• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కొండేపాడులో వైభవంగా దుర్గా మల్లీశ్వరి విగ్రహ ప్రతిష్టాపన

W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం బి. కొండేపాడులో శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఎంతో వభ్వోపేతంగా శనివారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని, వేదపండితుల ఆశీర్వాదాలు పొందారు. ఈ పవిత్ర కార్యక్రమంలో ఉదయం బలుహరణ, సంప్రోక్షణ చేసి స్వామివారి ఆశీస్సులు గ్రామ ప్రజలు పొందారు.

April 11, 2026 / 06:31 PM IST

మండలంలో పెరుగుతున్న ఎండ తీవ్రత

KDP: సిద్ధవటం మండలంలో గత కొద్దిరోజులుగా ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలతో పాటు చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామల వీధులలో తిరుగుతూ పండ్లు, ఇతర వస్తువులు అమ్ముకునే వృద్ధులు, మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఎండ వేడిని తట్టుకోలేక వ్యాపారులు చెట్ల నీడన సేద తీరుతున్నారు.

April 11, 2026 / 06:30 PM IST

కొండలు దాటి సింగనికోటలో కలెక్టర్ పర్యటన

పోలవరం జిల్లా కలెక్టర్ కే.దినేష్ కుమార్ గుర్తేడు మండలం సింగనికోట గ్రామంలో శనివారం పర్యటించారు. ఐదు కిలోమీటర్ల కొండలు, వాగులు కాలినడకన దాటి గ్రామానికి చేరుకున్నారు. ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాలపై గ్రామస్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పండ్ల తోటల కోసం మొక్కలు అందిస్తామని హామీ ఇచ్చి, గ్రామాభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు.

April 11, 2026 / 06:20 PM IST

కార్మిక చట్టాల మార్పులపై సీఐటీయూ ఆగ్రహం

KRNL: కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం ద్వారా కార్మికుల హక్కులు దెబ్బతిన్నాయని ఎమ్మిగనూరులో ఇవాళ సీఐటీయూ నాయకులు విమర్శించారు. 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 10-12 గంటల పని వేళలు అమలు చేయడం దోపిడీకి దారితీస్తుందని తెలిపారు. మహిళలను రాత్రి షిఫ్టుల్లో పనిచేయించే చట్టాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.

April 11, 2026 / 06:01 PM IST

ఆదర్శంగా నిలిచిన HIV బాధితుల వివాహం

NDL: నంద్యాల పట్టణంలో మానవత్వానికి నిదర్శనంగా నిలిచే ఓ విశేషమైన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇద్దరు HIV బాధితులు ఆదర్శ వివాహం చేసుకుని సమాజానికి సానుకూల సందేశాన్ని అందిస్తూ ప్రశంసలు అందుకున్నారు. నంద్యాల ఎస్.ఆర్.బీ.ఎస్ కాలనీలో ఉన్న పరివర్తన్ లైఫ్ సెంటర్‌లో HIV బాధితుల ఆదర్శ వివాహాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.

April 11, 2026 / 06:01 PM IST

పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్

CTR: ప్రివెంటివ్ పోలీసింగ్ చర్యల్లో భాగంగా కార్వేటినగరం PSలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్సై ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి చట్టపరమైన హెచ్చరికలు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని, అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. నేర ప్రవృత్తిని వీడి, భవిష్యత్తులో సన్మార్గంలో జీవించాలని హితవు పలికారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

April 11, 2026 / 06:00 PM IST

సీఎం చంద్రబాబుతో చైర్‌పర్సన్ స్వప్న భేటీ

ATP: అనంతపురం మహిళా నేత, ఏపీ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ స్వప్న శనివారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ సందర్భంగా లింగాయత్ సామాజిక వర్గ సమస్యలు, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎంతో చర్చించారు. ఈ మేరకు సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

April 11, 2026 / 06:00 PM IST

వైద్య కళాశాలలో రక్తదాన శిబిరం

ASR: పాడేరు వైద్య కళాశాల ఆవరణలో శనివారం వైద్య విద్యార్థులు రక్తదానం చేశారు. జిల్లాలో రక్తపు నిలువలు పెంచేందుకు, ప్రాణాపాయంలో ఉన్నవారి ప్రాణాలు కాపాడేందుకు వైద్య విద్యార్థులు రక్తదానం చేయడం స్ఫూర్తిదాయకమని పలువురు వర్షం వ్యక్తం చేశారు. ప్రధానాచార్యులు డా. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రక్తదానం ఒక అలవాటుగా తీసుకుని ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

April 11, 2026 / 06:00 PM IST

రైతు సంక్షేమాన్ని ప్రభుత్వాలు విస్మరించాయి: కామన

E.G: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని విస్మరించాయని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కామన ప్రభాకరరావు అన్నారు. అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ 90వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకురు గ్రామంలో ఆదర్శ రైతు ప్రతినిధులను సత్కరించారు. 1929వ సంవత్సరంలోనే బీహార్ రాష్ట్రంలో సహజానంద సరస్వతి రైతు ఉద్యమం ప్రారంభించారన్నారు.

April 11, 2026 / 06:00 PM IST

సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?: ఎమ్మెల్యే

సత్యసాయి: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మండిపడ్డారు. శనివారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని వైసీపీకి సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 190 రోజుల్లోనే సీమకు 40 టీఎంసీల కృష్ణా జలాలను అందించామని పేర్కొన్నారు.

April 11, 2026 / 06:00 PM IST

HIT TV కథనానికి స్పందించిన అధికారులు

VZM: కొత్తవలస-విజయనగరం ప్రధాన రహదారి డా. బెల్లాల రామారావు హాస్పిటల్ నుంచి అన్న క్యాంటీన్ వరకు వెళ్ళే మురుగుకాలువ చెత్తతో పేరుకుపోయి రోడ్డుమీద ప్రవహిస్తుందని శుక్రవారం HIT TVలో వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. వార్తకు స్పందించి పంచాయతీ సిబ్బంది శనివారం కాలువలో పేరుకుపోయిన చెత్తను తీసి మురుగునీరు వెళ్ళేలా చేశారు. దీంతో దుకాణదారులు హర్షం వ్యక్తం చేశారు.

April 11, 2026 / 05:59 PM IST

చోడవరంలో పోషణ పక్వాడ కార్యక్రమం

AKP: చోడవరం పట్టణంలోని ఎడ్లవీధి అంగన్వాడీ కేంద్రంలో శనివారం పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ గోవాడ వరలక్ష్మీ మాట్లాడుతూ.. తల్లులు తమ పిల్లలకు పోషక విలువలు గల ఆహారం అందించాలని చెప్పారు. పిల్లలతో సమయాన్ని గడపడం వల్ల వారి మెదడు ఉత్తేజంగా పని చేస్తుందన్నారు. సెల్ ఫోన్లను పిల్లలకు దూరంగా ఉంచాలని సూచించారు.

April 11, 2026 / 05:59 PM IST

’50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీలకు పింఛన్ ఇవ్వాలి’

PLD: క్రోసూరు మండల కేంద్రంలో సీపీఐ నిరసన కార్యక్రమం చేపట్టారు. అర్హులైన పేదలకు నివేశ స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ప్రజలకు 50 సంవత్సరాలకే పింఛన్ అందించాలని కోరారు. కార్మికులకు, కర్షకులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

April 11, 2026 / 05:58 PM IST

‘సమానత్వం కోసం పూలే చేసిన పోరాటం మరువలేనిది’

ASR: సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు పునాదులు వేసిన గొప్ప సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని కలెక్టర్ నిషాంతి కొనియాడారు. శనివారం పాడేరులో పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యా ప్రాముఖ్యతకు, కుల వివక్షకు వ్యతిరేకంగా పూలే చేసిన పోరాటం మరువలేనిదని ఆమె పేర్కొన్నారు.

April 11, 2026 / 05:51 PM IST

సమాజ సమానత్వానికి పూలే స్ఫూర్తి: ఎమ్మెల్యే

GNTR: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

April 11, 2026 / 05:48 PM IST