• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టు అమలు చేయాలని వినతి

E.G: అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ధవలేశ్వరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్నాలకోట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టు తక్షణం అమలు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10,000 స్టైఫండ్, 55 ఏళ్లు నిండిన న్యాయవాదులకు రూ.15,000 పెన్షన్ ఇవ్వాలని కోరారు.

April 13, 2026 / 05:30 PM IST

VOAల సమస్యలను పరిష్కరించాలి: సీఐటీయూ

W.G: పొదుపు సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్న వీవోఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. సోమవారం వీరవాసరం మండల పరిషత్ కార్యాలయం వద్ద వీవోఏలు నిరసన చేపట్టారు. విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న పని ఒత్తిడిని, ఇతర ఇబ్బందులను వివరిస్తూ ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

April 13, 2026 / 05:28 PM IST

కళాశాలలో ‘నారీ శక్తి’ చట్టంపై అవగాహన సదస్సు

AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘నారీ శక్తి’ వందన్ అధినియంపై ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ డా. ఎం.ధర్మారావు మాట్లాడుతూ.. మహిళలకు లోక్‌సభ, అసెంబ్లీ సీట్లలో 33% రిజర్వేషన్ కల్పించే ఈ చట్టం 2029 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. 2044 వరకు మహిళల రాజకీయ భాగస్వామ్యం పెరిగి దేశ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

April 13, 2026 / 05:25 PM IST

తిరుచానూరులో TDP నేతల వసూళ్లు: వైసీపీ

TPT: తిరుచానూరులో అమ్మవారి ఆలయం వద్ద టీడీపీ నేతలు వసూళ్ల దందా చేస్తున్నారని వైసీపీ మండిపడింది. ‘ఇష్టమొచ్చినట్లు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఎదురు తిరిగిన భక్తులపై పాశవికంగా దాడులు చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో టీడీపీ గూండాలు మరింతగా రెచ్చిపోతున్నారు. భక్తులు ఇంత ఇబ్బంది పడుతున్నా టీటీడీ చోద్యం చూస్తోంది’ అని వైసీపీ ట్వీట్ చేసింది.

April 13, 2026 / 05:05 PM IST

తుమ్మి కాపల్లిలో మామిడి టేకు తోటలు దగ్ధం

VZM: గజపతినగరం మండలంలోని తుమ్మి కాపల్లి గ్రామంలో ఇవాళ జరిగిన అగ్ని ప్రమాదంలో మామిడి టేకు తోటలు కాలిపోయాయి. గ్రామానికి చెందిన ఎస్ శంకర్ ఎస్ పైడితల్లి ఎస్ నారాయణప్పుడు కె తాతి నాయుడు కె నారాయణల కు చెందిన 10 ఎకరాల విస్తీర్ణంలో గల మామిడి టేకు తోటలో కాలిపోవడంతో రూ. లక్ష వరకు ఆస్తి నష్టం సంభవించిందని స్థానికులు తెలపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

April 13, 2026 / 05:05 PM IST

కౌతాళంలో జలధార–జల హారతి కార్యక్రమం

KRNL: కౌతాళం మండలం వల్లూరు చెరువు వద్ద ఇవాళ “జలధార–జల హారతి” కార్యక్రమం నిర్వహించారు. మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నీటి చుక్కను సంరక్షించాలని పిలుపునిచ్చారు. చెక్ డ్యాంలు, ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలు పెంచాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మండల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

April 13, 2026 / 05:03 PM IST

13 ఇళ్లలో దొంగతనాలు.. నిందితుడు అరెస్ట్

ASR: రంపచోడవరం పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో 13 ఇళ్లలో దొంగతనాలు చేసిన మజ్జి శివప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అడ్డతీగల ఎస్సై వినోద్ చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఏఎస్పీ హేమంత్ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన 123 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.1.50 లక్షల విలువైన వెండి వస్తువులను కూడా రికవరీ చేసి రిమాండ్‌కు తరలించారు.

April 13, 2026 / 05:00 PM IST

ఎమ్మెల్యేను సత్కరించిన కలెక్టర్

CTR: జీడీ నెల్లూరులో ‘పీఎం సూర్య ఘర్’ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ సుమిత్ కుమార్, ఏఎంసీ ఛైర్మన్ కృష్ణ నాయుడుతో కలిసి ఎమ్మెల్యే డా. థామస్‌ను సత్కరించారు. చిత్తూరు జిల్లాలో సీఎం నియోజకవర్గంతోపాటు జీడీ నెల్లూరు నియోజకవర్గాన్ని మరో కుప్పంగా అభివృద్ధి చేయడానికి సహకరించాలని ఎమ్మెల్యే, కలెక్టర్‌ను కోరారు.

April 13, 2026 / 05:00 PM IST

‘పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి’

AKP: పిల్లల ఆరోగ్యంపై తల్లులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్ల వరహా నర్సింగరావు అన్నారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మీరాబి ఆధ్వర్యంలో ఇవాళ గ్రామంలో ‘పోషణ్ పక్వాడ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలకు ఇంటిలో తయారుచేసిన పదార్థాలే పెట్టాలన్నారు. జింక్ ఫుడ్స్‌కు పిల్లలను దూరంగా ఉంచాలన్నారు.

April 13, 2026 / 05:00 PM IST

జిల్లా జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభ: కలెక్టర్

మన్యం జిల్లా అభివృద్ధి సూచికల్లో వేగంగా పురోగతి సాధిస్తూ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందుతోందని జిల్లా కలెక్టర్ తెలిపారు. తన పదవీకాలం 6 నెలలు పూర్తైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కాలంలో జిల్లా సాధించిన విజయాలు గర్వకారణమన్నారు. ​దేశవ్యాప్తంగా ఉన్న 112 ఆస్పిరేషనల్ జిల్లాల పోటీలో జిల్లా నిర్ణీత గడువు కంటే 3రోజుల ముందుగానే లక్ష్యాలు చేరుకున్నాయన్నారు.

April 13, 2026 / 05:00 PM IST

సమస్యలు తెలుసుకున్న సీపీఎం బృందం

AKP: భూసేకరణ జరుగుతున్న రాంబిల్లి మండలం వెంకయ్యపాలెం, గజరెడ్డి పాలెం, ఎం. చింతువ గ్రామాల్లో సీపీఎం బృందం ఇవాళ పర్యటించి రైతులను ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సీపీఎం నాయకులు దేవుడు నాయుడు, సోమ నాయుడు మాట్లాడుతూ.. గూగుల్, రెన్యూ సోలార్ పరిశ్రమల ఏర్పాటు కోసం పచ్చని ప్రాంతాన్ని అధికారులు సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు.

April 13, 2026 / 05:00 PM IST

సోంపేటలో ఎక్సైజ్ అధికారుల మెరుపు దాడులు

SKLM: సోంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పలుచోట్ల ఎక్సైజ్ సీఐ జీవి రమణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 400 నాటు సారా ప్యాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నాటు సారాపై ఏమైనా సమాచారం ఉంటే 9440902358 నెంబర్‌కు తెలియపరచాలని సీఐ తెలిపారు.

April 13, 2026 / 05:00 PM IST

ఈనెల 15న వారి ఖాతాల్లో రూ.20 వేలు జమ

NLR: మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేసేది టీడీపీ మాత్రమేనని, అందుకే మత్స్యకారులు ఎప్పుడూ టీడీపీకి అండగా నిలబడ్డారని కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమం ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతుందన్నారు. ఈ నెల 15న మత్స్యకారులకు రూ.20 వేలు ఖాతాలో జమవుతుందన్నారు.

April 13, 2026 / 05:00 PM IST

భూ అక్రమాలపై జేసీకి పరిటాల శ్రీరామ్ వినతి

సత్యసాయి: గత ప్రభుత్వ హయాంలో రీ సర్వే పేరుతో జరిగిన భూ అక్రమాలపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్ కోరారు. సోమవారం సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

April 13, 2026 / 05:00 PM IST

ఆలయాల పరిరక్షణకు ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

KKD: గత ప్రభుత్వ హయాంలో విజయనగరం జిల్లా రామతీర్థంలో ధ్వంసమైన కోదండ రామస్వామి, సీతమ్మ, లక్ష్మణ స్వామి విగ్రహాలను వైఖానస ఆగమన ప్రకారం కోటిపల్లి గోదావరి నదిలో జలాధివాసం చేయనున్నారు. నిమజ్జనానికి బయలుదేరిన రథం అన్నవరం చేరుకోవడంతో ఎమ్మెల్యే సత్యప్రభ విగ్రహాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం ఆలయాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

April 13, 2026 / 05:00 PM IST