• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పొట్లూరులో వైభవంగా ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాల

పల్నాడు: శావల్యాపురం మండలం పొట్లూరులోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఆదివారం తిరుణాల వేడుకలను భక్తులు వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అర్చనలు, అభిషేకాలు, కుంకుమ పూజలతో మొక్కులు తీర్చుకున్నారు. విద్యుత్ ప్రభలు నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

April 13, 2026 / 08:14 AM IST

నిబంధనలు పాటించకుంటే చర్యలు: ఎస్సై

W.G: నిబంధనలు పాటించడం బాధ్యత మాత్రమే కాదని, అది వాహనదారుల భద్రత కూడా అని నరసాపురం టౌన్ ఎస్సై సీహెచ్ జయలక్ష్మి అన్నారు. ఆదివారం నరసాపురం పట్టణంలోని వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకపోవడం, అతివేగం, మొబైల్ డ్రైవింగ్, నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విధించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు, జరిమానాలు తప్పవని ఎస్సై తెలిపారు.

April 13, 2026 / 08:13 AM IST

‘అంబేద్కర్ జయంతిని మద్యపాన నిషేద దినంగా ప్రకటించాలి’

KKD: అంబేద్కర్ జయంతిని మద్యపాన నిషేధ దినంగా ప్రకటించాలని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ, అంబేద్కర్ యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. ఆదివారం సాయంత్రం గొల్లప్రోలు పట్టణంలోని ఎస్సీ పేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.

April 13, 2026 / 07:55 AM IST

పేకాట నిర్వహిస్తున్న మహిళలు అరెస్ట్

ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదివారపు పేటలోని ఓ ఇంట్లో పేకాట నిర్వహిస్తున్న సమాచారంతో సీఐ అశోక్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో నలుగురు మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. రూ.10వేల నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

April 13, 2026 / 07:53 AM IST

ఈ నెల 21న దత్తికి చినజీయర్ స్వామి

VZM: దత్తి రాజేరు మండలంలోని దత్తి గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ఈ నెల 21వ తేదీన చినజీయర్స్వామి వస్తున్నట్లు ఆలయ ధర్మకర్త పెంకి తిరుపతినాయుడు ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు. ఆరోజు ఉదయం ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని, భక్తులకు ఆధ్యాత్మిక సందేశం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

April 13, 2026 / 07:44 AM IST

నేడు పి గన్నవరంలో ఎమ్మెల్యే పర్యటన వివరాలు

కోనసీమ: పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సోమవారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయ 11 గంటలకు నేదునురు సొసైటీ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పి గన్నవరం మండలం ఎమ్మెల్యే వారి క్యాంపు కార్యాలయం వద్ద సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేస్తారు.

April 13, 2026 / 07:42 AM IST

‘సంతల ద్వారా రూ.4.50 లక్షల ఆదాయం’

ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఈ వారం జరిగిన పశువులు, జీవాల సంతల ద్వారా రూ.4.50 లక్షలకు పైగా ఆదాయం లభించినట్లు మార్కెట్ యార్డ్ చైర్‌ పర్సన్ బల్లా పల్లవి తెలిపారు. అందులో శనివారం జరిగిన గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంత నుంచి రూ.2.84 లక్షలు, ఆదివారం జరిగిన ఆవులు, ఎద్దుల సంత ద్వారా రూ.1.66 లక్షల మేర వసూలైనట్లు ఆమె మీడియాకు వెల్లడించారు.

April 13, 2026 / 07:36 AM IST

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు

KKD: గొల్లప్రోలు మండల పరిధిలో చేబ్రోలు మల్లవరం లక్ష్మీపురం గ్రామాల్లో సుడిగాలుల వల్ల నష్టపోయిన పంట పొలాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయకుమార్ పరిశీలించారు. సుడిగాలుల వల్ల దెబ్బతిన్న పంటలపై ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగిందని అక్కడి నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత పంట నష్టం నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.

April 13, 2026 / 07:32 AM IST

ఏప్రిల్ 17న సింహాచలంలో ఆర్జిత సేవలు రద్దు: ఈవో

VSP: సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏప్రిల్17న గంధం అమావాస్యను పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు రానున్నారు.16న సాయంత్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి రాత్రి కొండదిగువన వరాహ పుష్కరిణి వద్ద, కొండపైన జాగరం చేసి అమావాస్య రోజు దర్శించుకోవడం ఆనవాయితిగా వస్తోంది.

April 13, 2026 / 07:32 AM IST

నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించిన SI

VZM: రాజాం SI పి. వేంకటేశ్వరరావు ఆదివారం సాయంత్రం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చెడు నడత కలిగిన వ్యక్తులను వారి వృత్తి ప్రవృత్తులపై వివరాలు సేకరించి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి నేర కార్యకలాపాలలో పాల్గొనవద్దని వారిని హెచ్చరించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, కుటుంబ పోషణ కోసం కష్టపడి పని చేయాలని సూచించారు.

April 13, 2026 / 07:30 AM IST

రోడ్డు ప్రమాదం.. యువకులకు గాయాలు

అన్నమయ్య: మదనపల్లెలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాలెపాడు గ్రామం, ఆవులపల్లికి చెందిన వెంకటేశ్, గంగరాజు, శివ అనే ముగ్గురు యువకులు బైక్‌పై మదనపల్లె టమాటా మార్కెట్ వైపు వెళ్తుండగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

April 13, 2026 / 07:29 AM IST

పామూరులో ఆరు ఆటోలు సీజ్

ప్రకాశం: పామూరు పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న ఆరు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నిర్వహించిన తనిఖీలలో భాగంగా సీఐ వినోద్ కుమార్ చర్యలు చేపట్టి, ఆరు ఆటోలను సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రత కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

April 13, 2026 / 07:27 AM IST

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

KDP: బద్వేలులోని 132-33 కేవీఏ సబ్ స్టేషన్‌లో నిర్వహణ పనులు చేస్తుండటంతో ఇవాళ మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు బద్వేలు, గోపవరం, అట్లూరు, బి. మఠం మండలాల పరిధిలోని సబ్ స్టేషన్‌లలో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈఈ ఎం.కుళ్లాయప్ప, బద్వేలు ఏఈ మేరీ షర్మిళరాణి తెలిపారు. విద్యుత్తు వినియోగదారులు సహకరించాలని వారు కోరారు.

April 13, 2026 / 07:27 AM IST

నేడు యధావిధిగా PGRS , రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం: కలెక్టర్

PPM: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం యధావిధిగా PGRS నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియవచ్చన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదులు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు.

April 13, 2026 / 07:27 AM IST

దండి మార్చ్ బృందానికి సీఐ స్వాగతం

బాపట్ల: మాదకద్రవ్యాల నిర్మూలనకు ఈగల్ టీం నిర్వహిస్తున్న ‘దండి మార్చ్ 2.0’ సైకిల్ యాత్ర బాపట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా సీఐ రాంబాబు బృందాన్ని అభినందించారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద ప్రజలకు డ్రగ్స్ ప్రమాదాలపై వివరించారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

April 13, 2026 / 07:26 AM IST