ప్రకాశం: మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా వెలుగొండ ప్రాజెక్ట్ అతిథి గృహంలో ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్‌ను జిల్లా కలెక్టర్ విజయ సునీత బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్ప గుచ్చాన్ని అందజేశారు.. అదేవిధంగా నూతన జిల్లాలోని పరిస్థితులను ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యుడు డాక్టర్ గౌతమ్ రాజు కూడా పాల్గొన్నారు.