శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ శుభవార్త. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. భువనేశ్వర్-బెంగళూరు-భువనేశ్వర్-తిరుపతి మధ్య నడిచే రైళ్లకు ఒక 3 ఏసీ బోగీ అలాగే విశాఖ-గుణుపూర్-విశాఖ మధ్య నడిచే రైళ్లకు ఒక స్లీపర్ బోగీని మే 31 వరకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
E.G: సీతానగరం మండలంలోని బొబ్బిల్లంక, ములకల్లంక గ్రామాల్లో రవాణా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే రోడ్డు సౌకర్యం ఉండగా, మిగతా కాలంలో పడవలే ఆధారమని గ్రామస్థులు చెబుతున్నారు. రూ.35 కోట్లతో ప్రారంభించిన వంతెన నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో ఇబ్బందులు పెరిగాయి. వరద సమయంలో ప్రాణాలను పణంగా పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.
W.G: భారత మాజీ ఉపప్రధాని, స్వాతంత్య్ర సమరయోధులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలను ఆచంట మండలం కొడమంచిలి అరుంధతిపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడారు. సామాజిక న్యాయ దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన ధీరుడు జగ్జీవన్ రామ్ అని అన్నారు. ఆయన భారత సమాజంలో సమానత్వం కోసం కృషి చేశారని అన్నారు.
CTR: పాకాల మండలం పెద్ద గోర్పాడు గ్రామంలో నిర్వహించిన కర్మక్రియలకు ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. గ్రామానికి చెందిన సూరినేని వెంకటరామ నాయుడు, గాలి రమేష్‌ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
NDL: కొలిమిగుండ్ల మండలం బెలుము గ్రామంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన బసవేశ్వర కన్వెన్షన్ హాల్‌ను ఆమె ఘనంగా ప్రారంభించారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
CTR: గంగాధరనెల్లూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద రేపు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా అధికారులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో మనోహర్‌గౌడ్ తెలిపారు. దీనిని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
కోనసీమ: ఈస్టర్ వేడుకలు మండపేటలో ఆదివారం నిర్వహించారు. క్రైస్తవులు తమ ఆత్మీయ మృతుల సమాధులు వద్ద ప్రార్థనలు నిర్వహించారు. బైబిల్ ప్రకారం క్రీస్తు మృతి చెందిన తరువాత మూడోవ రోజు సమాధి నుంచి లేవబడతారు. ఆ రోజునే ఈస్టర్ గా క్రైస్తవులు వేడుకలు జరుపుకుంటారు. క్రైస్తవులు సమాధులను కొవ్వొత్తులు, పూలతో సుందరంగా అలంకరించి కుటుంబ సమేతంగా ప్రార్థనలు నిర్వహించారు.
GNTR: రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తోందని గుంటూరు జిల్లా ఇంచార్జ్ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. చిత్రీకరణలకు సింగిల్ విండో ద్వారా అనుమతులు కల్పిస్తూ, స్టూడియోల నిర్మాణానికి భూములు కేటాయిస్తున్నామని చెప్పారు. చిన్న సినిమాలకు రాయితీలు, భారీ చిత్రాలకు టికెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
PPM: దోమల లార్వా ప్రభావిత ప్రదేశాలను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టడమే లక్ష్యంగా డ్రైడే నిర్వహించాలని జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. నిడగల్లు లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. గ్రామాల్లో ఎక్కడెక్కడ నీరు నిల్వ ఉంటుందో అందుకు కారణాలు తెలుసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో ఏటీఎం కేంద్రాల వద్ద అపరిచితుల మాటలు నమ్మి డబ్బులు ఇవ్వొద్దని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం హెచ్చరించారు. అత్యవసరం పేరుతో నగదు తీసుకుని ఫోన్‌పే, గూగుల్ పే చేశామని చూపిస్తూ మోసం చేసే ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. డబ్బులు ఖాతాలో జమ కాకపోవడం లేదా హోల్డ్‌లో పడిపోవడం వల్ల నష్టం కలుగుతుందని పేర్కొన్నారు.
అన్నమయ్య: జువ్వలదిన్నెలో రూ.45 కోట్లతో ఆటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్ ఏర్పాటు చేసి 1000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఫిషింగ్ హార్బర్ అభివృద్ధితో 25 వేల మత్స్యకార కుటుంబాలకు లాభం చేకూరుతుందని, అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటోందని విమర్శించారు. షిప్‌బిల్డింగ్, మెరైన్ ఇంజినీరింగ్ రంగాల్లో యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయని అన్నారు.
SKLM: రాష్ట్ర రహదారులు, భవనాలు(R&B) శాఖా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈనెల 5, 6వ తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రి 5న జిల్లాకు వస్తారని చెప్పారు. సంతబొమ్మాళి మండలం మూలపేటలో గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ప సమీక్షా సమావేశం 6న నిర్వహిస్తారన్నారు.
VZM: రాజాం పట్టణంలో పందుల బెడద తీవ్రంగా మారింది. సత్యనారాయణపురం, ఆదర్శనగర్, మెంతిపేట కాలనీల్లో మురుగు నీరు నిల్వ ఉండటంతో పందులు విపరీతంగా సంచరిస్తున్నాయి. ఇళ్లలోకే ప్రవేశిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వ్యాధుల ముప్పు పెరుగుతుందని ప్రజలు భయపడుతున్నారు.
ATP: CM చంద్రబాబు రేపు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటన షెడ్యూల్‌ను కలెక్టర్ ఆనంద్ విడుదల చేశారు. ఉ.11:10కు యాడికి మండలం వేములపాడు చేరుకోనున్న సీఎం, మార్కెట్ యార్డ్‌లో నిర్వహించే ‘ప్రజా వేదిక’ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం పెండేకల్లు రిజర్వాయర్ తీర ప్రాంతాన్ని సందర్శించి నీటి సంరక్షణ పనులను పరిశీలిస్తారు. తర్వాత టీడీపీ కార్యకర్తలతో భేటే అవుతారు.
E.G: రాజమండ్రి మార్కెట్లో ఆదివారం చికెన్ ధరలు తగ్గి ప్రజలకు ఊరట కలిగించాయి. గత వారం కంటే రేట్లు తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం స్కిన్లెస్ చికెన్ కిలో రూ.300, స్కిన్‌తో రూ.280, లైవ్ కోడి రూ.180గా విక్రయిస్తున్నారు. మటన్ ధర మాత్రం కిలో రూ.1000గా కొనసాగుతోంది. ధరలు తగ్గడంతో మాంసం దుకాణాలు వినియోగదారులతో సందడిగా మారాయి.