TPT: తిరుపతిలో శనివారం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనవాణి ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జనవాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి నెలా మొదటి శనివారం, మూడవ శనివారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
ASR: పెదబయలు మండలంలోని దూలపల్లి, పరదేశిపుట్టు గ్రామాల్లో శనివారం కలెక్టర్ టీ. నిశాంతి పర్యటించారు. ఆయా గ్రామాల ప్రజలతో సమావేశమయ్యారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ లేదని తెలుసుకొని, అంగన్వాడీ బిల్డింగ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. అలాగే పరదేశిపుట్టు గ్రామంలో పాఠశాల భవనం, బ్రిడ్జి నిర్మాణ పనులకు అనుమతులు మంజూరు చేశామన్నారు.
CTR: ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కుప్పం (M) కంగుందిలో TDP నేతలు ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనము ఆరోగ్యంగా ఉంటామని విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని మునిరత్నం సూచించారు.
కోనసీమ: యాక్షన్ థ్రిల్లర్ సినిమా డైరెక్టర్‌గా ప్రసిద్ధికెక్కిన సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిస్తున్న “భోగి” సినిమా షూటింగ్ ఆలమూరు మండలం జొన్నాడ-రావులపాలెం గోదావరి మధ్యలో చిత్రీకరిస్తున్నారు. కేవలం రాత్రి సమయంలోనే భారీ విద్యుత్తు వెలుగుల మధ్య ఈ షూటింగ్ జరుపుతున్నారు. ఇసుకు తిన్నెలపై హీరో శర్వానంద్ తో ఓ భయానక ఫైటింగ్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు.
సత్యసాయి:పెనుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి సవిత నియోజకవర్గంలోని వెలుగు సంఘాల యానిమేటర్లకు 231 మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. గ్రామీణ స్థాయిలో మహిళా సంఘాల కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, సమాచార మార్పిడి వేగవంతం చేసేందుకు ఈ చర్య దోహదపడుతుందని మంత్రి తెలిపారు.
PLD: రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామంలో “స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా చెరువుల ప్రక్షాళన, పునరుద్ధరణ పనులపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు హాజరయ్యారు. గ్రామంలోని చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే, శుభ్రత మరియు పునరుద్ధరణ పనులు నిర్లక్ష్యం లేకుండా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
KRNL: జనగణన-2027 దేశ అభివృద్ధికి కీలకమని ఇవాళ ఆదోని మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ ఆదూరి విజయ్ కృష్ణ తెలిపారు. ప్రజలు నిజమైన వివరాలు అందించడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలుకు సహకరించాలని కోరారు. జనగణన రెండు దశల్లో నిర్వహించి ఇంటింటికి వివరాలు సేకరిస్తారని చెప్పారు. ప్రతి కుటుంబం బాధ్యతగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
NTR: చందర్లపాడు మండలం ముప్పాళ్ల గురుకుల పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాల పరిసరాలు, తరగతులను పరిశీలించి విద్యార్థినుల ప్రతిభను పరీక్షించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థినులను సన్మానించారు. క్యాంటీన్‌లో భోజనం పరిశీలించి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. సంకల్పబలం ఉంటే ఏదైనా సాధ్యమని సూచించారు.
VZM: జామి మండలంలోని ఎంకె. వలస గ్రామంలో శనివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో రూ. 74 లక్షలతో నిర్మించే సీసీ రహదారులు, డ్రైన్ల పనులకు ప్రారంభోత్సవం చేశారు. మండలంలో 12 గ్రామాలకు ఎన్ఆర్‌జీఎస్ ద్వారా రు. 23 కోట్ల నిధులు విడుదలయ్యాయని మంత్రి కర...
VSP: ప్రకృతి కార్యాశాలల ద్వారా విజ్ఞానం పెంపొందించుకోవాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. సెయింట్ ఆన్స్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో 400 మంది ఎన్‌సీసీ విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విత్తనాల బంతులు తయారీ, మొక్కలు నాటడం, పశుపక్ష్యాదులకు నీరు అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.
PPM: లోక్ సభలో NDA ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడం మోడీ వ్యతిరేక విధానాలకు చెంప పెట్టని పార్వతీపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బత్తిని మోహన్ తెలిపారు. రాహుల్ గాంధీనాయకత్వంలో విపక్షాలు బిల్లుని తిప్పి కొట్టడంతో మోడీ సర్కార్ కంగుతిన్నదని తెలిపారు. బీజేపీకి తగిన గుణపాఠం జరిగిందన్నారు.
ASR: పాడేరు మండలం సేరుబయలు గ్రామంలో శనివారం మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో కలిసి ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ పర్యటించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా ప్రధాన చెరువుకు జల హారతి ఇచ్చి, పూడికతీత పనులకు శంకుస్థాపన చేశారు. చెరువు చుట్టుపక్కల ప్రాంతంలో చెత్తాచెదారం వేరుచేసి చెరువు పరిసరాలను పరిశుభ్రంగా తయారు చేశారు. గ్రామస్తులతో కలిసి గ్రామంలో మొక్కలు నాటారు.
SKLM: టెక్కలి మండలం పరశురాంపురం గ్రామంలో పోషణ పక్వాడా కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీవో సవర సరస్వతి పాల్గొని, 0-6 సంవత్సరాల లోపు పిల్లలు మేధాభివృద్ధి 90% జరుగుతుందన్నారు. కనుక ప్యాకెట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ లాంటివి అస్సలు పెట్టకూడదు వాటికి బదులుగా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పిల్లలకు పెట్టాలని సూచించారు.
W.G: వరి సాగులో రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలని సహాయ వ్యవసాయ సంచాలకులు కే.శ్రీనివాసరావు సూచించారు. శనివారం మోగల్లు రైతు సేవా కేంద్రంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అధిక ఎరువుల వినియోగంతో భూసారం దెబ్బతింటుందని హెచ్చరించారు. వేసవిలో సేకరించే మట్టి నమూనాల ఫలితాల ఆధారంగానే ఎరువులు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవో సంధ్య, రైతులు పాల్గొన్నారు.
CTR: మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు మామిడి రైతుల పాలిట శాపంగా మారాయి. హార్ముజ్ జలసంధి దిగ్బంధం కారణంగా జిల్లా నుంచి విదేశాలకు వెళ్లాల్సిన మామిడి ఎగుమతులు నిలిచిపోయాయి. ఫిబ్రవరి నుంచే ప్రారంభం కావాల్సిన ఎగుమతులు యుద్ధం వల్ల నౌకలు సముద్రంలోనే నిలిచిపోవడంతో ఆగిపోయాయి. ఎగుమతులు జరగకపోతే కాయలను చెట్లకే వదిలేయాల్సిన దుస్థితి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.