• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జ్యోతిరావు ఫూలే సేవలు చిరస్మరణీయం: కలెక్టర్

VSP: మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా న్యూ కోర్టు కాంప్లెక్స్ సమీపంలోని ఆయర విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఇవాళ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫూలే సామాజిక సంస్కరణలకు చేసిన సేవలను స్మరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమిషనర్ పి.ఎస్.నాయుడు పాల్గొని నివాళులర్పించారు.

April 11, 2026 / 12:06 PM IST

విజ్ఞానాన్ని పెంపొందించేందుకే సైన్స్ ఫెయిర్: MRO

KDP: విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు సైన్స్ ఫెయిర్ నిర్వహించడం ఎంతో అవసరమని తహసీల్దార్ తిరుమల బాబు తెలిపారు. సిద్ధవటంలోని శ్రీ సాయి హై స్కూల్లో శనివారం సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. సైన్స్ ఫెయిర్ ద్వారా విద్యార్థులు తమ సృజనాత్మకతను, పరిశోధనా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

April 11, 2026 / 12:03 PM IST

ఈ నెల 13న జిల్లాలో ఐటీఐ అప్రెంటిస్‌షిప్ మేళ

CTR: చిత్తూరు ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 13న అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం 9గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో శిక్షణ పూర్తి చేసి ఉత్తీర్ణులైన అభ్యర్థులు పాల్గొనవచ్చని, ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలన్నారు.

April 11, 2026 / 12:02 PM IST

జిల్లాకు YELLOW అలెర్ట్..!

NDL: నంద్యాల జిల్లాలో ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం నేడు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వెలుగోడు, ఆత్మకూరు, కొత్తపల్లి మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలోని పలుప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

April 11, 2026 / 11:58 AM IST

వైసీపీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి

AKP: నర్సీపట్నంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని వైసీపీ ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. పెదబొడ్డేపల్లి పెద్దచెరువు వద్ద ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కులవ్యవస్థ నిర్మూలనతో పాటు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని వైసీపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు ఏకా శివ కోరారు.

April 11, 2026 / 11:56 AM IST

బాపూలే సేవలు మరువ లేనివి: ఎమ్మెల్యే

SKLM: మహాత్మ జ్యోతి బాపూలే 199వ జయంతి సందర్భంగా ఇవాళ పలాస టీడీపీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గౌతు శిరీష పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, సమానత్వం, విద్యా విస్తరణకు జీవితాంతం పోరాడిన మహానుభావుడు మహాత్మా జ్యోతి బాపూలే అని ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు.

April 11, 2026 / 11:49 AM IST

మహాత్ముని సేవలు సమాజానికి తెలియజేయాలి: మంత్రి

VZM: మహాత్మ జ్యోతిరావు ఫూలే సమాజానికి చేసిన సేవలను ప్రజలందరికీ తెలియజేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఇవాళ ఫూలే జయంతిని పురస్కరించుకుని కలక్టరేట్‌లో ఆయన విగ్రహానికి కలెక్టర్ రాంసుందర్ రెడ్డితో కలసి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. బహుజనులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన అహర్నిశలు కృషి చేసారన్నారు.

April 11, 2026 / 11:44 AM IST

జిల్లాకు కొత్త పరిశ్రమల రాక

CTR: కుప్పంలో NPSPL స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.2,550 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 400 మందికి ఉద్యోగాలు ఇచ్చే ఈ కంపెనీకి 105 ఎకరాలు ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శాంతిపురం (M) చీమనపల్లెలో రూ.989 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది. రెండు దశల్లో 450మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు.

April 11, 2026 / 11:41 AM IST

జ్యోతిరావు ఫూలే‌కు నివాళులర్పించిన మంత్రి

NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇవాళ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఫూలే ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని మంత్రి పేర్కొన్నారు.

April 11, 2026 / 11:39 AM IST

భక్తులతో కిటకిటలాడిన వెంకటేశ్వర స్వామి ఆలయం

GNTR: తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేకమైన రోజు కావడంతో, ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకుని స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

April 11, 2026 / 11:38 AM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నేతలు

SKLM: పాతపట్నం మండల కార్యదర్శి లింగాల వెంకటకృష్ణ సోదరుడు లింగాల జీవరత్నం(75) శుక్రవారం స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఇవాళ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ, చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు మండల ప్రధాన కార్యదర్శి బడియాల బాబురావు ఉన్నారు.

April 11, 2026 / 11:33 AM IST

చర్చిలో TTD బోర్డు సభ్యుడి భార్య ప్రార్థనలు!

TPT: కర్ణాటకకు చెందిన TTD బోర్డు సభ్యుడు దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేసినట్లు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయన భార్య, కుమారుడు చర్చిలో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. TTDలో అన్యమతాలకు చెందిన ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో బోర్డు సభ్యుడి కుటుంబ సభ్యులు చర్చిలో ఉన్న ఫొటోలు బయటకు రావడంపై విమర్శలు వస్తున్నాయి.

April 11, 2026 / 11:31 AM IST

ఘనంగా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు

KRNL: మహాత్మ జ్యోతిబా ఫూలే సామాజిక సమానత్వానికి పునాది వేసిన మహనీయుడని మంత్రాలయం మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ బొగ్గుల తిక్కన్న కార్తికేయ పేర్కొన్నారు. ఫూలే 199వ జయంతి సందర్భంగా శనివారం ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బంది ఎం. రామన్న, జె. హనుమంతు ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో కలిసి పని ప్రదేశంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

April 11, 2026 / 11:27 AM IST

ఫూలేకు నివాళి అర్పించిన జిల్లా కలెక్టర్

సత్యసాయి: పుట్టపర్తిలోని కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాలులో సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజ సంస్కరణకు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

April 11, 2026 / 11:27 AM IST

నెల్లూరు కలెక్టర్‌కు సీఎం ప్రశంసలు

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు సీఎం చంద్రబాబు నుంచి ప్రశంసలు లభించాయి. పట్టాదారు పాస్ పుస్తకాలు ఏడాదిలోపు పంపిణీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో కలెక్టర్ ‘వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్’కు శ్రీకారం చుట్టారు. అధికారులను నెలలో నాలుగు సార్లు గ్రామానికి పంపి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇదే విధానాన్ని అందరూ అనుసరించాలన్నారు.

April 11, 2026 / 11:24 AM IST