అరికట్టేందుకు భారీ స్టాపర్లను ఏర్పాటు చేశారు. దూరం నుండి వచ్చే వాహనాలు వేగ నియంత్రణ ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని చెప్పారు. దీంతో వాహనదారులు గమ్యస్థానాలకు సులభంగా చేరుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

April 6, 2026 / 10:28 AM IST

యాడికిలో 6.4 మి.మీ వర్షపాతం నమోదు

ATP: జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం వరకు నమోదైన వర్షపాత వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 32 మండలాలకు గాను కేవలం యాడికి మండలంలో మాత్రమే 6.4 మిల్లీమీటర్ల తేలికపాటి వర్షం కురిసింది. మిగిలిన 31 మండలాల్లో పొడి వాతావరణం నెలకొంది. జిల్లా సగటు వర్షపాతం 0.2 మిల్లీమీటర్లుగా నమోదైనట్లు రెవెన్యూ యంత్రాంగం పేర్కొంది.

April 6, 2026 / 10:26 AM IST

ఇద్దరు వైద్యులు అందుబాటులో ఉన్నారు: DMHO

PPM: PHCలో పనిచేసే వైద్యులు అందుబాటులోనే ఉన్నారని, సకాలంలో వైద్య సేవలు అందిస్తున్నారని DMHO డా. భాస్కర రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 2న, ఓ పత్రికలో వైద్యులు ఉండరు, చికిత్స అందదు అనే కథనానికి ఆయన పై విధంగా స్పందించారు. జీ.ఎల్.పురం మండలం రేగడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులు విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

April 6, 2026 / 10:17 AM IST

‘వ్యక్తి నిర్మాణం ద్వారానే దేశానికి మంచి’

SKLM: వ్యక్తి నిర్మాణం ద్వారానే సమాజ నిర్మాణం జరుగుతుందని, దీని ద్వారా దేశానికి మంచి జరుగుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ప్రాంత కార్యకారిణి సభ్యుడు ఓలేటి సత్యనారాయణ అన్నారు. ఆదివారం రాత్రి శ్రీకాకుళం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో వైభవ భారతం కార్యక్రమం జరిగింది. ఈ కార్య క్రమంలో డాక్టర్ అమ్మన్నాయుడు, పీవీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

April 6, 2026 / 10:13 AM IST

పెన్నా నది వద్దకు వచ్చే పర్యాటకులకు విజ్ఞప్తి: ఎస్సై

KDP: పెన్నా నది వద్దకు వచ్చే పర్యాటకులకు వల్లూరు ఎస్సై శివ హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు. నది బయటకు ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ లోపల తీవ్ర ప్రమాదాలు దాగి ఉన్నాయని ఆయన హెచ్చరించారు. సుడిగుండాలు, లోతైన నీటి ప్రాంతాలు కనిపించకపోయినా ప్రాణాంతకంగా మారే అవకాశముందని తెలిపారు. ఫోటోలు, వీడియోలు కోసం నదిలోకి దిగడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు.

April 6, 2026 / 10:06 AM IST

తమిళనాడు బోట్లను ఏపీ బార్డర్‌లోకి రానివ్వం: మంత్రి

ప్రకాశం: తమిళనాడు, కడలూరు, పాండిచ్చేరిలకు చెందిన సోనాబోట్లు ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చి ఇక్కడి మత్య సంపదను దోచుకెళ్తున్నాయని మంత్రి స్వామి అన్నారు. ఏపీ మత్యసంపద మనవారికే దక్కే విధంగా 4 హైస్పీడ్ బొట్లతో గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు CM చంద్రబాబునాయుడు తెలిపారన్నారు. తమిళనాడు బోట్లు ఏపీలోకి ప్రవేశించకుండా గస్తీ తిరిగే బోటుల్లో ఉన్న పోలీసులకు తుపాకులు అందిస్తామన్నారు.

April 6, 2026 / 10:06 AM IST

సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న డీఎస్పీ దంపతులు

NDL: పాణ్యం మండలం కొత్తూరు గ్రామంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తిరుపతి డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో రామకృష్ణ, అర్చకులు వారికి మర్యాదపూర్వక స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధికి రూ.45,000, అన్నదానానికి రూ.25,000 విరాళం అందజేసినట్లు తెలిపారు.

April 6, 2026 / 10:05 AM IST

భీమవరంలో దొంగనోట్ల ముఠా అరెస్ట్

W.G: భీమవరంలో దొంగనోట్ల ముఠాను సీఐ నాగరాజు అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రికి చెందిన గోపీచంద్రరెడ్డి, సాయిలు కలిసి పట్టణానికి చెందిన జోగ శివశంకర్ కు రూ.3 లక్షలకు రూ.9 లక్షల నోట్లు ఇస్తామని ఆశ చూపారని తెలిపారు. శివశంకర్ సమాచారంతో సీఐ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గతంలోను ఇదే తరహాలో మోసం చేసినట్లు వీరు ఒప్పుకున్నారన్నారు.

April 6, 2026 / 10:05 AM IST

భీమవరంలో నకిలీ నోట్ల ముఠా అరెస్ట్

W.G: భీమవరంలో నకిలీ నోట్ల ముఠాను సీఐ నాగరాజు అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రికి చెందిన గోపీచంద్రరెడ్డి, సాయిలు కలిసి పట్టణానికి చెందిన జోగ శివశంకర్ కు రూ.3 లక్షలకు రూ.9 లక్షల నోట్లు ఇస్తామని ఆశ చూపారని తెలిపారు. శివశంకర్ సమాచారంతో సీఐ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గతంలోను ఇదే తరహాలో మోసం చేసినట్లు వీరు ఒప్పుకున్నారన్నారు.

April 6, 2026 / 10:05 AM IST

రెండు రోజులపాటు గంగ జాతర

CTR: చౌడేపల్లె నడివీధి గంగమ్మ జాతర ఈనెల 7, 8న రెండు రోజులపాటు జరగనుంది. ఇందుకోసం నిర్వాహకులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కుమ్మర వీధిలో అమ్మవారిని పెళ్లి కుమార్తెను చేసి.. రజకుల వీధిలో కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి తీసుకువెళ్లి నడివీధిలో ప్రతిష్టిస్తారు. జాతర సందర్భంగా పోలీసులు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

April 6, 2026 / 10:05 AM IST

మదనపల్లిలో బైక్ రేసర్లపై కేసు నమోదు

అన్నమయ్య: మదనపల్లె తాలూకాలో బైక్ రేసర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆదివారం బైక్ రేసర్లతో పాటు వారి తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు. శనివారం స్థానిక జగన్ కాలనీలో నివసిస్తున్న మైనర్ బాలుడు దీక్షిత్‌ను బైక్ రేసర్లు ఢీకొట్టడంతో అతనికి కాలు విరిగిందన్నారు. గాయపడిన బాలుడు ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

April 6, 2026 / 10:03 AM IST