• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బహిరంగ మద్యపానంపై పోలీసుల హెచ్చరికలు

కడప: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై జమ్మలమడుగు పోలీసులు నిఘా పెంచారు. ఇటీవల కాలంలో ప్రధాన రహదారులు, ఖాళీ ప్రదేశాలు, కాలనీల్లో కొందరు బహిరంగంగా మద్యం తాగడం వల్ల స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేరానికి పాల్పడిన వారికి 6 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అర్బన్ సీఐ నరేశ్ బాబు హెచ్చరించారు.

April 16, 2026 / 11:24 AM IST

రోడ్డు ప్రమాదంపై ప్రధాని, రాష్ట్రపతి దిగ్భ్రాంతి వ్యక్తం

KRNL: కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.

April 16, 2026 / 11:23 AM IST

‘క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి’

KRNL: క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆమె పరామర్శించారు. ఇప్పటివరకు 8 మంది మృతి చెందినట్లు తమకు సమాచారం ఉందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించామన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

April 16, 2026 / 11:23 AM IST

పిల్లలు పార్కు చుట్టూ చెత్త.. చిట్టి పాదాలకు గాయాలు

విశాఖ: జీవీఎంసీ 63వ వార్డు, క్రాంతి నగర్ గ్రామంలో చిన్నారులు కోసం ఏర్పాటు చేసిన పార్కు చుట్టుపక్కల భవన నిర్మాణ వ్యర్ధాలు వేయడం వలన పార్కులో క్రీడలు ఆడుకునే వారికి గాయాలు అవుతున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. పార్కు చుట్టుపక్కల రక్షణ గోడ లేకపోవడం వలన పార్కు కబ్జాకు గురవుతుందని ఆవేదన చెందుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

April 16, 2026 / 11:20 AM IST

జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ పొడిగింపు

ATP: వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీము 2026-27 సంవత్సరానికి పొడిగిస్తూ జీవో MS 43 విడుదలైనట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జర్నలిస్టులు www.cfms.ap.gov.in.1,250 చెల్లిస్తే.. ప్రభుత్వం సమానంగా మరో రూ.1,250 భరిస్తుందన్నారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈ ప్రయోజనం పొందవచ్చన్నారు. ప్రీమియం చెల్లించిన వారు అవసరమైన పత్రాలను సమర్పించాలన్నారు.

April 16, 2026 / 11:20 AM IST

‘చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలి’

E.G: ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు అధ్యక్షతన టీడీపీ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రుడా చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. త్వరలో జరగనున్న సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

April 16, 2026 / 11:20 AM IST

టీడీపీకి పదవులలో నిరాశ..!

GNTR: టీడీపీ ప్రకటించిన విస్తృత స్థాయి పదవుల్లో గుంటూరు తూర్పు నేతలకు చోటు దక్కకపోవడం అసంతృప్తిని పెంచింది. ఎన్నో ఏళ్ల తర్వాత విజయం సాధించినా ప్రాతినిధ్యం లేకపోవడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ, మైనారిటీ నాయకులను విస్మరించారనే చర్చ పార్టీలో సాగుతోంది. అయితే, దీనిపై పార్టీ ఎలా స్పందిస్తో చూడాలి మరీ.

April 16, 2026 / 11:14 AM IST

సప్త వీణానాదంతో ఆధ్యాత్మిక విందు

సత్యసాయి: పుట్టపర్తిలో విషు వేడుకలు ఘనంగా జరిగాయి. పద్మశ్రీ డాక్టర్‌ జి. శంకర్ ప్రసంగంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కేరళకు చెందిన సుశీల బృందం ‘సప్త వీణ’ వాయిద్య కచేరీతో అలరించారు. సాయి గాయత్రితో మొదలైన కచేరీలో మహా గణపతిం, హరివరాసనం వంటి కీర్తనలను ఏడు వీణల సమన్వయంతో అద్భుతంగా పలికించారు. ఈ ప్రదర్శన భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ముంచెత్తింది.

April 16, 2026 / 11:00 AM IST

స్కానింగ్ కేంద్రాలపై చర్యలు తప్పవు

ATP: స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేసి ఏమైనా లోపాలు ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ డిఎంహెచ్ఓ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. జిల్లాలో 188 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటిలో ఎక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లింగ నిర్ధారణ నిషేధిత చట్టంపై అవగాహన కనిపించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

April 16, 2026 / 11:00 AM IST

శిథిలావస్థకు చేరిన సూయిజ్ వంతెన

కోనసీమ: కె.గంగవరం మండలం కోట గ్రామం ఏటి గట్టుపై ఉన్న సూయిజ్ వంతెన శిథిలావస్థకు చేరిందని స్థానికులు అంటున్నారు. గతంలో ప్రమాదాలు నివారణకు యువత ఇక్కడ ఇనుప మెస్ ఏర్పాటు చేసిన వాహనాలు ధాటికి అది దెబ్బతిని పరిస్థితి మళ్లీ మొదటి వచ్చిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి వంతెనకు పూర్తిస్థాయి మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.

April 16, 2026 / 10:50 AM IST

28 గ్రామపంచాయతీలు.. 62,032 మంది ఓటర్లు

AKP: ఎస్ రాయవరం మండలంలో 28 గ్రామపంచాయతీలో 62,032 మంది ఓటర్లు ఉన్నట్లు డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ తెలిపారు. వీరిలో పురుషులు 29,944 మంది, మహిళలు 32,086 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నట్లు తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ వద్ద ఓటరు జాబితాలను ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. ఓటర్లు ఓ సారి ఓటరు జాబితాలను పరిశీలించి అభ్యంతరాలు ఉంటే తెలియచేయాలన్నారు.

April 16, 2026 / 10:50 AM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన MLA

W.G: ఇలపర్రు సొసైటీ వద్ద రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తనయుడు వెంకట్ బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కేంద్రాల వద్దే ధాన్యం విక్రయించుకోవచ్చని సూచించారు. విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని భరోసా ఇచ్చారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

April 16, 2026 / 10:49 AM IST

రెండవ విడత అక్రిడిటేషన్ కార్డులు మంజూరు: కలెక్టర్

కడప జిల్లాలో జర్నలిస్టులకు 2వ విడత అక్రిడిటేషన్లు మంజూరయ్యాయి. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదంతో 189 మంది అర్హులైన పాత్రికేయులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. తొలి విడతలో ఇప్పటికే 538 మందికి అక్రిడిటేషన్లు మంజూరయ్యాయని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఇంకా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

April 16, 2026 / 10:45 AM IST

హెల్త్ స్కీమ్ 2026–27కు పొడిగింపు

అన్నమయ్య: వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్‌ను 2026–27 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ ప్రభుత్వం జీవో ఎం.ఎస్ నెం. 43ను విడుదల చేసింది. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కేఎస్ విశ్వనాథన్ తెలిపారు. జర్నలిస్టులు రూ.1,250 ప్రీమియం చెల్లించగా, ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని భరిస్తుంది. జర్నలిస్టు కుటుంబ సభ్యులకు ఈ పథకం వర్తించనుంది.

April 16, 2026 / 10:45 AM IST

ఘనంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు

KDP: వల్లూరు(M)లోని పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. తొలిరోజు బుధవారం రాత్రి అంకురార్పణ సందర్భంగా దేవస్థానంలో విష్వక్సేన ఆరాధన, వాస్తు పూజ, మేదిని పూజ, అఖండ దీపారాధన తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరొందిన ఈ క్షేత్రంలో జరిగిన ఈ వేడుకల్లో ఆలయ ధర్మకర్త, కార్యనిర్వహణాధికారి, అర్చకులు పాల్గొన్నారు.

April 16, 2026 / 10:43 AM IST