W.G: విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం తణుకులో చోటు చేసుకుంది. సజ్జాపురానికి చెందిన సింహం భవానిశంకర్ (36) టైల్స్ అతికించే పని చేస్తుంటాడు. గురువారం సాయంత్రం ఇరగవరం రోడ్డు కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంట్లో పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలింది. ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
KDP: ఖాజీపేటలో విద్యార్థిని హత్య ఘటనపై జిల్లా ఇంచార్జ్ మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడు శ్రీనివాస్ చేసిన ఘాతుకాన్ని ఖండిస్తూ.. అతడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మహిళలు, బాలికలపై ఉన్మాదంగా ప్రవర్తిస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
NLR: అల్లూరు మండలం గోగులపల్లి, చింత చెట్ల కాలనీలో ఇవాళ పౌష్టికాహార ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ పద్మావతి మాట్లాడుతూ.. గర్భిణీలు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. శిశువుకు టీకాలు, బరువు , శిశువు ఎదుగుదల పర్యవేక్షణ అన్ని చూసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
BPT: కర్లపాలెం మండలం పేరలి గ్రామం ఐదవ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా జంక్ ఫుడ్ ప్రమాదాలు గురించి ఐసీటీఎస్ ప్రాజెక్ట్ అధికారిని సీడీపీవో ఎన్. లక్ష్మి పార్వతి మాట్లాడారు. రెండు సంవత్సరాల లోపు పిల్లల తినకూడనివి తినవలసినవి తల్లులకు ప్రదర్శించి చూపించారు.
ఈనెల 12న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామ్ నారాయణ రెడ్డి కోనసీమ జిల్లాలో పర్యటిస్తారని అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటలకు వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో శ్రీనివాస భవనానికి శంకుస్థాపన చేస్తారన్నారు. మందపల్లి దేవాలయాన్ని సందర్శిస్తారని, అక్కడ తిలబక్షక మండపానికి భూమి పూజ చేస్తారన్నారు. అనంతరం కుండలేశ్వరం, మురముళ్ల కార్యక్రమాల్లోనూ పాల్గొంటారన్నారు.
E.G: తడి చెత్తను ఇంటి వద్దే సహజ ఎరువుగా మార్చి పర్యావరణాన్ని కాపాడాలని అదనపు కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ సూచించారు. ఇవాళ రాజమండ్రిలో రిసోర్స్ పర్సన్లకు శిక్షణ నిర్వహించారు. ఈ క్రమంలో 269 మందికి రూ. 3,000 విలువైన హోం కంపోస్టింగ్ కిట్లు పంపిణీ చేశారు. చెత్త తగ్గింపు, స్వచ్ఛమైన పరిసరాలు, సహజ ఎరువు వినియోగం ప్రధాన లక్ష్యం అన్నారు.
PLD: గురజాల మండల కేంద్రంలోని ఇండియన్ గ్యాస్ గోదామును శుక్రవారం తహసీల్దార్ దుర్గేష్ తనిఖీ చేశారు. సిలిండర్ల పంపిణీలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఆయన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా గ్యాస్ సరఫరా చేయాలని వారికి సూచించారు.
అన్నమయ్య: జిల్లాకు నూతన రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం. రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని మర్యాదపూర్వకంగా కలిశారు. పోలీసు శాఖలో విస్తృత అనుభవం కలిగిన రవికుమార్ శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని ఎస్పీ సూచించారు. తన అనుభవంతో పోలీసు సిబ్బందిని సమన్వయపరుస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తానని రవికుమార్ తెలిపారు.
CTR: తిరుపతి రూరల్ మండలం గాంధీపురంలో భూ ఆక్రమణలపై సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. సర్వే నంబర్ 13లో 32 కుటుంబాలకు చెందిన భూమిని రామసుబ్బారెడ్డి ఆక్రమించి కాంపౌండ్ నిర్మిస్తున్నాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈనెల 13న హతిరాంజీ మఠం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు. భూమిని రక్షించి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలస జంక్షన్ వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ దగ్గరుండి సపర్యలు చేయించి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మోదవలస జంక్షన్ వద్ద ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఒక క్రమ పద్ధతిలో స్టాపర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 15వ తేదీన బోగోలు మండలం జువ్వల దీన్నే గ్రామంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇవాళ పరిశీలించారు. ఫిషింగ్ హార్బర్ సందర్శించడానికి మాజీ సీఎం వస్తున్నారని తెలియజేశారు.
విశాఖలో ఆంధ్రయూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయని వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా బోధనేతర సిబ్బంది ఆధ్వర్యంలో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను ఇవాళ ప్రారంభించారు. ఉద్యోగుల సేవలు విశ్వవిద్యాలయ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో ఉద్యోగి, చిత్రకారుడు మహ్మద్ గౌస్ చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు.
ATP: అనంతపురం పోలీస్ కన్వెన్షన్ హాలులో పోలీస్ రక్షక్ ప్రీ-ప్రైమరీ స్కూల్ నాలుగో వార్షికోత్సవం ఘనంగా జరిగింది. పోలీసు పిల్లలకు మెరుగైన సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని SP జగదీష్ పేర్కొన్నారు. RDT సహకారంతో పిల్లలకు స్పానిష్ భాష కూడా నేర్పిస్తున్నామని, ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చే పోటీని తట్టుకునేలా విద్యా ప్రమాణాలు ఉన్నాయని తెలిపారు.
ప్రకాశం: కొమరోలు పట్టణంలోని ఆంజనేయస్వామి గుడి కూడలి వద్ద ఎస్సై నాగరాజు శుక్రవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మట్టికుండల్లో చల్లటి నీటిని అందుబాటులో ఉంచామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కోనసీమ: ‘కేడర్ విత్ లీడర్’ కార్యక్రమం రాజోలు టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య అధ్యక్షతన తాటిపాక జీఎస్ గార్డెన్స్‌లో నిర్వహించబడింది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను పార్టీ నాయకులతో కలిసి స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. అర్జీలను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతీ కార్యకర్త పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.