• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అరటి తోటల్లో ఏనుగుల సంచారం.. రైతులకు అలర్ట్

PPM: గవరమ్మపేట, ఎరుకులపేట, పెదమేరంగి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఇవాళ ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా అరటి తోటల వద్ద ఇవి తిరుగుతున్నాయని గుర్తించారు. దీంతో సమీప గ్రామాల రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ఏనుగులను కవ్వించే చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు.

April 4, 2026 / 08:26 AM IST

అస్వస్థకు గురైన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే

శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురంలో కల్తీ బాదం పాలు తాగి 80 మంది అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాధితులను ఎమ్మెల్యే గుండు శంకర్ శుక్రవారం రాత్రి పరామర్శించారు. అస్వస్థతకు గురైన వారి నుంచి పలు వివరాలు సేకరించి, డిస్కౌంట్‌లో వస్తున్న బాదంపాలు తాగడం వల్లే ఇలా జరిగి ఉండవచ్చని బాధితులు ఎమ్మెల్యేకు తెలిపారు.

April 4, 2026 / 08:25 AM IST

రాజదాని పేరుతో టీడీపీ నాయకులు దోపిడీ చేస్తున్నారు: YCP

VZM: అమరావతి రాజధాని పేరుతో TDP నాయకులు దోపిడీకి పాల్పడుతున్నారని YCP జిల్లా కార్యదర్శి ఇప్పిలి అనంతం ఆరోపించారు. శుక్రవారం చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. అమరావతి భూములలో వ్యాపారం చేయడానికి రూ.2 లక్షల కోట్లను బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా ఎందుకు పనికిరాని చోట అమరావతిని ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.

April 4, 2026 / 08:24 AM IST

‘ఈ నిబంధనలు పాటించకుంటే ఇల్లు కట్టే వారికి జరిమానా’

విశాఖలో ఇల్లు నిర్మాణం చేసుకునే వారికి జీవీఎంసీ కమిషనర్ పలు సూచనలు చేశారు. ఇంటి నిర్మాణం చేసేటప్పుడు బిల్డింగ్ వ్యర్థాలను రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పారవేస్తే జరిమానాలు వేస్తామన్నారు. ఆ వ్యర్థాలు తరలించడానికి జీవీఎంసీకి ఆర్థికంగా భారం పడుతోందని పేర్కొన్నారు. బిల్డింగ్ వ్యర్థాలను గుర్తింపు పొందిన ప్రదేశాల్లో వేయాలని అధికారులు సూచించారు.

April 4, 2026 / 08:19 AM IST

పాలిసెట్ దరఖాస్తుకు గడువు పెంపు

KRNL: పాలిటెక్నికల్ కోర్సులో చేరేందుకు నిర్వహించే పాలిసెట్‌కు దరఖాస్తు గడువు ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించినట్లు ఆలూరు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటనారాయణ ఇవాళ తెలిపారు. పాలిసెట్ దరఖాస్తుల గడువు నేటితో ముగియనుండగా రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు మరో 5 రోజులు అవకాశం కల్పించిందన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

April 4, 2026 / 08:16 AM IST

పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు: కారుమూరి

W.G: పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తణుకు వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ‘కారుమూరితో మేము’ కార్యక్రమంలో భాగంగా ఇరగవరం మండలానికి సంబంధించి పార్టీ గ్రామ అధ్యక్షులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ అధ్యక్షులు ఆయా గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

April 4, 2026 / 08:15 AM IST

నేటితో ముగియనున్న ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

KDP: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ఘనంగా ముగియనున్నాయి. శనివారం ఉదయం 10.30 గంటల నుంచి 11:15 గంటల వరకు సీతారామలక్ష్మణ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించి, చక్రస్నానం జరిపించనున్నారు. అనంతరం రాత్రి 7 నుంచి 8 వరకు మహాపుర్నాహుతి, ధ్వజావరోహణం, కుంభప్రోక్షణ, ఆచర్య భాహుమనంతో ఉత్సవాలు ముగుస్తాయి.

April 4, 2026 / 08:08 AM IST

సాక్షర సేవల్లో జిల్లా రెండో స్థానం

చిత్తూరు జిల్లాలోని సాక్షర సేవా కేంద్రాల్లో నాణ్యమైన సేవలు అందుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సాక్షర సేవలు లక్ష్యం 12 వేలుగా నిర్ణయించగా, 9,866 మంది రైతులకు గాను 9,275 హెక్టార్లకు సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. అనంతపురం, సత్యసాయి జిల్లాలు ముందు వరుసలో ఉండగా, చిత్తూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది. రైతులు ఈ సేవలను వినియోగించుకోవాలన్నారు.

April 4, 2026 / 08:07 AM IST

ఓబులంపల్లిలో చోరీకి యత్నం

NDL: ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లిలో అర్ధరాత్రి ధాన్యం దొంగతనాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్లాట్ల వద్ద ఆరబోసిన పొద్దుతిరుగుడు విత్తనాలను సంచులలో నింపుకొని పారిపోతున్న వ్యక్తులను పట్టుకున్నారు. గత వారం రోజులుగా మినుము బస్తాలు మాయమవుతుండటంతో రైతులు అప్రమత్తమయ్యారు. పట్టుబడ్డ నిందితులపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

April 4, 2026 / 08:05 AM IST

తిరుమలలో ‘ఓడు ప్రసాదం’ గురించి తెలుసా?

TPT: పేద కుమ్మరి దాసుడు శ్రీవేంకటేశ్వరుడిపై అపారమైన భక్తి కలిగినవాడు. నిశ్చలమైన మనస్సు, మట్టిపూలతో శేషమూర్తికి పూజ చేసేవాడు. అతని భక్తికి మెచ్చిన శ్రీహరి, అతను తయారు చేసిన పగిలిన మట్టి కుండలోనే నైవేద్యం స్వీకరిస్తానని ప్రకటించారు. అప్పటి నుంచి ఆ ప్రసాదాన్ని “ఓడు ప్రసాదం”గా పిలుస్తున్నారు. ఈ కథ మనకు భక్తి విలువను, అహంకారం లేకుండా సేవ చేయడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.

April 4, 2026 / 08:05 AM IST

నేడు బయ్యవరంలో ఉరుసు ఉత్సవం

AKP: కసింకోట మండలం బయ్యవరంలో ఇవాళ హజరత్ మదీనా ఔలియా ఉరుసు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాలను ప్రతి ఏటా జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకలకు పలు ప్రాంతాల నుంచి ముస్లింలతో పాటు హిందువులు కూడా వచ్చి మొక్కుల తీర్చుకుంటారని తెలిపారు.

April 4, 2026 / 08:04 AM IST

శాంతి ర్యాలీని నిర్వహించిన క్రైస్తవులు

పార్వతీపురం పట్టణ క్రైస్తవులు ఇవాళ జీసస్ శాంతి కొరకు లూధరన్ చర్చి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు రన్‌వే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు ఈ ప్రపంచాన్ని శాంతి మార్గం నడిపారు అన్నారు. మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ, కరుణ కలిగి ఉండాలని క్రీస్తు శాంతి ర్యాలీ నిర్వహించామన్నారు.

April 4, 2026 / 08:02 AM IST

అధికారులు వేడుకలకు హాజరవ్వాలి: కలెక్టర్

E.G: డా.బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఏప్రిల్ 5న, అంబేడ్కర్ 135వ జయంతి ఏప్రిల్ 14 వేడుకలను రాష్ట్ర స్థాయి కార్యక్రమాలుగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. జిల్లా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయన్నారు. నగరంలో జరిగే ఈ కార్యక్రమాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కలెక్టర్ కోరారు.

April 4, 2026 / 08:00 AM IST

తెప్పోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ప్రకాశం: రాచర్ల (మం) నెమలిగుండ్లలో రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికారు. తెప్పోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

April 4, 2026 / 07:55 AM IST

బాదం పాలు తాగి 80 మందికి అస్వస్థత

శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామంలో బాదం పాలు తాగిన సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. జాతర సందర్భంగా తక్కువ ధరకు అమ్మిన పాలు తాగిన వారికి జ్వరం, వాంతులు, విరోచనాలు వచ్చాయి. బాధితులు స్థానిక క్లినిక్‌లకు చేరగా, అధికారులు వెంటనే స్పందించి క్లినిక్లను మూసివేసి వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

April 4, 2026 / 07:55 AM IST