• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మండపేటలో ఘనంగా ఈస్టర్ వేడుకలు

కోనసీమ: ఈస్టర్ వేడుకలు మండపేటలో ఆదివారం నిర్వహించారు. క్రైస్తవులు తమ ఆత్మీయ మృతుల సమాధులు వద్ద ప్రార్థనలు నిర్వహించారు. బైబిల్ ప్రకారం క్రీస్తు మృతి చెందిన తరువాత మూడోవ రోజు సమాధి నుంచి లేవబడతారు. ఆ రోజునే ఈస్టర్ గా క్రైస్తవులు వేడుకలు జరుపుకుంటారు. క్రైస్తవులు సమాధులను కొవ్వొత్తులు, పూలతో సుందరంగా అలంకరించి కుటుంబ సమేతంగా ప్రార్థనలు నిర్వహించారు.

April 5, 2026 / 09:13 AM IST

ఏపీలో సినీ పరిశ్రమకు బూస్ట్

GNTR: రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తోందని గుంటూరు జిల్లా ఇంచార్జ్ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. చిత్రీకరణలకు సింగిల్ విండో ద్వారా అనుమతులు కల్పిస్తూ, స్టూడియోల నిర్మాణానికి భూములు కేటాయిస్తున్నామని చెప్పారు. చిన్న సినిమాలకు రాయితీలు, భారీ చిత్రాలకు టికెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

April 5, 2026 / 09:12 AM IST

‘దోమల లార్వా ప్రభావిత ప్రదేశాలను గుర్తించాలి’

PPM: దోమల లార్వా ప్రభావిత ప్రదేశాలను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టడమే లక్ష్యంగా డ్రైడే నిర్వహించాలని జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. నిడగల్లు లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. గ్రామాల్లో ఎక్కడెక్కడ నీరు నిల్వ ఉంటుందో అందుకు కారణాలు తెలుసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

April 5, 2026 / 09:08 AM IST

ఏటీఎంల వద్ద మోసాలపై ఎస్పీ హెచ్చరిక

కర్నూలు జిల్లాలో ఏటీఎం కేంద్రాల వద్ద అపరిచితుల మాటలు నమ్మి డబ్బులు ఇవ్వొద్దని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం హెచ్చరించారు. అత్యవసరం పేరుతో నగదు తీసుకుని ఫోన్‌పే, గూగుల్ పే చేశామని చూపిస్తూ మోసం చేసే ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. డబ్బులు ఖాతాలో జమ కాకపోవడం లేదా హోల్డ్‌లో పడిపోవడం వల్ల నష్టం కలుగుతుందని పేర్కొన్నారు.

April 5, 2026 / 09:05 AM IST

జువ్వలదిన్నెపై వైసీపీ నీచ రాజకీయాలు: మంత్రి

అన్నమయ్య: జువ్వలదిన్నెలో రూ.45 కోట్లతో ఆటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్ ఏర్పాటు చేసి 1000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఫిషింగ్ హార్బర్ అభివృద్ధితో 25 వేల మత్స్యకార కుటుంబాలకు లాభం చేకూరుతుందని, అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటోందని విమర్శించారు. షిప్‌బిల్డింగ్, మెరైన్ ఇంజినీరింగ్ రంగాల్లో యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయని అన్నారు.

April 5, 2026 / 09:04 AM IST

మురుగు నీటితో పెరిగిన పందుల బెడద..!

VZM: రాజాం పట్టణంలో పందుల బెడద తీవ్రంగా మారింది. సత్యనారాయణపురం, ఆదర్శనగర్, మెంతిపేట కాలనీల్లో మురుగు నీరు నిల్వ ఉండటంతో పందులు విపరీతంగా సంచరిస్తున్నాయి. ఇళ్లలోకే ప్రవేశిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వ్యాధుల ముప్పు పెరుగుతుందని ప్రజలు భయపడుతున్నారు.

April 5, 2026 / 09:01 AM IST

రేపు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక

ATP: CM చంద్రబాబు రేపు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటన షెడ్యూల్‌ను కలెక్టర్ ఆనంద్ విడుదల చేశారు. ఉ.11:10కు యాడికి మండలం వేములపాడు చేరుకోనున్న సీఎం, మార్కెట్ యార్డ్‌లో నిర్వహించే ‘ప్రజా వేదిక’ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం పెండేకల్లు రిజర్వాయర్ తీర ప్రాంతాన్ని సందర్శించి నీటి సంరక్షణ పనులను పరిశీలిస్తారు. తర్వాత టీడీపీ కార్యకర్తలతో భేటే అవుతారు.

April 5, 2026 / 09:01 AM IST

అమరావతికి సంఘీభావంగా దీపాలు వెలిగించిన టీడీపీ నేతలు

W.G: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు అమరావతి బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం చినతాడేపల్లి గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షులు పరిమి రవికుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ముందు దీపాలు వెలిగించి అమరావతి రాజధానికి సంఘీభావం తెలియచేయడం జరిగింది. ఇదే రీతిలో పలువురు టీడీపీ నాయకులు తమ తమ గ్రామాల్లో కుటుంబ సభ్యులతో దీపాలు వెలిగించారు.

April 5, 2026 / 09:00 AM IST

కడివెళ్లలో గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు

KRNL: కడివెళ్ల గ్రామంలో బిందెడు నీటికి ప్రజలు తీవ్ర అష్టకష్టాలు పడుతున్నారు. గ్రామానికి తాగునీటి అందించాలని ఎస్.నాగాలపురం గ్రామం నుంచి పైపులైన్లు వేసినా సక్రమంగా నీటిని సరఫరా చేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులకొకసారి, కొన్ని సార్లు వారం అయినా నీటి సరఫరా జరగడం లేదని, దీంతో గుక్కెడు నీటికి నిత్యం యుద్ధం చేయాల్సి వస్తుందన్నారు.

April 5, 2026 / 08:43 AM IST

మునగపాక తహసీల్దారిగా బాధ్యతలు స్వీకరణ

AKP: మునగపాక తహసిల్దార్‌గా పీవీ రత్నం శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన పి. సత్యనారాయణ రాంబిల్లి తహసీల్దారుగా డిప్యూటేషన్ పై వెళ్లారు. ఈయన స్థానంలో బాధ్యతలు స్వీకరించిన రత్నం మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. రైతులు తమ సమస్యలపై నేరుగా తనను సంప్రదించవచ్చని అన్నారు.

April 5, 2026 / 08:43 AM IST

మేజర్ పంచాయతీ ప్రత్యేక అధికారిగా రమణయ్య

VZM: కొత్తవలస మేజర్ పంచాయతీ ప్రత్యేక అధికారిగా ఎస్.రమణయ్య శనివారం బాధ్యతలు స్వీకరించారు.ఈ మేరకు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సర్పంచుల పదవి కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి వచ్చింది. ప్రస్తుతం ఆయన స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎండివో గా విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బందికి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

April 5, 2026 / 08:43 AM IST

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల విజేతలకు సత్కారం

KDP: ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాల విజయవంతానికి సహకరించిన వారిని CI నరసింహరాజు ఆధ్వర్యంలో సత్కరించారు. ప్రజలను సమన్వయం చేస్తూ పోలీసులకు అండగా నిలిచిన MPP ప్రతినిధి సాలబాద్ బుజ్జిని ప్రత్యేకంగా గౌరవించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని సీఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు శ్రీనివాసులు, హారిక, తదితరులు పాల్గొన్నారు.

April 5, 2026 / 08:40 AM IST

తెనాలిలో ముగిసిన ఎడ్ల బల ప్రదర్శనలు

గుంటూరు: తెనాలిలో ఒంగోలు జాతి ఎడ్లబండ్ల పోటీలు శనివారం రాత్రి ఘనంగా ముగిశాయి. సీనియర్స్ విభాగంలో తెలంగాణ హుజూర్ నగర్‌కు చెందిన సుంకి సురేందర్ రెడ్డి ఎడ్ల జత 3350.03 అడుగుల దూరం లాగి మొదటి స్థానంలో నిలిచాయి. వీటి యజమానికి బుల్లెట్ బైక్‌ను MLC ఆలపాటి రాజేంద్రప్రసాద్, MLA నక్కా ఆనందబాబు అందజేశారు. ఆర్కే బుల్స్ రాజశేఖర్ జత ఎద్దులు రెండో బహుమతి, అందుకున్నారు.

April 5, 2026 / 08:38 AM IST

యాంటీ డ్రగ్స్ ప్రచార పోస్టర్ ఆవిష్కరణ

NLR: కందుకూరు TRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం యాంటీ డ్రగ్స్ అవగాహన పోస్టర్‌ను ప్రిన్సిపల్ డాక్టర్ రవికుమార్ ఆవిష్కరించారు. సమాజానికి ముప్పుగా మారిన మాదకద్రవ్యాలను పూర్తిగా అరికట్టాలని ఆయన కోరారు. ఈనెల 7న యాంటీ డ్రగ్స్ ప్రచారం కోసం జన చైతన్య జీపు యాత్ర కందుకూరు చేరుకుంటుందని ఫోరం కన్వీనర్ వినోద్ తెలిపారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు.

April 5, 2026 / 08:30 AM IST

మాలగుమ్మిలో తాగునీటి సమస్య

ASR: ముంచింగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయతీ మాలగుమ్మి గ్రామంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని గిరిజన సంఘం మండల కార్యదర్శి కే. నర్సయ్య తెలిపారు. గత వారం రోజులుగా నీటి సౌకర్యం లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వాటర్ ట్యాంక్‌ను వెంటనే మరమ్మతు చేసి తాగునీరు అందించాలని అధికారులను డిమాండ్ చేశారు.

April 5, 2026 / 08:30 AM IST