సత్యసాయి: నందమూరి బాలకృష్ణ సోమవారం హిందూపురం పర్యటనకు రానున్నారు. సాయంత్రం నూతనంగా తీసుకొచ్చిన పోలీసు వాహనాలను సీఐలకు అందజేయనున్నారు. అనంతరం లేపాక్షి మండల టీడీపీ కన్వీనర్ అభిలాష్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పర్యటన నేపథ్యంలో స్థానిక నాయకులు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు.
CTR: చౌడేపల్లె మండలం బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో యాత్రికులు తరలిరావడంతో బోయకొండ భక్త జనసంద్రమైంది. కొండపై వాహన రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. కాగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
VSP: ఏపీలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (IAC) ఏర్పాటు సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం విశాఖలో ACIAM సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త, ప్రతి నియోజకవర్గానికి ఒక MSME పార్క్ లక్ష్యమన్నారు. MSMEలకు రుణ భరోసా, ODR ద్వారా వేగవంతమైన వివాద పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ATP: యాడికి మండలంలో CM చంద్రబాబు నాయుడు పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం రాష్ట్ర రిహాబిలిటేషన్ డైరెక్టర్ పి.ప్రశాంతి, జేసీ విష్ణుచరణ్‌తో కలిసి హెలిప్యాడ్, పెండేకల్లు రిజర్వాయర్, మార్కెట్ యార్డులోని సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. డ్రిప్ ఇరిగేషన్ స్టాల్స్‌ను సిద్ధం చేయాలని సూచించారు.
W.G: రాష్ట్రంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ తాడేపల్లిగూడెం. ఇక్కడ హోల్ సేల్ లో కిలో ₹8 కే లభ్యంకగా, రిటైల్ గా కిలో ₹12 కి లభ్యమవుతోంది. 100కి ఆరున్నర కి ఇక్కడ విక్రయాలు జరిగాయన్నారు. దీనిపై హోల్ సేల్ వ్యాపారులు మాట్లాడుతూ.. మహారాష్ట్ర, నాందేడ్‌తో పాటు మన రాష్ట్రంలో కర్నూలు ఉల్లి కూడా ఒక్కసారిగా అందుబాటులోకి రావడంతో ధరలు తగ్గాయని తెలిపారు.
PPM: పాలకొండ నగర పంచాయతీ రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ విస్తృత పర్యటన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవర్‌తో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించిన మంత్రి, ప్రజా సమస్యలను స్వయంగా పరిశీలించారు. పర్యటనలో భాగంగా డ్రైనేజీ, మంచినీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
GNTR: తెనాలి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో K.L.N. సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా అష్టావధానం నిర్వహించారు. అవధాని బాలసుబ్రమణ్యం సాహిత్య పటిమతో ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా ఆయనకు “అవధాన సరస్వతి” బిరుదు ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు.
ప్రకాశం: సంతమంగులూరు మండలం రోడ్డు ప్రమాదంలో గొర్రెలు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడిపి రోడ్డు క్రాసు చేస్తున్న గొర్రెల మందును ఢీకొనడంతో 3 గొర్రెలు మృతి చెందినట్లు తెలిపారు. గొర్రెల మంద సంతమంగులూరు మండలం మక్కిన వారి పాలెం గ్రామానికి చెందిన కోనంకి శ్రీను విగా గుర్తించారు
ELR: కలెక్టర్రేట్లో ఆదివారం బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.పేదవర్గాల సంక్షేమానికి ఎంతో కృషిచేసి విలువలతో కూడిన రాజకీయ జీవితం గడిపారన్నారు. ఆ మహనీయుని జీవితాన్ని ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు .
ELR: కలెక్టర్రేట్లో ఆదివారం బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.పేదవర్గాల సంక్షేమానికి ఎంతో కృషిచేసి విలువలతో కూడిన రాజకీయ జీవితం గడిపారన్నారు. ఆ మహనీయుని జీవితాన్ని ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు .
ELR: ఉంగుటూరు నియోజకవర్గ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా వెల్లమిల్లి గ్రామానికి చెందిన ఆకురాతి కిషోర్ ను నియమిస్తూ ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు భావన ఋషి ఆదివారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ.. నియోజవర్గంలో నాలుగు మండలాలలో గ్రామ, మండల స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తానన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల వేదికను వినియోగించుకోవాలని కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. ఏప్రిల్ 6న ఉదయం 10 నుంచి 2 వరకు ఫిర్యాదుల స్వీకరణ ఉంటుందని, 10.30 నుంచి 11.30 వరకు “డయల్ యువర్ కమిషనర్” కార్యక్రమం జరుగుతుందని, ఫోన్ ద్వారా ఫిర్యాదులకు 0877-2227208 నంబర్ అందుబాటులో ఉంటుందని చెప్పుకొచ్చారు.
NDL: ఉయ్యాలవాడ మండంలోని పెద్దయమ్మనూరు గ్రామంలో జరిగిన వర్గాల ఘర్షణకు కారణమైన స్థలాన్ని అధికారులు ఆదివారం పరిశీలించారు. టౌన్ సీఐ యుగంధర్, ఎస్సై రామిరెడ్డి, తహశీల్దార్ ప్రసాద్ బాబు, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు స్థల పత్రాలను తనిఖీ చేశారు. ఆ స్థలం వ్యక్తిగతమా లేక గ్రామానికి చెందినదా అనేది సమగ్రంగా పరిశీలించి నిజాలను వెల్లడిస్తామని తెలిపారు.
AKP: చిత్తూరులో ఈనెల 16 నుంచి 18 వరకు జరిగే రాష్ట్రస్థాయి మహిళల హాకీ టోర్నమెంట్‌కు జిల్లా నుంచి 18 మందిని ఎంపిక చేసినట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కే నరేష్ తెలిపారు. ఎంపిక పోటీలు ఆదివారం సాయంత్రం ఎలమంచిలి హాకీ గ్రౌండ్లో నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ పోటీల్లో 25 మంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
VSP: మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి మధురవాడ ఐటీ సెజ్ రోడ్డులో ఓ యువకుడు ఆదివారం రాత్రి బీభత్సం సృష్టించాడు. రోడ్డుపక్కన పార్క్ చేసిన వాహనాలను ఢీకొట్టగా ఒక చిన్నారికి గాయాలయ్యాయి. భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీశారు. స్థానికులు కారును వెంబడించి కొమ్మాది జంక్షన్ వద్ద అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.