• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితభావం

KDP: ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు. భారతదేశ అభివృద్ధికి విశేష కృషి చేసిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ అని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యాదవ్ కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు.

April 5, 2026 / 02:44 PM IST

స్వాతంత్ర యోధుడికి బెల్లంకొండలో నివాళులు

PLD: బెల్లంకొండలో బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కరణ కర్త మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్ రామ్ అని MRPS మండల నేతలు అన్నారు. ఆయన సేవలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు రాణించాలని కోరారు

April 5, 2026 / 02:42 PM IST

సీఎం పర్యటన నేపథ్యంలో జేసీ నివాసంలో కీలక భేటీ

ATP: యాడికి మండలంలో రేపు CM చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నివాసంలో టీడీపీ నేతలు ఆదివారం సమావేశమయ్యారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, పలువురు ప్రముఖులు ఈ భేటీలో పాల్గొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై వారు చర్చించారు.

April 5, 2026 / 02:30 PM IST

జై అమరావతి అంటూ నినదించిన ఎమ్మెల్యే

NTR: అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించిన సందర్భంగా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. రంగవల్లులతో ప్రాంగణం కళకళలాడగా “జై అమరావతి” నినాదాలు మార్మోగాయి. రాజధాని అభివృద్ధి ప్రజల ఆకాంక్ష అని, సీఎం నాయకత్వంలో వేగంగా ముందుకు సాగుతుందని సౌమ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 5, 2026 / 02:30 PM IST

పీజీఆర్ఎస్ అర్జీల స్టేటస్ తెలుసుకోండిలా

గుంటూరు: జిల్లా ప్రజలు పీజీఆర్ఎస్ అర్జీల స్టేటస్‌ను సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. ‘మీకోసం’ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా అర్జీలు సమర్పించవచ్చు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం SR శంకరన్ హాల్‌లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి.

April 5, 2026 / 02:30 PM IST

సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి

అనకాపల్లి మండలం గుండాల శంకరన్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశంలో ఎన్నో ఉన్నత పదవులను నిర్వహించి అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేసినట్లు తెలిపారు.

April 5, 2026 / 02:14 PM IST

‘సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి’

శ్రీకాకుళంలో బాల భవన్‌ నందు సమగ్ర శిక్షా ఉద్యోగుల జేఏసీ జిల్లా కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ కాంతారావు పాల్గొన్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మే 15న మంత్రి లోకేష్ ఇంటి వరకు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు.

April 5, 2026 / 02:13 PM IST

అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్ రామ్

VSP: మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా విశాఖలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. బీచ్ రోడ్డులోని ఆయన విగ్రహం వద్ద జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, విష్ణుకుమార్ రాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలు చిరస్మరణీయమని, అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి అమోఘమన్నారు.

April 5, 2026 / 02:12 PM IST

వంతెనను ప్రారంభించిన మంత్రి

PPM: సీతానగరం వద్ద సువర్ణముఖి నదిపై రూ. 12 కోట్లతో పునర్ నిర్మించిన హై లెవల్ బ్రిడ్జ్‌ను, అలాగే మక్కువ అజ్జాడ మధ్య NDB రోడ్డును మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే విజయ్ చంద్రతో కలిసి ప్రారంభించారు. పార్వతీపురం నియోజకవర్గంలో రవాణా కష్టాలు తీరాయి. ఈ వంతెనతో దశాబ్దాల నిరీక్షణ ఫలించిందని, మన్యం ప్రాంత కనెక్టివిటీ మెరుగుపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

April 5, 2026 / 02:11 PM IST

ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి

GNTR: గుంటూరులో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని సాంఘిక సంక్షేమ శాఖ ఘనంగా నిర్వహించింది. మార్కెట్ కూడలి వద్ద ఆయన విగ్రహానికి కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి తదితరులు నివాళులర్పించారు. అనంతరం విజ్ఞాన మందిరంలో సభ జరిగింది. దేశ ప్రగతిలో జగ్జీవన్ రామ్ పాత్ర కీలకమని కలెక్టర్ అన్నారు. ఆయన జీవితం యువతకు ఎంతో ఆదర్శమని అన్నారు.

April 5, 2026 / 02:01 PM IST

అద్దంకిలో క్రికెట్ బెట్టింగ్‌లపై హెచ్చరికలు జారీ

BPT: అద్దంకి సీఐ సుబ్బరాజు యువతకు క్రికెట్ బెట్టింగ్‌లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరీక్షలు పూర్తైన తర్వాత విద్యార్థులు తప్పుదోవ పట్టకుండా తల్లిదండ్రులు పర్యవేక్షణ పెంచాలని అన్నారు. బెట్టింగ్‌లలో పాల్గొంటే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

April 5, 2026 / 02:00 PM IST

‘పేదల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణియం’

కృష్ణా: అవనిగడ్డ మండలం టీడీపీ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో బాబు జగర్జీవన్ రామ్ జయంతి ఘనంగా జరిగింది. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం జీవితాంతం కృషి చేసిన మహానేతగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. పేదల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

April 5, 2026 / 02:00 PM IST

భీమిలి వారసత్వ కట్టడాలపై ఫ్లెక్సీల దండెత్తింపు

VSP: భీమిలిలోని చారిత్రక గంటస్తంభం, పైలాన్ వంటి వారసత్వ కట్టడాలు రాజకీయ ఫ్లెక్సీలతో కనుమరుగవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో నియంత్రణ లేకుండా బ్యానర్లు ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారసత్వ సంపదను కాపాడాల్సిన జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.

April 5, 2026 / 01:43 PM IST

‘అణగారిన వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్‌ రామ్‌ కృషి’

W.G: కాళ్ల మండలం వేంపాడులో ఆదివారం బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకలు  ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అలుపెరుగనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉండి డీసీ ఛైర్మన్ తోట ఫణిబాబు, కూటమి నాయకులు భారీగా పాల్గొన్నారు.

April 5, 2026 / 01:41 PM IST

భైరవ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన డిప్యూటీ స్పీకర్,

W.G: భీమవరం బలుసుమూడిలోని వేంచేసి ఉన్న స్వయంభూ భైరవస్వామి వారిని ఇవాళ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు దర్శించికుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుష్టశక్తులను సంహరించి భక్తులను రక్షించే దేవుడు కాల భైరవుడు అన్నారు. అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేసి ప్రసాదం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

April 5, 2026 / 01:36 PM IST