KDP: ఖాజీపేటలోని అగ్రహారంలో ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన కీర్తన అంత్యక్రియలు ఆదివారం జరిగాయి. విద్యార్థిని కీర్తనను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు. అగ్రహారం అంతా కన్నీటి సంద్రమైంది. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తె ఉన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోవడం పట్ల తల్లిదండ్రులు రోధించారు.
PLD: రొంపిచర్లను అభివృద్ధి చేసి చూపించామని మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన రొంపిచర్లలో పర్యటించి మాట్లాడారు.. 2004కు ముందు ఈ ప్రాంతంలో తీవ్ర బాంబుదాడులు జరిగేవని గుర్తుచేశారు. అప్పటి పరిస్థితులు ప్రజల్లో భయాందోళనలు కలిగించాయన్నారు. ‘నేను ఎమ్మెల్యే అయ్యాక శాంతిని నెలకొల్పానని’ చెప్పుకొచ్చారు.
PPM: పార్వతీపురం మున్సిపల్‌లోని చేపలు, మాంసం మార్కెట్‌లో తాగునీరు, మరుగుదొడ్లు, కరెంట్, శానిటేషన్, రహదారి వంటి మౌలిక సదుపాయాల లేమితో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కోల్డ్ స్టోరేజ్ లేక నష్టాలు వస్తున్నాయని పేర్కొన్నారు. వైసీపీ, కూటమి పాలన వైఫల్యమని, వెంటనే సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
KKD: ఏఐటీయూసీ కాకినాడ జిల్లా నూతన కౌన్సిల్ 13 మందితో ఎన్నికైనట్లు ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ తెలిపారు. ఆదివారం కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన నాయకత్వాన్ని ఆయన పరిచయం చేశారు. గౌరవ అధ్యక్షులుగా తాటిపాక మధు, అధ్యక్షులుగా కసింకోట కిషోర్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బొబ్బిలి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా తోకల ప్రసాద్ ఎన్నికయ్యారు.
ATP: శింగనమల మండలం పెరవలి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కృష్ణమూర్తి కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దంపతులకు శుభాకాంక్షలు తెలిపి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
CTR: శాంతిపురం మండలం టి. కొత్తూరు గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సీఐ శ్రీ మల్లేష్ యాదవ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రహదారి భద్రతా నియమాలు, మహిళల భద్రత, నేరాలు, మత్తుపదార్థాల దుర్వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ నైతిక విలువలు కలిగి ఉండాలని సీఐ వివరించారు.
TPT: సత్యవేడు నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏడు మండలాల అధ్యక్షులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనిపాక లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు.
SKLM: ఆమదాలవలస(M) సొట్టవానిపేట సబ్ స్టేషన్ పరిధిలోని 11KV ఫీడర్‌లో విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా సోమవారం సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ పైడి యోగేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మెట్టక్కివలస, ఊసవానిపేట, గేదెలవానిపేట తదితర ప్రాంతాల్లో ఉ.9 గంటల నుంచి మ.1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నామని తెలిపారు. వినియోగదారులు గమనించాలని కోరారు.
KRNL: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న తుగ్గలి మండలం లంకాయపల్లి గ్రామానికి చెందిన హరికృష్ణను పత్తికొండ మాజీ MLA కంగాటి శ్రీదేవమ్మ ఇవాళ పరామర్శించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఆమె వెంట పార్టీ నాయకులు అమర్నాథ్ రెడ్డి, తాండా బాబు నాయక్ తదితరులు ఉన్నారు.
SS: పెనుకొండ డివిజన్ పరిధిలోని మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళాా శిశు సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. సోమందేపల్లిలో 49, పెనుకొండలో 16, హిందూపురంలో 36 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గలవారు ఈ నెల 20లోపు ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
E.G: గోకవరం (M) రంపయర్రంపాలెం గ్రామంలో ఆదివారం సాయంత్రం వేగంగా వచ్చిన ట్రాక్టరు రెండు విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు స్తంభాలు నేలకొరిగాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న లైన్‌మెన్ వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ నిలిపివేసి పెను ప్రమాదాన్ని తప్పించారు.
పల్నాడు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావడం కట్టమైతే, ఇంటి నుంచే మీకోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి లేదా Meekosam.ap.gov.in ద్వారా తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
కడపలోని బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. SV. ఇంజనీరింగ్ కాలేజీ, బాలాజీ నగర్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 27 నుంచి మే 16 వరకు కంప్యూటర్ శిక్షణతో పాటు డ్రాయింగ్, డాన్స్, మ్యాజిక్, పాటలు వంటి వినోద కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
ప్రకాశం: కొండపి (M) నేతివారి పాలెం పంట పొలాల్లో పేకాట శిబిరంపై ఆదివారం స్థానిక పోలీసులు దాడి చేసి 8 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 49,320, 8 బైకులు, 7 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చట్ట వ్యతిరేక కార్యకాలానికి ఎవరు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై త్యాగరాజు హెచ్చరించారు.
ATP: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్ష ఫలితాల్లో గుంతకల్లు మండలం గొల్లల దొడ్డి గ్రామానికి చెందిన గోపాలకృష్ణ అనే కిరాణా వ్యాపారి కుమారుడు ఆర్.మధు అత్యంత ప్రతిభ కనబరిచారు. మొత్తం 470 మార్కులకు గాను 463 మార్కులు సాధించాడు. కుమారుడు విజయం సాధించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజలు విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు.