• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి: కలెక్టర్

ATP: నవభారత నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అనంతపురంలో ఘనంగా జరిగాయి. జిల్లా ప్రజా పరిషత్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజు, బండారు శ్రావణి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాత ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

April 14, 2026 / 11:57 AM IST

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ELR: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, డా.బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద గల ఆర్టీసీ డిపో గ్యారేజీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని మంగళవారం ఎమ్మెల్యే ప్రభాకర్ ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

April 14, 2026 / 11:56 AM IST

అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు

నెల్లూరు వేదాయపాళెం పోలీసులు 30కు పైగా కేసులున్న అంతర్రాష్ట్ర దొంగ జొన్నలగడ్డ శ్రీనాథ్‌ను సాహసోపేతంగా అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.15 లక్షల విలువైన బంగారం, వెండి, ల్యాప్ టాప్, కెమెరా స్వాధీనం చేసుకున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత నెల్లూరు, తిరుపతి, హుబ్లీలలో వరుస చోరీలకు పాల్పడినట్లు తెలిపారు.

April 14, 2026 / 11:56 AM IST

‘బాల్య వివాహాలు అరికట్టేందుకు కృషి చేయాలి’

SKLM: బాల్యవివాహాలు అరికట్టేందుకు కృషి చేయాలని టెక్కలి డివిజన్ శక్తిటీంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎం. గిరిధర్ అన్నారు. మంగళవారం మండలం గ్రామంలో శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు హక్కులు, చట్టాలు పట్ల అవగాహన అవసరం అని, వాటి ఉల్లంఘన జరిగితే కఠినమైన చర్యలు ఉంటాయని అన్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేస్తున్నపడు హెల్మెట్ ధరించాలన్నారు.

April 14, 2026 / 11:47 AM IST

ఘనంగా గంగాదేవి తల్లి పండుగ

AKP: గొలుగొండ మండలం సీ.హెచ్‌. నాగాపురం గ్రామంలో గంగాదేవి తల్లి పండగను మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసి సౌకర్యాలు కల్పించారు. పండుగ సందర్భంగా గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది.

April 14, 2026 / 11:41 AM IST

తాడేపల్లిగూడెంలో ఘనంగా అగ్నిమాపక వారోత్సవాలు

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో విపత్తులు, అగ్నిమాపక దళ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహనా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారి గుండా ర్యాలీ నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేశారు. వేసవిలో అగ్నిప్రమాదల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ఫైర్ ఆఫీసర్ టి. శ్రీనివాస రావు వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

April 14, 2026 / 11:38 AM IST

అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఐ

VSP: డా,బి.ఆర్.అంబేద్కర్ 135వ, జయంతి సందర్భంగా డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలోని పాలెం గ్రామంలో భోగాపురం గ్రామీణ సీఐ జీ.రామకృష్ణ, ఎస్సై సన్యాసినాయుడు మంగళవారం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు లో పాల్గొన్నారు. అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలని కోరారు.

April 14, 2026 / 11:38 AM IST

‘రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.25 కోట్ల అవినీతి’

సత్యసాయి: కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సుమారు రూ.25 కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రేషన్ విలువ తగ్గించి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టారని ఆయన ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.

April 14, 2026 / 11:37 AM IST

కడపలో నైట్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసిన అధికారులు

కడప జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పోలీసులు నైట్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు అన్ని స్థాయిల పోలీస్ అధికారులు రాత్రివేళ అప్రమత్తంగా గస్తీ నిర్వహిస్తున్నారు. లాక్డ్ హౌస్‌ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దొంగతనాలను అరికట్టే చర్యలు తీసుకుంటున్నారు.

April 14, 2026 / 11:35 AM IST

పార్వతీపురంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

PPM: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్వతీపురంలో అంబేద్కర్ విగ్రహానికి మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక సంస్కర్తగా, న్యాయవేత్తగా విశిష్ట స్థానాన్ని సంపాదించారని తెలిపారు.

April 14, 2026 / 11:32 AM IST

ఈ నెల 29న క్యాబినెట్ సమావేశానికి రానున్న మంత్రులు

KRNL: రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 29న ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ గుప్తా హాజరుకానున్నారు.

April 14, 2026 / 11:30 AM IST

అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి: ఎమ్మెల్యే

E.G: రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం-సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

April 14, 2026 / 11:30 AM IST

‘హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్’

ప్రకాశం: భారతదేశంలో సామాజిక సమతుల్యత హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని మంత్రి స్వామి అన్నారు. తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసిన నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు.

April 14, 2026 / 11:30 AM IST

ప్రైవేటు స్కూళ్ల అడ్మిషన్ల ప్రకటనలతో జాగ్రత్త: డీఈవో

W.G: అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలు 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్లు ఇచ్చే ప్రకటనలను నమ్మవద్దని డీఈవో నారాయణ తల్లిదండ్రులను హెచ్చరించారు. పాఠశాలకు గుర్తింపు ఉందో లేదో, భవన వసతులు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ప్రకటనలు జారీ చేసే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు

April 14, 2026 / 11:28 AM IST

వైసీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి

AKP: అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నర్సీపట్నం పెద్దచెరువు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో సమానత్వం, స్వేచ్ఛ కోసం అంబేడ్కర్ చేసిన సేవలు అపారమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

April 14, 2026 / 11:25 AM IST