E.g: గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన బొనిగే లిఖి ప్రకాశ్ 24 ఏళ్లకే సివిల్ జడ్జిగా ఎంపికై రికార్డు సృష్టించారు. తండ్రి వెంకట్రావు మేజిస్ట్రేట్ కాగా, తల్లి కోరిక మేరకు కష్టపడి ఈ విజయం సాధించినట్లు ప్రకాశ్ తెలిపారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో ప్రతిభ చాటి చిరుప్రాయంలోనే న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం పీటీసీ సమీపంలో వడ్డే ఓబన్న విగ్రహ ఏర్పాటుకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భూమి పూజ చేశారు. వడ్డే సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర పోరాట వీరుడు ఓబన్న విగ్రహాన్ని నగరంలో ప్రతిష్టించడం సంతోషకరమన్నారు. ఆయన ఆశయాలను గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
అన్నమయ్య: చిట్వేలి- రాపూరు ఘాట్ రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న లారీ, కారు ఢీకొన్నాయి. చిట్వేలి నుంచి నెల్లూరు వెళ్తున్న లారీ, నెల్లూరు నుంచి వస్తున్న కారు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో కారులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
KDP: సింహాద్రిపురం మండలం బిదినంచెర్ల గ్రామంలో ఈనెల 8వ తేదీ నుంచి శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు జరగనున్నాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 8వ తేదీన వివిధ రకాల పూజలు, హోమాలు నిర్వహించనున్నారు. 9వ తేదీన హోమాలు, గ్రామోత్సవం ఉంటుందన్నారు.10వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ, సాంస్కృతిక కార్యక్రమాలు, బండలాగుడు పోటీలు ఉంటాయని తెలిపారు.
W.G: తాడేపల్లిగూడెంలో విద్యుత్ డివిజన్ పరిధిలో పట్టణ విద్యుత్ వినియోగదారుల మీటర్ల ఏరియా కోడ్‌ను ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మార్పు చేసిందనీ DE ఎం.వెంకటేశ్వర రావు ఇవాళ తెలిపారు. బిల్లింగ్ సిస్టమ్స్‌లో వచ్చిన మార్పుల ఆధారంగా మీటర్ సర్వీస్ నెంబర్స్ మార్పు జరిగిందని ఈనెల బిల్లులో కొత్త నెంబర్‌ను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
KKD: ప్రత్తిపాడు మండలం పెద శంకర్లపూడిలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నివాసంలో అమరావతి చట్టబద్ధతకు మద్దతుగా ఇంటి ముందు ముగ్గు వేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమరావతికి లభించిన చట్టబద్ధత రాష్ట్ర ప్రజలందరి విజయమని, దేశం మొత్తం దీనికి బాసటగా నిలవడం చారిత్రాత్మకమని కొనియాడారు. రాష్ట్ర భవిష్యత్తుకు అమరావతి అభివృద్ధి ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
ప్రకాశం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుని వెంటనే తొలగించాలని గిద్దలూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం బెస్తవారిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్ నాయుడు ప్రవర్తన మహిళల పట్ల అసభ్యకరంగా ఉందని అన్నారు. హిందువుల పవిత్రతను కాపాడేందుకు వెంటనే కూటమి ప్రభుత్వం టీటీడీ ఛైర్మన్‌ని తొలగించాలన్నారు.
GNTR: మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డా. ఎమ్మెస్సెస్ భవన్‌లో భారతదేశ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. నాయకులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం కొత్త బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి సేవలను స్మరించారు.
NDL: డోన్‌లో మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆర్&బీ గెస్ట్ హౌస్‌లో ఇవాళ ఉదయం వాకింగ్ చేశారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్‌ను అధికారులు నిర్లక్ష్యం చేసి నిరుపయోగంగా మారుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .అలాగే ఎంపీడీవో కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ELR: ఉంగుటూరు గ్రామం హరిజన పేటలో బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే ధర్మరాజు నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు అమూల్యమైనవన్నారు. అణగారిన వర్గాల హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు.
ఎన్టీఆర్: డెలివరీ నిమిత్తం అత్యవసర సమయంలో తిరువూరు హాస్పిటల్‌లో రక్తం అవసరమైంది. దీంతో వెంటనే స్పందించి విధి నిర్వహణలో ఉన్న సెక్టార్ 2 ఎస్సై రాజు క్షణాల వ్యవధిలో హాస్పిటల్‌కి వచ్చి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. దీంతో ఆదివారం డాక్టర్ సూరపనేని వనజ (సీనియర్ గైనకాలజిస్ట్) ఎస్సైకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరు ఇలానే రక్తదానానికి ముందుకు రావాలని సూచించారు.
కోనసీమ: అమలాపురం మార్కెట్లో ఆదివారం కూరగాయల ధరలు తగ్గాయి. టమాటా రూ.20, బంగాళదుంప, ఉల్లిపాయలు రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. వంకాయ, కాకర రూ.40, బీరకాయ, క్యారెట్ రూ.50 పలుకుతున్నాయి. పంటలు ఒక్కసారిగా కోతకు రావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారస్థులు తెలిపారు. ప్రాంతాలను బట్టి రేట్లలో స్వల్ప మార్పులు ఉండవచ్చన్నారు.
తిరుపతిలో బీజేపీ ‘మన ఊరు-మన జెండా’ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు చలివేంద్రంను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. జిల్లాలోని టౌన్ క్లబ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం: పామూరు మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన ప్రైవేట్ పాఠశాల టీచర్ మాధవిని లైంగికంగా వేధించి ఆత్మహత్యకు కారణమైన నాగూర్ బాషాను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఓ దినపత్రికలో పనిచేస్తున్న పాత్రికేయుడిగా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా మండల వైసీపీ మైనార్టీ కార్యదర్శిగా నాగూర్ బాషా పనిచేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
NLR: ఉదయగిరిలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి జరిగింది. ఆదివారం ఎంపీడీవో కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సిబ్బంది నివాళులర్పించారు. దళిత నాయకుడిగా, భారత ఉప ప్రధానిగా ఆయన పలువురికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అటువంటి మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు.