• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

హార్సిలీ హిల్స్‌లో పర్యాటకుల తగ్గుముఖం

అన్నమయ్య: ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ నిర్మానుష్యంగా మారింది. ఎండలు విపరీతంగా పెరగడం, కొండపై కూడా చల్లదనం లేకపోవడంతో సందర్శకుల రాక తగ్గిపోయింది. ఏసీ గదులను బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి రావడంతో పర్యాటకులు ఆసక్తి చూపడం లేదు. మంగళవారం కొండపై 37°C ఉష్ణోగ్రత నమోదై, సాయంత్రానికి 35°Cకు తగ్గింది. దీంతో పర్యాటకుల సంచారం లేక కొండ బోసిపోయింది.

April 22, 2026 / 11:25 AM IST

గండికోట ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుముఖం

KDP: ఎండాకాలం ప్రభావం, ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లేకపోవడంతో గండికోట ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 22.228 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ ఉమా మహేశ్వర్లు తెలిపారు. తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. గండికోట ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 26.85 టీఎంసీలు ఉంటుంది.

April 22, 2026 / 11:21 AM IST

కడపలో ఆధ్యాత్మిక ఉత్సవాలకు ముహూర్తం ఖరారు

కడపలో తిరుమల తొలి గడపలో ఈ నెల 29 నుంచి మే 1 వరకు తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం స్వామివారు దేవేరులతో కలిసి పుష్కరిణిలో తెప్పపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవాలు, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

April 22, 2026 / 11:12 AM IST

నెలబల్లిలో రేపటి నుంచి గంధోత్సవాలు

TPT: దొరవారిసత్రం మండలం నెలబల్లిలో గురువారం నుంచి గంధోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఆదివారం వరకు జరిగే ఈ వేడుకల్లో భాగంగా.. గురువారం గంధం ఊరేగింపు, శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు పాటకచేరి, ఆదివారం రాత్రి జబర్దస్త్ ఆర్టిస్టులతో ప్రత్యేక వినోద కార్యక్రమం ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు భారీగా తరలిరావాలని కోరారు.

April 22, 2026 / 11:07 AM IST

జగన్ ఆరోపణలన్నీ నిరాధారం: సోమిశెట్టి

KRNL: రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎంతో కృషి చేస్తున్నారని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఎద్దేవా చేశారు. జగన్ ఆరోపణలన్నీ నిరాధారమన్నారు.

April 22, 2026 / 11:06 AM IST

ఎస్సీ కమిషనర్‌తో భేటీ అయిన జిల్లా కలెక్టర్

ప్రకాశం: మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా వెలుగొండ ప్రాజెక్ట్ అతిథి గృహంలో ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్‌ను జిల్లా కలెక్టర్ విజయ సునీత బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్ప గుచ్చాన్ని అందజేశారు.. అదేవిధంగా నూతన జిల్లాలోని పరిస్థితులను ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యుడు డాక్టర్ గౌతమ్ రాజు కూడా పాల్గొన్నారు.

April 22, 2026 / 11:04 AM IST

సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం

బాపట్ల: రేపల్లె రూరల్ మండలం గుడ్డికాయలంకలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పేరం ఆదిశేషరావు ఇంట్లో బుధవారం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇల్లు పూర్తిగా కాలి బూడిదైంది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 22, 2026 / 11:03 AM IST

చెత్త నుండి సంపద సృష్టించాలి

SKLM: చెత్త నుండి సంపద సృష్టించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో కవిటి మండలానికి చెంది న స్వచ్చ రథాన్ని ప్రారంభించారు. ఇంటింటి నుంచి చెత్త సేకరించి సంపద తయారీ కేంద్రాలకు తరలించి స్వచ్ఛ గ్రామాలు తయారుచేయాలన్నారు.

April 22, 2026 / 11:00 AM IST

‘ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు’

ప్రకాశం: మార్కాపురం మండలం పెద్ద నాగులవరం గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నించిన ఘటనపై తహసీల్దార్ చిరంజీవి కఠిన చర్యలు తీసుకున్నారు. సర్వే నం.173-2లో ఉన్న 15 సెంట్ల భూమిని సయ్యద్ అబ్దుల్ రవూఫ్ ఆక్రమించేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు రావడంతో జేసీబీ సహాయంతో హద్దురాళ్లను తొలగించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ తెలిపారు.

April 22, 2026 / 10:56 AM IST

ముస్లిం విద్యార్థులకు శుభవార్త

NLR: ఏటా 500 మంది ముస్లిం విద్యార్థులకు ఉచితంగా ఇంటర్ రెసిడెన్షియల్ విద్యతో పాటు జేఈఈ మెయిన్స్, నీట్ శిక్షణ అందిస్తామని ఏపీ వర్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ ప్రకటించారు. పూర్తి ఖర్చు వర్ఫ్ బోర్డు భరించేలా మంగళవారం జరిగిన 14వ బోర్డు సమావేశంలో తీర్మానించామని తెలిపారు. ముస్లింల సంక్షేమానికి వర్ఫ్ బోర్డు కట్టుబడి ఉందన్నారు.

April 22, 2026 / 10:46 AM IST

మున్సిపల్ కమిషనర్ సహా ఏడుగురిపై విచారణకు ఆదేశం..!

W.G: భీమవరం మున్సిపాలిటీలో నిధులు, అధికార దుర్వినియోగంపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. కమిషనర్ శ్యామలతో పాటు మరో ఆరుగురు అధికారులపై విచారణ జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విచారణకు అధికారులుగా ఆర్డీ నాగనరసింహారావు, ప్రస్తుత కమిషనర్ రామచంద్రారెడ్డిలను ప్రభుత్వం నియమించింది. 2 నెలల్లోగా సమగ్ర విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కోరింది.

April 22, 2026 / 10:44 AM IST

‘కొండపల్లి బొమ్మలను ప్రపంచానికి పరిచయం చేయాలి’

NTR: విజయవాడలో జరిగిన కొండపల్లి బొమ్మల పండుగ కార్యక్రమంలో సమాచార & పౌరసరఫరాల శాఖ మేనేజర్ విశ్వనాధ్‌తో కలిసి కలెక్టర్ లక్ష్మీశ నిన్న పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కొండపల్లి బొమ్మలు మన గొప్ప వారసత్వానికి ప్రతీక అని అన్నారు. కొండపల్లి బొమ్మలను ప్రపంచానికి పరిచయం చేయాలని అధికారులకు ఆయన పిలుపునిచ్చారు. కొండపల్లి కలకు కొత్త ఊపిరి లభించిందన్నారు.

April 22, 2026 / 10:37 AM IST

కరెంటు పోల్ నుంచి జారిపడి వ్యక్తికి గాయాలు

ప్రకాశం: బేస్తవారిపేట మండలం కొత్తపేట గ్రామంలో బుధవారం విద్యుత్ మరమ్మతుల పనులు చేస్తుండగా కరెంట్ పోల్ పైనుంచి జారిపడి బిచ్చాల బుజ్జి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లైన్ మెన్‌కు హెల్పర్‌గా వెళ్ళి కరెంట్ పోల్‌పై మరమ్మతులు చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.

April 22, 2026 / 10:35 AM IST

సింగపూర్‌లో రెండో రోజు పర్యటించిన మంత్రి

సత్యసాయి: సింగపూర్ అధికారిక పర్యటనలో భాగంగా రెండో రోజు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లిటిల్ ఇండియాలోని నలన్ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ సింగపూర్ హోం వ్యవహారాల మంత్రి కే. షణ్ముగంతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు, పరిపాలనా అంశాలు, ఇతర కీలక విషయాలపై చర్చించారు.

April 22, 2026 / 10:30 AM IST

కనిగిరిలో కార్డాన్ సర్చ్

ప్రకాశం: కనిగిరి పట్టణంలో ఇంఛార్జి డీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణంలోని మంగళమాండ్యంలో కార్డాన్ సర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్‌లో పామూరు సీఐ వినోద్ కుమార్, కనిగిరి సీఐ శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలించి లైసెన్సు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి నిర్మూలమే ప్రధానంగా తనిఖీ నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు.

April 22, 2026 / 10:30 AM IST