KDP: నేర ప్రవృత్తిని వీడి, సమాజంలో సత్‌ప్రవర్తనతో మెలగాలని DSP వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం JMD పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై PD యాక్ట్ నమోదు చేస్తామని, అలాగే బైండోవర్ వంటి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని DSP స్పష్టం చేశారు. ఇందులో అర్బన్ సీఐ నరేశ్ బాబు, ఎస్ఐ రామకృష్ణ పాల్గొన్నారు.
VSP: అల్లూరి జిల్లాలో వేసవి ప్రారంభంతో నీటి ప్రమాదాలు పెరుగుతున్నాయి. లోతు అంచనా లేకుండా నీటిలో దిగడం, ఈత రాకపోయినా సాహసం చేయడం ప్రమాదాలకు దారితీస్తోంది. గుర్తింపు లేని చిన్న జలపాతాలు, గెడ్డలు ప్రమాదకరంగా మారుతున్నాయి. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిఘా అవసరం.
VZM: భోగాపురం మండలం ముంజేరు గ్రామ పరిధిలోని ఓ బెల్ట్ షాపుపై ఎక్సైజ్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్టు షాపు నిర్వహిస్తున్న వ్యక్తి నుంచి 6 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ CI వి.రవికుమార్ తెలిపారు. అనదికారంగా మద్యం అమ్మకాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
SKLM: పలాస ఎమ్మెల్యే శిరీష సోమవారం ఉ.9.30 కు పలాస మున్సిపాలిటీలో మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొంటారు. ఉ.10కు గంగువాడలో PM సూర్య ఘర్ పథకాన్ని, ఉ.11 కు మందస పిడి మందసలో సీసీ రోడ్లను ప్రారంభిస్తారు. సా.3.30 కు పలాస టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తారు అని ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ATP: గుమ్మఘట్ట మండలం గలగల గ్రామంలో ప్రగతి పండుగ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ కలిసి రూ.12 లక్షల వ్యయంతో మినీ గోకులం, సిసి రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.
KDP: ప్రభుత్వం బాలికల ఉన్నత విద్య కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. ఆదివారం మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన కస్తూర్బా జూనియర్ కళాశాల భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికల కోసం అన్ని వసతులతో కూడిన విద్యా సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.
అన్నమయ్య: మదనపల్లె కలెక్టరేట్‌లో ఇవాళ PGRS ద్వారా అర్జీలను స్వీకరించనున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను కలెక్టరేట్‌లోని PGRS ద్వారా అందజేయవచ్చునని చెప్పారు.
పల్నాడు: ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సోమవారం పర్యటన వివరాలను ఆయన కార్యాలయ సిబ్బంది ఆదివారం విడుదల చేశారు. ఉదయం 10:00 గంటలకు సత్తెనపల్లిలో తాలూకా సెంటర్లో మంచినీటి చలివేంద్రాలు ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు రాజుపాలెంలో PM సూర్య ఘర్, సూర్య ఫలకాల గ్రిడ్ అనుసంధాన ప్రారంభోత్సవ కార్యక్రమoలో పాల్గొంటారు.
VZM: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని రూరల్ సీఐ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్దానిక జమ్మూ, నారాయణపురం, పడాల పేట గ్రామాలలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తులను పట్టుకొని వారి నుంచి మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మద్యం సేవిస్తూ జీవితాలను పాడు చేసుకోవద్దని వారిని హెచ్చరించారు.
ATP: అనంతపురం రాంనగర్‌లోని ఆల్ఫా బీటా యూకే కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవం, గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు.
SKLM: జిల్లా చరిత్రలో 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా శ్రీకాకుళం నుంచి తిరుపతికి రెగ్యులర్ రైలు సర్వీస్ సోమవారం ప్రారంభం కానుంది. సోమవారం మ. 3.కు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ రైలును ప్రారంభించనున్నారు. 17439/40 హంసఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రతి సోమవారం శ్రీకాకుళం నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.
KKD: ఎలమంచిలి యార్డు సమీపంలో రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి (40) మృతి చెందినట్లు తుని రైల్వే ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. మృతుడు పసుపు రంగు షర్టు, నలుపు జీన్ ప్యాంటు ధరించి ఉన్నారన్నారు. వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు
GNTR: ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడు గ్రామపంచాయతీలో ఆదివారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో వేజ్ సీకర్స్ మొబిలైజేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్ గ్రామ ప్రజలకు ఉపాధి హామీ పథకం ద్వారా లభించే ప్రయోజనాలను వివరించారు. ఉపాధి హామీ పనుల్లో పాల్గొని గ్రామాన్ని సస్యశ్యామలంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.
PLD: గురజాల నూతన డీఎస్పీగా మల్ల మహేశ్వరరావు విధుల్లో చేరారు. బదిలీలో భాగంగా విజయనగరం నుంచి గురజాలకు వచ్చారు. ఆదివారం గురజాల డీఎస్పీ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. పోలీసు శాఖలో తన అనుభవంతో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ సాధారణ తనిఖీలలో భాగంగా ఆదివారం బొబ్బిలి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే బేబీ నాయన ఆహ్వానం మేరకు బొబ్బిలి కోటకు వచ్చి దర్బార్ మహల్‌ని సందర్శించారు. ఎమ్మెల్యే దగ్గరుండి బొబ్బిలి యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలను, చిత్రపటాలను చూపించి వాటి గురించి వివరించారు. అనంతరం బొబ్బిలి వీణను బహూకరించి సత్కారించారు.