AKP: పిల్లల ఆరోగ్యంపై తల్లులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్ల వరహా నర్సింగరావు అన్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ మీరాబి ఆధ్వర్యంలో ఇవాళ గ్రామంలో ‘పోషణ్ పక్వాడ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలకు ఇంటిలో తయారుచేసిన పదార్థాలే పెట్టాలన్నారు. జింక్ ఫుడ్స్‌కు పిల్లలను దూరంగా ఉంచాలన్నారు.