NDL: బనగానపల్లెలో చికెన్ ధరల విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. కిలో చికెన్‌ను రూ. 250కి అమ్ముతున్న వ్యాపారి రసూల్‌పై ఇతర వ్యాపారులు దాడి చేసి గాయపరిచారు. ధరల బోర్డును తొలగించాలని సూచించినా ఆయన అంగీకరించకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన రసూల్‌ను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.