• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి

AKP: నర్సీపట్నంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని వైసీపీ ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. పెదబొడ్డేపల్లి పెద్దచెరువు వద్ద ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కులవ్యవస్థ నిర్మూలనతో పాటు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని వైసీపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు ఏకా శివ కోరారు.

April 11, 2026 / 11:56 AM IST

మహాత్ముని సేవలు సమాజానికి తెలియజేయాలి: మంత్రి

VZM: మహాత్మ జ్యోతిరావు ఫూలే సమాజానికి చేసిన సేవలను ప్రజలందరికీ తెలియజేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఇవాళ ఫూలే జయంతిని పురస్కరించుకుని కలక్టరేట్‌లో ఆయన విగ్రహానికి కలెక్టర్ రాంసుందర్ రెడ్డితో కలసి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. బహుజనులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన అహర్నిశలు కృషి చేసారన్నారు.

April 11, 2026 / 11:44 AM IST

జిల్లాకు కొత్త పరిశ్రమల రాక

CTR: కుప్పంలో NPSPL స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.2,550 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 400 మందికి ఉద్యోగాలు ఇచ్చే ఈ కంపెనీకి 105 ఎకరాలు ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శాంతిపురం (M) చీమనపల్లెలో రూ.989 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది. రెండు దశల్లో 450మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు.

April 11, 2026 / 11:41 AM IST

జ్యోతిరావు ఫూలే‌కు నివాళులర్పించిన మంత్రి

NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇవాళ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఫూలే ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని మంత్రి పేర్కొన్నారు.

April 11, 2026 / 11:39 AM IST

భక్తులతో కిటకిటలాడిన వెంకటేశ్వర స్వామి ఆలయం

GNTR: తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేకమైన రోజు కావడంతో, ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకుని స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

April 11, 2026 / 11:38 AM IST

చర్చిలో TTD బోర్డు సభ్యుడి భార్య ప్రార్థనలు!

TPT: కర్ణాటకకు చెందిన TTD బోర్డు సభ్యుడు దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేసినట్లు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయన భార్య, కుమారుడు చర్చిలో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. TTDలో అన్యమతాలకు చెందిన ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో బోర్డు సభ్యుడి కుటుంబ సభ్యులు చర్చిలో ఉన్న ఫొటోలు బయటకు రావడంపై విమర్శలు వస్తున్నాయి.

April 11, 2026 / 11:31 AM IST

ఘనంగా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు

KRNL: మహాత్మ జ్యోతిబా ఫూలే సామాజిక సమానత్వానికి పునాది వేసిన మహనీయుడని మంత్రాలయం మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ బొగ్గుల తిక్కన్న కార్తికేయ పేర్కొన్నారు. ఫూలే 199వ జయంతి సందర్భంగా శనివారం ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బంది ఎం. రామన్న, జె. హనుమంతు ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో కలిసి పని ప్రదేశంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

April 11, 2026 / 11:27 AM IST

గుట్టలు గుట్టలుగా చెత్త.. స్థానికుల ఆగ్రహం

తూ.గో: కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో రోడ్డు పక్కనే చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డంపింగ్ యార్డు ఉన్నప్పటికీ పంచాయతీ నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. దుర్వాసన వ్యాపించి, చెత్త ఇళ్లలోకి చేరుతోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

April 11, 2026 / 11:18 AM IST

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి ఫూలే

E.G: నిడదవోలు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి పూలే అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

April 11, 2026 / 11:18 AM IST

చేపల వేట నిషేధం.. ఎందుకంటే..!

ELR: చేపలు గుడ్లు పెట్టే కాలం నేపథ్యంలో మత్స్యకారులు వేటకు ప్రభుత్వం 61 రోజుల పాటు నిషేధం విధించింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది. ఏలూరు జిల్లాలోని కొల్లేరు పరిధిలోని 28 గ్రామాల్లో 12,402 మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. 129 మెకనైజ్, 290 నాన్ మెకనైజ్ బోట్లతో చేపల వేట చేస్తున్నారు.

April 11, 2026 / 11:16 AM IST

జిల్లాలో బాలికల క్రికెట్ పోటీల ఎంపికలు

KRNL: అవుట్ డోర్ స్టేడియంలో ఈనెల 12న బాలికల క్రికెట్ పోటీల ఎంపికలు జరుగుతాయని ఇవాళ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దేవేంద్ర గౌడ్ తెలిపారు. అండర్-15, 19, 23, సీనియర్ విభాగాల్లో రేపు ఉదయం 10 గంటలకు ఇవి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు జనన ధ్రువీకరణ పత్రం, గుర్తింపు కార్డులతో హాజరుకావాలని సూచించారు.

April 11, 2026 / 11:15 AM IST

‘మున్సిపల్ టీచర్లకు ఇంక్రిమెంట్లు ఇవ్వండి’

గుంటూరు జిల్లా ఎస్టీయూ నేతలు పాఠశాల విద్యాశాఖ నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తమీమ్ అన్సారియాను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు, పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బిల్లుల గురించి వివరించారు.

April 11, 2026 / 11:15 AM IST

కనిగిరిలో ఘనంగా పూలే జయంతి వేడుకలు

ప్రకాశం: కనిగిరి పట్టణంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా స్థానిక ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహానుభావుడు జ్యోతిరావు పూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన గొప్ప సామాజిక సంఘ సంస్కర్త అని కొనియాడారు.

April 11, 2026 / 11:12 AM IST

ఘనంగా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

BPT: సంతమాగులూరు మండల కేంద్రంలోని స్థానిక గ్రంథాలయంలో శనివారం సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే, స్వాతంత్య్ర సమరయోధురాలు కస్తూర్బా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథ పాలకుడు బాదం విజయభాస్కర్ రెడ్డి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

April 11, 2026 / 11:11 AM IST

మందసలో ఘనంగా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

SKLM: మహాత్మా జ్యోతిరావు ఫూలే జీవితం నేటి తరాలకు ఆదర్శం అని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.మోహనరావు కొనియాడారు. ఫూలే  జయంతి సందర్భంగా ఇవాళ మందసలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఆమన ఒక వ్యక్తి మాత్రమే కాదని ఆయన ఒక ఆలోచన, ఒక ఉద్యమం, నేటి తరాలకు దిక్చూచి అని అన్నారు.

April 11, 2026 / 11:09 AM IST