• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వైసీపీ మత్స్యకారులను రెచ్చగొడుతుంది: ఎమ్మెల్యే

NLR: వైసీపీ రాజకీయం చేసి మత్స్యకారులను రెచ్చగొడుతుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మండిపడ్డారు. మత్స్యకారులకు మొదటి నుంచి వైసీపీనే ద్రోహం చేస్తూ వచ్చిందని ఆరోపించారు. ఫిషింగ్ హార్బర్ ప్రైవేట్ పరం చేశారన్నది అవాస్తవమన్నారు. మత్స్యకారులకు అన్యాయం చేయాలన్న ఆలోచన లేదన్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే వైసీపీ ఆరాటపడుతుందని స్పష్టం చేశారు.

April 6, 2026 / 08:58 AM IST

హత్య కేసులో ఐదుగురు అరెస్ట్

KKD: సామర్లకోట మండలం జి.మేడపాడులో మదిన లోవలక్ష్మి హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ కృష్ణ భగవాన్ తెలిపారు. ఇరుకుటుంబాల మధ్య సరిహద్దు తగాదా వివాదంగా మారి హత్యకు దారి తీసిందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 6, 2026 / 08:53 AM IST

‘కురుబ సమాజ అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’

సత్యసాయి: రాష్ట్ర కురుబ సంఘం ఆత్మీయ సమావేశానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కురుబ సమాజ అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రాయదుర్గానికి చెందిన ఎస్.కే. మల్లికార్జునను ఏకగ్రీవంగా నియమించారు. నూతన కార్యవర్గానికి మంత్రి సవిత అభినందనలు తెలిపారు.

April 6, 2026 / 08:43 AM IST

73 మంది అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?

W.G: ‘చలో ఆకివీడు’ కార్యక్రమంలో భాగంగా అనుమతి లేకుండా తరలివచ్చిన 73మందిని అరెస్ట్ చేసినట్లు SI హనుమంతు నాగరాజు తెలిపారు. నిందితులను తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు పర్యవేక్షణలో పట్టణమంతటా భారీ పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

April 6, 2026 / 08:41 AM IST

వినాయకుడికి ఘనంగా సంకటహర చతుర్దశి పూజలు

ATP: గుంతకల్లులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆదివారం రాత్రి వినాయకుడికి సంకటహర చతుర్థి పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి విశేష పూజలు చేశారు. ఆలయ అర్చకుడు మాట్లాడుతూ.. ఈ సంకట చతుర్దశి పూజలు చేయడం వల్ల గణపతి అనుగ్రహంతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం అన్నారు.

April 6, 2026 / 08:39 AM IST

మంత్రి, పలువురు సిబ్బందితో కలెక్టర్ గ్రూపు ఫోటో

VZM: జనవరి 4న, ఢిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయంలో ఫ్లైట్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. ఆదివారం మంత్రి బి.సి జనార్ధన్ రెడ్డి భోగాపురం పర్యటన సందర్భంగా, కొండపల్లి శ్రీనివాస్ ఎంపీ స్థానిక ఎమ్మెల్యే ,జీ.ఎం.ఆర్. విమానాశ్రయ సిబ్బందితో కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి గ్రూపు ఫోటో తీసుకొన్నారు.

April 6, 2026 / 08:32 AM IST

పవళింపు సేవతో ముగిసిన బ్రహ్మోత్సవ వేడుకలు

ATP: రాయదుర్గం పట్టణంకోటలో వెలసిన శ్రీ స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారికి పవళింపు సేవను నిర్వహించారు. నేటితో బ్రహ్మోత్సవాల వేడుకలు ముగిశాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ,పురోహితుల రామకృష్ణ మీడియాతో తెలిపారు.బ్రహ్మోత్సవాలకు సహకరించిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు

April 6, 2026 / 08:22 AM IST

నేడు భీమవరం పోలీస్ స్టేషన్లో ‘PGRS’ కార్యక్రమం

W.G: భీమవరం పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని జిల్లా పోలీస్ కార్యాలయానికి బదులుగా, ఈ వారం అర్జీల స్వీకరణ భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జరుగుతుందని అన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.

April 6, 2026 / 08:20 AM IST

చౌడేశ్వరి ఆలయానికి విరాళం అందజేత

NDL: శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధికి నెల్లూరు వాసి హరి ప్రసాద్ కుటుంబం రూ.50,116 విరాళం అందజేశారు. ఈవో శ్రీనివాసరెడ్డి, ఆలయ ఛైర్మన్లు పీవీ కుమార్ రెడ్డి, పీవీ నాగార్జున రెడ్డి నగదు స్వీకరించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. విరాళంపై ఆలయ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. అభివృద్ధి పనులకు నిధులు వినియోగిస్తామన్నారు.

April 6, 2026 / 08:20 AM IST

నేడు సంగంలో మంత్రి పర్యటన

NLR: సంగం మండల కేంద్రంలో ఇవాల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించనున్నారు. మండలంలోని గాంధీ జన సంఘం వద్ద కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ పూడికతీత పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించనున్నారు. అనంతరం సంగం ఇరిగేషన్ కార్యాలయం వద్ద నియోజకవర్గంలోని సాగునీటి సంఘాల రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

April 6, 2026 / 08:16 AM IST

GVMCలో 79 గ్రామ పంచాయతీల విలీనం ?

విశాఖ: జిల్లాలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల 79 గ్రామ పంచాయతీలను GVMCలో విలీనం చేసే ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే జిల్లాలో 89% పట్టణ, 11% గ్రామీణ ప్రాంతం ఉంది. ఈ 4 మండలాల్లో సుమారు 4-5 లక్షల జనాభా ఉంటుంది. 2027 జనాభా గణన తర్వాతే పునర్విభజనకు అవకాశం ఉండటంతో అప్పటివరకు విలీనం ప్రతిపాదనలు అటకెక్కినట్టే తెలుస్తోంది.

April 6, 2026 / 08:10 AM IST

మంత్రి జనార్దన్ రెడ్డి ను కలిసిన ఎమ్మెల్యే శంకర్

SKLM: జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డిని, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదివారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై విస్తృతంగా చర్చించారు. సమస్యలను విన్న మంత్రి వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

April 6, 2026 / 08:10 AM IST

ఆర్ట్స్ కాలేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

BPT: బాపట్ల పట్టణంలో ఆదివారం రాత్రి స్థానిక ఆర్ట్స్ కాలేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఓ వ్యక్తిని వేగంగా ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 6, 2026 / 08:09 AM IST

పొన్నూరులో టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ

GNTR: పొన్నూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ దాడిలో ముగ్గురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాత కక్షల వల్లే ఈ గొడవ జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

April 6, 2026 / 08:07 AM IST

మంత్రులకు సాదర స్వాగతం పలికిన కలెక్టర్

PPM: జిల్లా పర్యటన నిమిత్తం మన్యం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణకు, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్దన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. ఆదివారం జిల్లా కేంద్రానికి చేరుకున్న రాష్ట్ర మంత్రులకు కలెక్టర్ పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదరంగా మంత్రులను ఆహ్వానించారు.

April 6, 2026 / 08:05 AM IST