కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు అందిస్తున్న 5 రూపాయలకే భోజనం నాణ్యత ప్రమాణాలను ఇవాళ తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యదర్శి రవి శంకర్ రాజమండ్రిలో ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. అద్భుతమైన రుచులతో నిరుపేదల కడుపు నింపుతున్న అన్నా క్యాంటీన్ పథకంలో భోజనం రుచి చూసి ప్రజలకు అందిస్తున్న ఆహారం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.
PLD: విద్యుత్ లైన్‌ల మరమ్మతుల కారణంగా రేపు శనివారం మండలంలో విద్యుత్ కోత జరుగుతుందని ఏఈ రవికిరణ్ తెలిపారు. ఈదురు గాలులు అకాల వర్షం కారణంగా కొన్ని ప్రదేశాల్లో లైన్‌లు మరమ్మతులకు వచ్చాయని, పరిశీలన చేపడుతున్నామన్నారు. కరెంటు తీగల కింద పెరిగిన చెట్లను తొలగించనున్నట్లు చెప్పుకొచ్చారు. విద్యుత్ వినియోగదారులు ఈ అసౌకర్యాన్ని గమనించాలని పేర్కొన్నారు.
GNTR: గుంటూరు జేసీ లా కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఐజీపీ ఏకే రవికృష్ణ NDPS చట్టంపై అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. లా విద్యార్థులు సమాజ మార్పుకు దోహద పడాలని సూచించారు. డ్రగ్స్ జాతీయ భద్రతకు ముప్పని హెచ్చరించారు. ‘Legal Literacy Camps’ ద్వారా ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంచాలని తెలిపారు.
కృష్ణా: బాపులపాడు మండలం కోడూరుపాడు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి మూడవ విడత నాలుగు నెలల బోనస్‌గా రూ.2,19,122ను ఛైర్మన్ చలసాని ఆంజనేయులు శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో పాడి రైతు ఇంట్లో బయోగ్యాస్ ప్లాంట్‌ను ప్రారంభించారు. పశు వ్యర్థాల నుంచి శక్తి ఉత్పత్తి చేయడమే లక్ష్యమని చలసాని ఆంజనేయులు తెలిపారు.
KDP: జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని కోరారు.
CTR: కల్లూరు ఎస్సై జయరామయ్య పులిచెర్ల మండలంలో ఆటో డ్రైవర్లకు శుక్రవారం అవగాహన కల్పించారు. వాహనాలకు సంబంధించిన రికార్డులు తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. తప్పనిసరిగా వాహనాలు నడిపేటప్పుడు యూనిఫామ్ ధరించాలన్నారు. ప్రయాణికులతో మర్యాదగా నడుచుకోవాలన్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఓవర్ లోడ్ తగదన్నారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవన్నారు.
NDL: కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయడం కార్యకర్తల బాధ్యత అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వేల్పనూరులో అధికారులు, పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. పరస్పర సమన్వయంతో పనిచేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరూ 100 శాతం విజయం సాధించేలా కృషి చేయాలని ఆయన కోరారు.
PLD: రైల్వే ఆర్వోబీ, ఆర్యూబీ నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా అధికారులకు ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. జిల్లాలో చేపట్టిన రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్ బ్రిడ్జిల పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాల కోసం తొలగింపులు జరిగితే బాధితులకు తగిన పరిహారం చెల్లించాలని చెప్పుకొచ్చారు.
ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయం మెయిన్ గేటు వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రకాశం: కొమరోలు మండలం యర్రగుంట్ల గ్రామం అటవీ ప్రాంతంలో నాటు సారా బట్టీలపైన ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. 200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లుగా గిద్దలూరు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జయరావు తెలిపారు. నాటు సారా తయారు చేయటం, విక్రయించటం నేరమని అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
BPT: జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు జిల్లా మలేరియా అధికారి వీ. నాగార్జున రావు శుక్రవారం బాపట్ల పట్టణంలో పర్యటించారు. సంజయ్ గాంధీ కాలనీ, చంగల్ రాయుడు తోట సచివాలయ పరిధిలోని అరవపాలెం ఏరియాలో జరుగుతున్న ‘ఫ్రైడే డ్రై డే’ కార్యక్రమాలను ఆయన తనిఖీ చేశారు. నీటి నిల్వల్లో దోమల లార్వా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పట్టణ వాసులకు సూచించారు.
PPM: ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేకంగా న్యూస్ లెటర్ సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో చాట్ జీపీటీ (AI) వంటి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ సమాచారాన్ని క్రోడీకరించాలన్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పక్కా బడ్జెట్ ప్రణాళిక రూపొందించామని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. స్థానిక కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్ ప్రణాళికలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
ELR: లింగపాలెం మండలం ధర్మాజీగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హాజరయ్యారు. సమాజంలో క్యాన్సర్ గురయ్యే మహిళల్లో 50% పైగా సెర్వికల్ క్యాన్సర్‌తో బాధ పెడుతున్నారని ప్రభుత్వం గుర్తించి ఉచితంగా వేలాది రూపాయలు ఖరీదు గల వ్యాక్సిన్ ఉచితంగా వేస్తున్నారు.
CTR: ఆర్‌బీఐ సౌజన్యంతో చిత్తూరు విడ్స్ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం బృందం వెదురుకుప్పం మండలంలో వెలుగు సంఘ సభ్యులతో అవగాహన శిబిరం నిర్వహించింది. సివిల్ స్కోర్ నిర్వహణ, డిజిటల్ బ్యాంకింగ్, సైబర్ భద్రతతో పాటు ప్రధాన మంత్రి భీమా,పెన్షన్ పథకాలపై వివరించారు. తక్కువ ప్రీమియంతో సామాజిక భద్రత పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.