• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేడు డోన్‌కు రానున్న అర్జున్ అమర్నాథ్

NDL: డోన్ పట్టణంలోని న్యూ మహాలక్ష్మి హాస్పిటల్ పక్కన ఏర్పాటు చేసిన “సోనో స్కాన్స్” కేంద్రాన్ని ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు YCP యువనేత బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని పార్టీ కార్యవర్గ సభ్యులు పిలుపునిచ్చారు.

April 26, 2026 / 08:13 AM IST

నేడు రాతిదూలం లాగుడు పోటీలు ప్రారంభం

ATP: గార్లదిన్నె మండలం యర్రగుంట్లలో ఆదివారం వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాల సందర్భంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆరుపల్ల ఒంగోలు జాతి ఎద్దులకు రాతిదూలం లాగు పోటీలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ..రూ.500 ప్రవేశ రుసుం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మొదటి బహుమతి రూ.35 వేలు, 2వ బహుమతి రూ.30 వేలు, 3వ బహుమతి రూ.20 వేలు, అందజేస్తున్నట్లు తెలిపారు.

April 26, 2026 / 08:11 AM IST

కాకినాడ – మైసూర్ మధ్య బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్

KKD: కాకినాడ నుంచి మైసూర్ వెళ్లే స్పెషల్ ట్రైన్‌ను బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తూ రైల్వే శాఖ అనుమతించిందని సామర్లకోట స్టేషన్ సూపరింటెండెంట్ రమేశ్ తెలిపారు. ట్రైన్ నెం.17289/17290 కాకినాడ నుంచి సోమ, శుక్రవారాల్లో.. మైసూర్ నుంచి గురు, శనివారాల్లో నడుస్తుందని వివరించారు. ప్రయాణికులు ఈ మెరుగైన రైలు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 26, 2026 / 08:09 AM IST

ఉపరాష్ట్రపతి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

TPT: భారత ఉపరాష్ట్రపతి C. P.రాధాకృష్ణన్ తిరుపతి-తిరుమల పర్యటన నేపథ్యంలో రేణిగుంట ఎయిర్‌పోర్ట్ ASL సమావేశం జరిగింది. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో భద్రత, ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుచానూరు, తిరుమల వరకు భద్రతా ఏర్పాట్లు పరిశీలించి కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు.

April 26, 2026 / 08:06 AM IST

జిల్లాలో కేజీ చికెన్ ధర ఎంతంటే.?

CTR: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.117 నుంచి రూ.126, స్కిన్ రూ.170 నుంచి 205 వరకు పలుకుతోంది. స్కిన్‌లెస్ రూ.193 నుంచి రూ.230 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 78 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని దుకాణదారులు తెలిపారు.

April 26, 2026 / 08:05 AM IST

జిల్లాలో నేటి మాంసం ధరలివే..!

అన్నమయ్య జిల్లాలో చికెన్ కేజీ రూ.220, స్కిన్ లెస్ రూ.240గా విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.900 స్థిరంగా ఉంది. చేపలలో కొరమేను రూ.450, రాగండి రూ.200, బొచ్చెలు రూ.230గా ఉన్నాయి. ఆదివారం సందర్భంగా చికెన్ ధరలు పెరిగినప్పటికీ, వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు.

April 26, 2026 / 08:02 AM IST

ఇంధనంపై అసత్య ప్రచారాలను అరికట్టాలి: ఎంపీ

E.G: పెట్రోల్, డీజిల్ కొరత వార్తలపై రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి శనివారం కలెక్టర్ కీర్తి చేకూరితో ఫోన్‌లో సమీక్షించారు. కొన్ని ఏజెన్సీలు, సరఫరాదారులు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆమె అన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన నిఘా ఉంచి, తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఇంధన సరఫరా సజావుగా సాగేలా చూడాలన్నారు. 

April 26, 2026 / 08:00 AM IST

అంగరంగ వైభవంగా వాసవి అమ్మవారి జన్మదిన వేడుకలు

GNTR: తెనాలిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు ఆదివారం ఉదయం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మునగాల మోహన శ్యాం ప్రసాద్ చేతుల మీదుగా వైశ్యపతాక ఆవిష్కరణతో ఉత్సవాలను ప్రారంభించారు. అమ్మవారికి 11 రకాల ద్రవ్యాలతో విశేష అభిషేకాలు చేశారు. ఈ ఉత్సవాలలో ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

April 26, 2026 / 07:54 AM IST

వైసీపీ హయాంలో చిరస్థాయి అభివృద్ధి: జగ్గిరెడ్డి

కోనసీమ: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో చిరస్థాయిగా నిలిచే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. పి.గన్నవరంలో శనివారం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్‌నెస్ సెంటర్లు వంటి వినూత్న వ్యవస్థలను జగన్ స్థాపించారని కొనియాడుతూ పార్టీ బలోపేతంపై చర్చించారు. 

April 26, 2026 / 07:51 AM IST

పాలిసెట్‌కు 93 శాతం హాజరు

ATP: జిల్లాలో శనివారం నిర్వహించిన పాలిసెట్- 26 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 9,809 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 9,110 మంది హాజరయ్యారు. ఇందులో 5,557 మంది బాలురు, 3,553 మంది బాలికలు ఉన్నారు. జిల్లా పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు సజావుగా జరిగినట్లు ప్రిన్సిపల్ జయచంద్రారెడ్డి తెలిపారు. 

April 26, 2026 / 07:44 AM IST

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

KRNL: కల్లూరు అర్బన్ పరిధిలోని 19వ వార్డులో నగర్ వాటర్ ట్యాంక్ వద్ద రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న మున్సిపల్ పార్కులు, సీసీ డ్రైనేజీల అభివృద్ధి పనులకు శనివారం సాయంత్రం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి భూమి పూజ నిర్వహించారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరు జనార్దన్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

April 26, 2026 / 07:37 AM IST

వ్యక్తిని ఢీకొట్టిన బైక్.. ఇద్దరికి తీవ్ర గాయాలు

NLR: బుచ్చిరెడ్డిపాలెంలోని ముంబై జాతీయ రహదారిపై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బస్టాండ్ సెంటర్లో రోడ్డు దాటుతున్న వ్యక్తిని అకస్మాత్తుగా బైకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అవ్వగా ఇరువురిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

April 26, 2026 / 07:35 AM IST

చెత్త రహిత జిల్లాగా నంద్యాలను తీర్చిదిద్దాలి: కలెక్టర్

NDL: జిల్లాను చెత్త రహితంగా మార్చేందుకు అధికారులు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని శనివారం కలెక్టర్ రాజకుమారి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్లో స్వచ్ఛ సర్వేక్షణపై మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నేటి నుంచి మే 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణపై కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు పర్యటించనున్నాయన్నారు.

April 26, 2026 / 07:33 AM IST

మానవత్వం చాటుకున్న వేణు రెడ్డి

సత్యసాయి: చోళసముద్రం టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను కాపాడి గుడ్డంపల్లి వేణు రెడ్డి మానవత్వం చాటుకున్నారు. బైక్ ప్రమాదానికి గురై రోడ్డుపై పడి ఉన్న వ్యక్తిని గమనించిన ఆయన, వెంటనే తన కారును ఆపి బాధితుడికి సాయం చేశారు. క్షతగాత్రులకు తాగునీరు అందించి మనోధైర్యం నింపడమే కాకుండా, అంబులెన్స్‌ పిలిపించి ఆస్పత్రికి తరలించారు.

April 26, 2026 / 07:27 AM IST

నేడు అయ్యప్ప స్వామి ఆలయం ప్రారంభం

అనకాపల్లి: మండల కేంద్రమైన ఎస్. రాయవరంలో రూ.1.5 కోట్లతో నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయం ఇవాళ ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా రెండు రోజులు నుంచి ఆలయంలో పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. అయ్యప్ప స్వామి విగ్రహంతో పాటు పలు దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. శనివారం సాయంత్రం విగ్రహాలకు కలశాలకు పాలు, తేనె, పెరుగు, పంచదార తదితర వాటితో అభిషేకాలు చేశారు.

April 26, 2026 / 07:20 AM IST